Thursday, December 21, 2017

real nagini in telugu | do nagins really exist in telugu | secrets about...

Mothers market | ima keithel | female market |world biggest khwairamband...

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా మార్కెట్.

అదే మణిపూర్, ఇంఫాల్ లోని అమ్మల మార్కెట్   

Wednesday, December 20, 2017

చందనోత్సవ విశేషాలు | History about Simhachalam part 2

సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవం ఎందుకు చేస్తారు....? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీకోసం....

సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా .....? | Secrets about Simhachalam part - 1|

సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా .....?

#సింహాచలం, సింహాచల క్షేత్ర మహిమ, వరాహ లక్ష్మీ నరసింహక్షేత్రం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర 

Monday, December 18, 2017

Hot water spring in unkeshwar temple, maharashtra telugu | unkeswar mahi...

అక్కడ స్నానం చేస్తే ఎలాంటి వ్యాధయినా మటుమాయం కావలసిందే!

 #Hot #waterspring in ##unkeshwar temple, maharashtra telugu | unkeswar mahima in telugu

Sunday, December 17, 2017

Sri Mukhalingam/ The most popular piligrim centre srikakulam | secret of...

ఒకప్పుడది అంగరంగ వైభవంగా వెలిగిపోయిన కళింగ సామ్రాజ్యానికి రాజధాని. మరి నేడు.........!
Shaiva kshetram #srimukhalingam ,#srikakulam, in #Andhrapradesh,శ్రీముఖలింగం
https://www.youtube.com/watch?v=FYWbmFCjIzg

Monday, December 11, 2017

anastasiya knyazeva World top child model beautiful girl in world telugu...

suprabhatam | venkateswara suprabhatam | srivari suprabhatam | venkates...

ఫ్రెండ్స్ సుప్రభాతాలు ఎన్ని ఉన్నా సుప్రభాతం అనగానే వెంటనే వేంకటేశ్వర సుప్రభాతమే మనకు గుర్తొస్తుంది. మరి ఆ వేంకటేశ్వర సుప్రభాతానికి అంత ప్రాముఖ్యత ఎందుకో తెలుసుకోవాలంటే ఈ విడియో చూడండి.

facts about Tawang | First Sun rising place | మనదేశంలో సూర్యుడు మొట్టమొ...

Hai friends please watch this video for knowning facts about first #sunrising place #Tawang and beauty of tawang, #Arunachal Pradesh

Tuesday, November 21, 2017

Sunday, November 19, 2017

#Fire haircut | Fire #hairstyle | fire hair dye | | fire hairstyle telu...

ఈ రోజుల్లో వింత వింత hairstyles ఎన్నో చూస్తున్నాం. కాస్త జుట్టున్న ప్రతి వారూ ఓ different hairstyle తో కనిపించడానికి తాపత్రయ పడుతుంటారు. అందుకు తగినట్లే hair stylist లు కూడా పుట్టుకొస్తున్నారు. అలాంటి వింత హెయిర్ స్టైల్ fire hairstyle

Friday, November 17, 2017

Araku valley Most beautiful hill station | visakhapatnam | Andhra prades...

Araku Valley is a famous and most beautiful Hill station in Visakhapatnam district in the state of Andhra Pradesh in India. It is a valley in the Eastern Ghats inhabited by different tribes. It's surrounded by the thick forests of the Eastern Ghats mountain range. The Tribal Museum is dedicated to the area's numerous indigenous tribes, known for their traditional Dhimsa dance, and showcases traditional handicrafts. A miniature train runs through Padmapuram Gardens, with its sculptures and tree-top huts. It is located at a distance of 120 KM from Visakhapatnam ( Vizag ). It is famous for its scenic beauty. Located on the eastern ghats , it has valley, waterfalls and streams flowing by the side of the train track and roads. The journey to Araku Valley is the most enjoying as the rail passes through tunnels, hill sides and streams.  It is better to go to Araku by train and return by road.

Rajput karnisena warn to padmavathi Deepika padukone | Breaking news abo...

#Rajput karnisena, #padmavathi movie, deepikaa padukone, #Bollywood news, rajput karnisena warn to padmavathi deepikaa padukone,sanjay leela bhansali, Ranvir singh, shahid kapoor

Maddi anjaneya swamy temple | jangareddygudem | west Godavari | Teertha...

#Teertha yatra, #Maddi anjaneya swamy temple,#jangareddygudem, #west Godavari, #Teerthayatra, #guravayi gudem, #Andhra Pradesh

Wednesday, September 27, 2017

tirupati temple telugu | Tirumala tirupahti web series telugu part-2| ti...

#tirupathi secrets, #tirumala tirupathi, #secrets of seven hills, తిరుమల తిరుపతి, తిరుమల #యాత్రMonday, September 4, 2017

భయంకరమైన రైల్వేస్టేషన్లు

భయంకరమైన రైల్వేస్టేషన్లు

ఆ స్టేషన్ల లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. 
గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్టేషన్ల లోకి వెళ్ళగలరు.

భారతీయ రైల్వేలకు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నెట్వర్క్ ఉంది.

రైల్వే స్టేషన్చేరుకోగానే అక్కడ ఓ చిన్న ప్రపంచాన్నే చూడొచ్చు. రకరకాల మనుషులతో, వారు మాట్లాడే భాషలతో, రణగొణధ్వనులతో, చాయ్ వాలాల హడావుడి, చిరుతిళ్ళు అమ్ముకునేవారి కేకలు, అరుపులతో కోలాహలంగా,   సందడిగా ఉంటుంది. కానీ కొన్ని రైల్వే స్టేషన్ ల పేర్లు వింటే మాత్రం ఇవేవీ      జ్ఞాపకం రావు. భయంతో ఓణికిపోవడం తప్ప. అలాంటి భయంకరమైన              రైల్వే స్టేషన్ ల గురించి తెలుసుకుందాం.

 టన్నెల్ నెం. 33

       
హిమాచల్ ప్రదేశ్ .....అందానికి, ఆహ్లాదానికి, చల్లదనానికి మారుపేరు. 

అందులోనూ సిమ్లా అయితే ఇక చెప్పనక్కరలేదు. అంత చల్లని ప్రదేశంలో కుడా చెమటలు కారేలా చేస్తుంది.  టన్నెల్ నెం. 33. సిమ్లాలో  బరోగ్              రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉంది టన్నెల్ నెం.33. ఈ టన్నెల్ ద్వారా         ప్రయాణం చేస్తున్నపుడు తరచుగా ఒక ఆత్మ కనిపిస్తుంది అన్నది 
బాగా ప్రచారంలో ఉన్న విషయం. టన్నెల్ గోడల మీద లీలగా,                     నీడలా కనబడే ఆ ఆత్మ అక్కడే తిరుగుతూ ఆ మార్గం గుండా 
వచ్చే పోయే వారందరికీ కనబడుతూ ఉంటుందని భయంభయంగా    చెప్పుకుంటారు. ఇంతకీ క్రమం తప్పకుండా అక్కడే తిరుగాడుతున్న 
ఆ ఆత్మ ఎవరిది. అక్కడే ఎందుకు తిరుగుతుంది. .........                         బ్రిటీషు వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో 

కల్కా ప్రాంతంలో రైలు మార్గాన్ని వెయ్యాలని ఆ బాధ్యతను కల్నల్                

బరోగ్ కు అప్పగించారు. అయితే బరోగ్ అంచనాలు తారుమారు               కావడంతో నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. అప్పటికే చాల డబ్బు         ఖర్చయింది. ఓ వైపు చేపట్టిన పనిలో పరాజయం, మరోవైపు అధికారుల         వత్తిడి ..... దాంతో బరోగ్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.     అతడిని ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. తరువాత టన్నెల్ నిర్మాణం       పూర్తయింది. అయితే ఆ తర్వాత ఆ టన్నెల్ గుండా రైళ్ళు వెళుతున్నపుడు వింత,వింత శబ్దాలు, ఎవరో బాధగా ఏడవడం వినిపించేదట. దాంతోపాటు టన్నెల్ గోడల మీద లీలగా, నీడగా ఒక ఆత్మ కనిపించడం మొదలయింది. క్రమంగా ఆ ఆత్మను గుర్తించిన వారు అది కల్నల్ బరోగ్ ఆత్మగా తేల్చారు. తరచుగా  ఆత్మ కనబడడంతో ప్రజల భయంతో వణికిపోవడం చూసి ఒక సందర్భంలో ఈ         టన్నెల్ ను మూసివేయాలని ఒక మెటల్ డోర్ చేయించి ప్రారంభ ద్వారం దగ్గర పెట్టించిందట ప్రభుత్వం. కాని ఆ మర్నాడే దానికదే విరిగి పోవడంతో ఆ     ప్రయత్నాన్ని మానుకున్నారట. అయితే ఈ దెయ్యం చాల మంచి           దెయ్యమని ఎవర్నీ ఏమీ చేసిన దాఖలాలు లేవని కూడా చెప్తుంటారు.             ఎంత మంచిదయినా దెయ్యమంటే ఎవరైనా భయపడకుండా ఉండగలరా!       అందుకే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఈ టన్నెల్ దగ్గరకు     వచ్చేసరికి మాత్రం ప్రయాణికులు భయంతో వణికిపోతుంటారట.

బేగన్ కోడోర్ స్టేషన్ పశ్చిమబెంగాల్

ఇది ప్రేతాత్మల స్టేషన్ గా ప్రఖ్యాతి చెందింది. కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1967 

ప్రాంతంలో ఇక్కడ తరచుగా రాత్రి వేళల్లోను, మనుష్య సంచారం అంతగా ఉండని 

సమయాల్లోనూ ఒక స్త్రీ తెల్లచీరతో కనబడుతుండేదని, అలా ఆమెను చూసినవారు 

కొద్దికాలానికే అకారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేవారని 

కధనాలున్నాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడంతో ఆ స్టేషన్ 

పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ భయం ఎంతగా     పెరిగిపోయిందంటే ఆ స్టేషన్ లో ఎవరూ దిగడం కూడా మానేశారు. దాంతో     దాదాపు 42 సంవత్సరాలు ఆ స్టేషన్ ను మూసేశారు. మళ్ళీ 2007     మమతాబెనర్జీ టైంలో ఈ స్టేషన్ పునరుద్ధరించడం జరిగింది. అయితే             అప్పటి ఆ అనుభవాలు, నమ్మకాలు మాత్రం ఇంకా అక్కడివారిని వెంటాడుతునే ఉన్నాయట. గతంలోని కధనాలతో ఇప్పుడదో టూరిస్ట్ స్పాట్ గా మారింది.
నైని స్టేషన్ ------ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని నైని స్టేషన్ మరో ప్రేతాత్మల స్టేషన్ గా చెప్తారు. గతంలో అంటే బ్రిటిష్ 

వారి కాలంలో ఇక్కడ ఒక జైలుండేదట. అ జైలులో స్వాతంత్ర్యసమరయోధులను 

ఉంచి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేసేవారట. ఈ జైలు రైల్వే స్టేషన్ కి 

దగ్గరలోనే ఉండేదని  జైలులో చిత్రహింసలనుభవించి మరణించిన వారు ప్రేతాత్మలుగా 

మారి ఈ స్టేషన్ లో సంచరిస్తున్నారని అక్కడివారి బలమైన నమ్మకం. ఆ నమ్మకం 

ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

డిల్లీలోని ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్

ఇక్కడి పరిస్థితి మరీ విచిత్రం. ఇక్కడ స్టేషన్ చుట్టుపక్కల ఒక స్త్రీ

ప్రేతాత్మ విచిత్రమైన చేష్టలతో ప్రజల్ని బెంబేలేత్తిస్తోందట. అకస్మాత్తుగా గట్టిగా అరుస్తూ 

కనబడి భయపెట్టడం, అటుగా వెళుతున్న కార్లను గ్లాస్ ల మీద కొట్టి ఆపడం, కార్ల 

వెంట పరుగెత్తడం, ఒక్కోసారి హటాత్తుగా కనబడి వారిని చెంపదెబ్బలు కొట్టడం చేసి 

బెంబేలెత్తిస్తోందట.

రబీంద్ర సరోవర్ మెట్రో రైల్వే స్టేషన్  ----కోల్కతా

ఇక్కడ మరీ విచిత్రమైన సన్నివేశాలు కనబడుతుంటాయని కథలు కథలుగా 

చెప్పుకుంటారు. అంతవరకు మామూలుగానే ఉన్న ప్రయాణికులు సడన్ గా ఎవరో 

తోసినట్టుగా స్పీడ్ గా వస్తున్న రైలు కింద పడిపోతుంటారట. ఇలాంటి ఆత్మహత్యలు 

చాల పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయట ఇక్కడ. దీనికంతటికీ అక్కడున్న ప్రేతత్మలే 

కారణమని, చనిపోయినవారి ఆత్మలు నీడల రూపంలో అక్కడే తిరుగుతూ 

కనిపిస్తాయని అక్కడ కథలు కథలుగా  చెప్పుకుంటారు. చివరి రైలు వెళ్ళిపోయిన 

తరువాత ఆ స్టేషన్ లో ఎవరైనా ఉంటే అక్కడ ఎదురైన భయంకరమైన అనుభవాలకు 

గుండాగి చావాల్సిందే అంటారు. దీనికి సంబంధించిన వీడియో చూడండి......


Saturday, September 2, 2017

వారణాసిలో వేశ్యలు చేసే వింత నృత్యాలు

వారణాసిలో వేశ్యలు చేసే వింత నృత్యాలు 

ఈ నృత్యాల గురించి వింటే ఔరా! అని ముక్కున వేలేసుకోక మానరు. ఎందుకంటే ఇది 

స్మశాన నృత్యం. వారణాసిలో స్మశానమే దీనికి వేదిక. సమాజం చీదరించుకునే వేశ్యలే 

కళాకారులు. శవాలు, శవాల్ని చూసి ఏడుస్తున్న బంధువులే ప్రేక్షకులు.  ఇదేంటి ....

 భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, మణిపురి ఇలా రకరకాల నృత్యరీతుల

 గురించి విన్నాం. గానీ ఇలాంటి డేన్స్ గురించి ఎప్పుడూ వినలేదే! అనుకుంటున్నారు

 కదూ.... వస్తున్నా ... వస్తున్నా ఆ వివరాల్లోకే వస్తున్నా.... 

 ఎగిసిపడుతున్న చితిమంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తారు వేశ్యలు. ఇది 

వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న వింత ఆచారం. నమ్మకం కలగడం లేడు

 కదూ.... కాని ఇది అక్షరసత్యం. సుమారు 450 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న

 ఆచారం. రాజా మంజీసింగ్ కాలం నుంచి ఉన్న ఈ ఆచారం మళ్ళీ బాబా సంశాన్ నాథ్ 

ఆధ్వర్యంలో పునఃప్రారంభించబడిందట. ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగనాడు 

జరిగే ఆ నృత్య ప్రదర్శన ప్రధానంగా  వారణాసి లోని మణికర్ణికా ఘాట్ లో జరుగుతుంది. 

  శ్రుంగార్ ఆఫ్ స్మశానేశ్వర్ మహాదేవ్ గా పిలుచుకునే ఈ వేడుకలో పాల్గొనే వేశ్యలు 

శివదాస్పూర్, మండూదిహ్, చునార్, దల్మదిండి వంటి సుదూర ప్రాంతాల నుంచి

 వారణాసికి గుంపులు గుంపులుగా వచ్చిన వేశ్యలు అక్కడ కాలుతున్న చితిమంటల

 చుట్టూ తిరుగుతూ డేన్స్ చేస్తారు. ఇలా నృత్యం చేసే ఆ వేదికను మహాస్మశాన్ అని

, గొప్ప దహనభూమి అని పిలుస్తారు. అక్కడ స్మశానవాసి,  భూతనాధుడైన

 పరమేశ్వరుని స్మశానేశ్వార్ గా పూజలు చేస్తారట. సారాయి, భంగు, గంజాయి, 

మాంసం  వంటి పదార్ధాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.   తరువాత రాత్రంతా 

ఆడి, పాడి స్వామిని అర్చిస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎందుకొచ్చిందో తెలుసా ...... 

ఇదంతా ఆ వేశ్యలు తమ తరువాతి జన్మలోనైనా తమకు ఇలాంటి నీచజన్మ కాకుండా 

మంచి జన్మ రావాలని స్మశానవాసి అయిన ఆ మహాదేవుని ఆ స్మశానంలోనే తమ 

నృత్యాల ద్వారా కోరుకుంటారట. ఈ నృత్యాలను చూడడం కోసం తండోపతండాలుగా

 జనాలు వస్తారట. ప్రళయకాలంలో కూడా నాశనంకాని పవిత్రభూమి కాశీగా చెప్తారు.

 అందుకే అంతటి పవిత్రమైన ఆ భూమి మీద స్మశానేశ్వర్ బాబాని ఆరాధిస్తే, బాబా 

తమ మొర విని తమకు మంచి జీవితాన్ని ప్రసదిస్తాదన్న  నమ్మకంతో ఈ ఆచారాన్ని

 కొనసాగిస్తున్నామని ఆ వేడుకలో పాల్గొనే వేశ్యలు చెప్తారు.

       

Thursday, July 6, 2017

Kiradu/ The most mysterious temple/ Rajasthan/ Barmar/Unknown facts telugu

Ghost temple, haunted places in #Rajasthan, #mysterious temple #kiradu, kiradu temple history, mystery of kiradu, horror places, fabulous review of kiradu temples. 


https://www.youtube.com/watch?v=1NhzQ3jN77U&t=3s

Saturday, July 1, 2017

Tawang | First Sun rising place | మనదేశంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే ప...

#tawang, first #sunrising place in India, indo chaina #border, beautyful tourist place, Arunachal pradesh, world famous buddist pilgrim centre

 https://www.youtube.com/watch?v=NHlltt4cPxk&t=16s

Thursday, June 22, 2017

Do Nagin really exist?|| Unknown facts telugu|| నాగినిల గురించి కొన్ని ...

Real facts about nagin 

Nagin..... it's very crazy word. There are many secrets behind Nagin. Ichchadhari Naag or Naagin is a mythical shape-shifting cobra in Indian folklore. From TV serials to films, the concept of icchadhari nagin is more often believed to be the stuff of folklore or the ancient past, or just a superstition, having no connection with modern reality. In this video i reveal the secrets and known facts about nagin.

Thursday, June 15, 2017

aghori life style | aghori secrets | facts about aghoras

Secrets about aghori 

 Want to know about the facts of Aghori. There are many secrets about Aghori. like aghoras are cannibals, neccad, and most obnormal people. so in this episode i will reveal something about aghoras

Monday, June 12, 2017

Secrets about Tattoo | పచ్చబొట్టు - వేల సంవత్సరాల చరిత్ర

Interesting facts about tattoo 

Tattoo play a prominent role in tradition. Earlier tattoos can be found Egypt during the construction of great pyramids. When the Egyptians empire expanded, tattooing art also expanded. The purpose of tattooing varies from culture. Some interesting secrets about  tattoo is shown in this video   

Friday, June 9, 2017

shambhala || The Hidden city ||Secret of Himalayas || Unknown facts telu...

Shambhala, a Hidden city.

Shambhala, a Hidden city. Mythical kingdom. which is a Sanskrit word meaning “place of peace” or “place of silence”.is a mythical paradise spoken of in ancient texts, including the Kalachakra Tantra and the ancient scriptures of the Zhang Zhung culture which predated Tibetan Buddhism in western Tibet. According to ancient texts, it is a land only the pure of heart can live, a place where love and wisdom reigns and where people are immune to suffering, want or old age.
It is called so many names, Like the Forbidden Land, the Land of White Waters, Land of Radiant Spirits, Land of Living Fire, Land of the Living Gods and Land of Wonders.

Friday, May 26, 2017

Amazing restaurants in world || Wonders || Unknown facts telugu || వింతల...

Most #Amazing hotels in the world #salt hotel, #sand hotel, #ice hotel
వింతలు, విశేషాలు, విడ్డూరాలు

would you like to visit some of the world's most extraordinary hotels ? would you like to enjoy in salt or sand hotel? would you rather stay in an ice hotel or breakfast with snakes? Take a look at some of the most amazing hotels in the world.

 https://www.youtube.com/watch?v=6LD8SUuS3Gk

Tuesday, May 23, 2017

పక్షుల ఆత్మహత్య కేంద్రం వింతలు, విశేషాలు, విడ్డూరాలు

పక్షుల ఆత్మహత్య కేంద్రం 

birds కూడా ఆలోచించగలవా? మనుషుల్లాగే పక్షులకు కూడా ఆత్మహత్య  చేసుకోవాలనే ఆలోచన వస్తుందా? ఒకవేళ వచ్చినా వందలాది పక్షులు ఒకేసారి కట్టకట్టుకొని ఒకే ప్లేస్ కి వెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి? ఆ వింతలు,  విశేషాలు  మీ కోసం..... 

Sunday, May 21, 2017

కోటి దేవతలు కొలువు తీరిన కొండ వింతలు విశేషాలు విడ్డూరాలు

ఉనకోటి - కోటి దేవతలు కొలువుతీరిన కొండ 

 అద్భుతాలకు నెలవు ఈ భూమి.  అలాంటి ఓ అద్భుత ప్రదేశం త్రిపుర రాష్ట్రంలోని ఉనకోటి. ఆ ఉనకోటి వింతలు విశేషాలు అద్భుతాలు ఈ వీడియోలో చూడండి.

 Bas relief is a sculpture in which a image will be projected at a shallow depth which is often used in Egyptian and Asian art .One of the biggest bas relief sculpture can be found in Unakoti situated in the north eastern state of Tripura. Unakoti is a shaiva piligramage spot which have one less than a crore stone images and carvings.the story of the piligramage spot unakoti is described in this video with subtitles.  

Friday, May 19, 2017

పచ్చబొట్టు - వేల సంవత్సరాల చరిత్ర, విశేషాలు, వింతలు | Secrets about Tattoo

పచ్చబొట్టు విశేషాలు 

వేల సంవత్సరాల పురాతన కళ పచ్చబొట్టు. దీనికి సంబంధించి ఎన్నో కథలున్నాయి, వింతలున్నాయి, విచిత్రలున్నాయి. విశేషాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో....

Thursday, May 18, 2017

దెయ్యాలదిబ్బ మిస్టరీ - వింతలు, విశేషాలు, విడ్డూరాలు

దెయ్యాల దిబ్బ మిస్టరీ

 అదో సుందరమైన గ్రామం. ఒకప్పుడు ఊరినిండా జనంతో, అందమైన గృహాలతో కళకళలాడేది. మరిప్పుడు ఎడారిగా, దెయ్యాలదిబ్బ గా మారిపోయింది. ఆ దెయ్యాలదిబ్బ కుల్ ధర గ్రామ రహస్యం, వింతలు, విశేషాలు,  ఈ వీడియోలో...

Ghost villages hold a charm different from the ruin of castles. These villages give us a chance to look closely into the lives of people who once lived there. Rajasthan has no scarcity of such villages. one such village is kuldhara. This video shows the mysteries of the village..

Saturday, May 13, 2017

నమ్మలేని వింత నిజం గోల్డెన్ రాక్ వింతలు విశేషాలు

నమ్మలేని వింత నిజం గోల్డెన్ రాక్ 

 ఈ ప్రపంచమే ఒక వింత లోకం. అలాంటి వింతల గురించి విన్నపుడు ఛ... మరీ చెవుల్లో పువ్వులు పెట్టకండి అంటూ కొట్టి పడేస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ విషయాలు చెప్పిన వారిని పిచ్చోల్ని చూసినట్టు చూస్తాం. కానీ అదే విషయాన్ని మనం డైరెక్ట్ గా చుస్తే దాన్ని నమ్మలేక, నమ్మకుండా ఉండలేక అయోమయంలో పడిపోతాం. అలాంటి వింతే మయన్మార్ లోని క్యాయైక్టియా బుద్ధ దేవాలయంలో ఉంది. ఆ వింతలు, విశేషాలు, విడ్డూరాలు

Details of Miraculous golden rock in Mayanmar. A huge boulder covered by a gold leaf called the Golden Rock at Kyaiktiyo is delicately balanced on the edge of a cliff which is one of the Myanmar’s great piligrimage sites. It is said that the pagoda at the Golden Rock hold a hair of Buddha.

Sunday, April 30, 2017

చందనోత్సవంలో వింతలు, విశేషాలు

 #చందనోత్సవం,  

సింహగిరి

సింహాచలంలో స్వామి నిరంతరం చందనంతో కప్పబడి ఎందుకుంటాడు? చందనోత్సవం జరపడం వెనుక కారణమేంటి? ఈ విశేషాలు ఈ వీడియోలో....

why does Lord Narasimha in simhachalam always covered with sandal powder? The reasons of celebrating Chandanotsavam is shown in this video....

Monday, April 24, 2017

కర్నిమాత ఆలయ వింతలు, విశేషాలు

కర్నిమాత ఆలయం

The famous Hindu temple Karnimatha mandir is  located at Rajasthan. in Bikaneer. It is a place full of mysteries. Thousands of rats are worshiped there. Why are rats being worshiped here? check it out in this video,ఎలుకలే దేవతలుగా నమ్మకాలకు నిలయం మనదేశం. అందులో ఎన్నో వింతలు, విశేషాలు. అలాంటి ఒక వింత ఆలయం కర్నిమాత ఆలయం. ఇక్కడ ఎలుకలే దేవతలు. అసలు ఎలుకలు దేవతలెలా అయ్యాయి? ఎందుకయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో....

Saturday, April 22, 2017

సూర్యుడు మొట్టమొదట ఉదయించే .తవాంగ్ విశేషాలు

Tavang, First #Sun rising place in India,

 #Arunachala pradesh, #Dalailama సూర్యుడు

 Tawang - The first sun rising place in India and the place is called heaven on earth which is located in Arunachal pradesh. All the specialieties like natural beauties to Border conflicts are shown in this video....ఇండియాలో మొట్టమొదట సూర్యుడ్ని చూడగలిగేవారెవరో మీకు తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వాసులు. ప్రకృతి సౌందర్యం నుంచి సరిహద్దు గొడవల వరకు ఎన్నో ప్రత్యేకతలను కలిగిన తవాంగ్ విశేషాలు ఈ వీడియోలో ....

https://www.youtube.com/watch?v=NHlltt4cPxk

Thursday, April 20, 2017

తిరుపతి లడ్డు విశేషాలు | History of #TirupatiLaddu

తిరుపతి లడ్డు విశేషాలు

 తిరుపతి లడ్డు కి పెద్ద చరిత్రే ఉంది. తిరుపతి లడ్డు విశేషాలు ఈ వీడియోలో.....

Wednesday, April 19, 2017

తిరుమలలో సహజ శిలాతోరణం విశేషాలు | #Natural rock arch in Tirumala

#Natunal Rock arch in tirumala 

 #తిరుమలలోని #సహజశిలాతోరణం
#తిరుమల 

తిరుపతి

ప్రపంచ ప్రసిద్ధి చెందిన 3 సహజశిలాతోరణాలలో ఒకటి మన రాష్ట్రంలోనే తిరుమలలో ఉంది. తిరుమలలోని సహజశిలాతోరణం విశేషాలు ఈ వీడియోలో .......

Wednesday, April 12, 2017

మెర్మేయిడ్స్ విశేషాలు, వింతలు

#Mermaids #Secrets of mermaids #మెర్మేయిడ్స్, జలకన్యల విశేషాలు

Thursday, March 16, 2017

తిరుపతిలడ్డు విశేషాలు | History of #TirupatiLaddu

#Tirupati laddu Tirumala Srinivasuni prasadalu
#తిరుపతిలడ్డు చరిత్ర #శ్రీవారిలడ్డూ

https://www.youtube.com/watch?v=LiIQBwBcRBM&t=2s

Sunday, March 12, 2017

తిరుమలలో అద్భుతం సహజ శిలాతోరణం #Natural rock arch in Tirumala

తిరుమల లో అద్భుతం సహజ శిలాతోరణం 

భూలోక వైకుంఠమ్ తిరుమలలో ఎన్నో వింతలు, మరెన్నోవిచిత్రాలు, ఇంకెన్నో అద్భుతాలు. అలాంటి ఒక అద్భుతం సహజశిలాతోరణం. తిరుమలలో  సహజశిలాతోరణం విశేషాలు ఈ వీడియోలో....

Thursday, March 9, 2017

ముక్కుపుడక ముచ్చట్లు | ముక్కెర | Nose ring | nose piercing

ముక్కుపుడక ముచ్చట్లు

వివరంగా తెలుసుకుంటే ముక్కుపుడక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. పురాణాల్లో కూడా ముక్కుపుడక పెద్ద స్థానాన్నే సంపాదించుకుంది. nose ring, ముక్కెర, ముక్కుపుడక, ఇలా ఏ పేరుతొ పిలిచినా సనాతనుల నుంచి అధునికుల వరకు అందరి మనసుల్లోను ఒక ఫేషన్ ఐకాన్ గా ముద్ర వేసుకున్న ముక్కుపుడక ముచ్చట్లు మీకోసం....

 

Sunday, March 5, 2017


ఇండోనేసియాలో జరిగే శవాల పండుగ | Ma'nene | Mummy festival |

శవాల పండుగ

శవాల పండుగ ... వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ పండుగ వివరాలు వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఇండోనేసియాలో జరిగే శవాల పండుగ  మానేనేవివరాలు ఈ వీడియోలో....

Monday, February 27, 2017

jatinga | Birds suicide spot | పక్షుల ఆత్మహత్య కేంద్రం

పక్షుల ఆత్మహత్యా కేంద్రం

జతింగా ... వేలాది పక్షులు అక్కడికే వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. ఎందుకు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

 

Sunday, February 26, 2017

వినాయకుడికి ఒకటే దంతం ఉంటుందెందుకు?

వినాయకుడికి ఒకటే దంతం ఉంటుందెందుకు?

వినాయకుడు గజముఖుడు. గజముఖానికి రెండు దంతాలుండాలి కదా... మరి వినాయకుడికి ఒకటే దంతం ఉంటుందెందుకు? ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూడండి.

Sunday, February 12, 2017

మనదేశంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే ప్రదేశం తవాంగ్ | Tawang

మనదేశంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే ప్రదేశం తవాంగ్. 

ఇండియాలో మొట్టమొదట సూర్యుణ్ణి చూడగలిగేవారెవరో మీకు తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వాసులు.  ప్రకృతి సౌందర్యం నుండి సరిహద్దు గొడవల వరకు ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ప్రదేశం తవాంగ్ . భూలోక స్వర్గంగా పిలుచుకునే తవాంగ్ విశేషాలు ఈ వీడియోలో......

Thursday, February 9, 2017

ఆత్మహత్యల అడవి | ఒకిగహర | జపాన్ | Suicide forest | Aokigahara | Japan|

ఆత్మహత్యల అడవి .... అదో మాయల అడవి. 

అక్కడికి వెళితే అప్రయత్నంగానే ఆత్మహత్య చేసుకోవాలన్న థాట్ వచ్చేస్తుందట. కొన్ని దశాబ్దాలుగా అలాగే జరుగుతోందట. ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ అడవికే ఎందుకు వెళుతున్నారు? అసలా ఆత్మహత్యల అడవిలో ఏముంది? ఆ అడవిలో అంతుచిక్కని మిస్టరీ దాగుంది. ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో చూడండి.
Suicide forest | మాయల అడవి | ఆత్మహత్య

Monday, February 6, 2017

మోనాలిసా గురించి షాకింగ్ నిజాలు | Mona lisa | Monalisa | Shocking facts |

ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసా చిత్రం కొన్ని నిజాలు 

మోనాలిసా .... ఇటాలియన్ సైంటిస్ట్ లియోనార్డో డావిన్సీకి చిత్రకారుడుగా చరిత్రలో స్థానం కల్పించిన చిత్రాల్లో ముఖ్యమైనది మోనాలిసా చిత్రం. శతాబ్దాలుగా ఎన్నో పరిశోధనలకు కేంద్రబిందువు. అలాంటి మోనాలిసా చిత్రం గురించి కొన్ని షాకింగ్ నిజాలు ఈవీడియో లో

Thursday, February 2, 2017

ఆవులింత ఆరోగ్యమేనట | Yawning | is it healthy? | ఆవులింత గురించి మీకు తె...

ఆవులింత గురించి మీకు తెలియని నిజాలు 

కొన్ని విషయాలు వింటే చాల వింతగా ఉంటాయి. అలాంటివే ఆవులింత సంగతులు కూడా. ఒకరు ఆవులిస్తే పక్కనున్న వారికి కూడా ఆవులింత వచ్చేస్తుంది. ఎందుకలా అంటే దానికి ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదు. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నలుగురితో ఉన్నపుడు ఈ ఆవులింత మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది.. కానీ నిజానికి ఆవలింత రావడం ఆరోగ్యానికి సూచనేనట.ఈ విషయం మీద ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయట. ఆ పరిశోధనలేం చెప్తున్నాయో ఈ  ఆవులింత  సంగతులేంటో  చూద్దాం.

Monday, January 30, 2017

రావణాసురుడు మమ్మీగా భూమ్మీదే ఉన్నాడట | Ravan be nascent again ? | unknown facts telugu | Facts about Rava...

రావణాసురుడు మమ్మీగా ఇంకా ఈ భూమ్మీదే ఉన్నాడట

లంకలో  రావణుని ఆనవాళ్ళు దొరికాయట.

రావణాసురుడు రామాయణం లో ఒక ముఖ్య పాత్ర . ఎలా బ్రతకకూడదో చెప్పేది రావణాసురుడి పాత్ర. ఇదెప్పుడో రామాయణ కాలంనాటి మాట మరిప్పుడు కొత్తగా చెప్పుకోడానికేం ఉంది అనుకుంటున్నారా? ఉంది... ఆ మధ్య లంకలో రావణాసురుడు మమ్మీ బయటపడిందని ఒక వార్త సంచలనం సృష్టించింది. అదేంటో ఈ వీడియోలో చూడండి.

దేవతావృక్షాలు.... రావిచెట్టు

 దేవతావృక్షాలు.... రావిచెట్టు: బ్లాగ్ మిత్రులకు వందనాలు.... చెట్టు - పుట్ట, కొండ - కోన, రాయి - రప్ప... ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని భగవదంశగా చూడడం, దైవత్వాన్ని ఆపాదించ...

దెయ్యాల నిలయం | డ్యుమాస్ బీచ్ | Mistery beach | Dumas beach | Gujarat

దెయ్యాల నిలయం డ్యుమాస్ బీచ్ 

మిస్టరీ బీచ్ 

 బీచ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? అలల సవ్వడి, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం ఇవే కదా... కానీ ఆ బీచ్ కెళితే మాత్రం దెయ్యాలు  గుసగుసలాడతాయి. తెలియని అందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి  మనల్ని మాయం చేసేస్తుంది. అందుకే అదో మిస్టరీ బీచ్ గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఎక్కడుందా బీచ్....?
ఈ భయంకరమైన బీచ్ ఎక్కడుందో తెలుసా... గుజరాత్ లోని సూరత్ కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది..అదే ద్యుమాస్ బీచ్ .నిజానికి ఎంతో అందమైన బీచ్ డ్యుమాస్ బీచ్. కానీ అక్కడికి వెళ్లేవారికి మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయట. పగలంతా జనంతో కళకళలాడే బీచ్ సాయంత్రం అయేసరికి మాత్రం దెయ్యాల నిలయం గా మారిపోతుందట. ఆ బీచ్లో నడుస్తుంటే మన వెనకే కనబడకుండా దెయ్యాలు  మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుందట. మన చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుందట. ఎవరో బాధగా మూలుగుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, వినబడతాయాట. రాత్రిళ్ళు అక్కడికి వెళితే ఇక తిరిగి రారని కూడా కథనాలున్నాయి. నిజానికి ఇక్కడ నాలుగు బీచ్ లను కలిపి ద్యుమాస్ బీచ్ గా చెప్తారు. అందులో రెండు బీచ్ లు జనంతో కళకళలాడతాయి. మూడో బీచ్లో కూడా కాస్తో కూస్తో జనం ఉంటారు. నాలుగో బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల నిలయం .  విచిత్రమేమిటంటే ఈ బీచ్లో ఇసుక కూడా నల్లగా ఉంటుందట. అసలిక్కడ ఎందుకిలా జరుగుతోంది అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో స్మశానం ఉండేదని అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని, స్మశానంలో శవాల్ని కాల్చిన బూడిద కారణంగానే ఇక్కడి ఇసుక కూడా నల్లగా ఉంటుందని  స్థానికులు చెప్పే కథనం. ఈ కథనాల్లో నిజమెంతో చూద్దామని రాత్రిపూట ఆ బీచ్ కి వెళ్ళినవారు ఇక తిరిగిరాని సందర్భాలు, పగటిపూట కూడా భయంకరంగా ఏడుపులు, మూలుగులు వినబడిన  సందర్భాలున్నాయని కూడా చెప్తారు. చివరికి రాత్రిళ్ళు ఈ బీచ్ లోకి వెళ్ళడం కూడా నిషేదించారు.

Sunday, January 29, 2017

అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు?| కృష్ణుడు శపించాడా? Still Aswathama alive |

అశ్వత్థామ చిరంజీవి అవడానికి కృష్ణుని శాపమే కారణమా?

Aswathama | అశ్వత్థామ | శ్రీ కృష్ణుడు | చిరంజీవి
ఈ విశ్వంలో ఏడుగురు చిరంజీవులున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఏడుగురు చిరంజీవులలో అశ్వత్థామ కూడా ఒకరు. అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు? చిరంజీవి అయిన అశ్వత్థామ ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాడు? ఎప్పుడైనా, ఎవరికైనా కనిపించాడా? అశ్వత్థామ గురించి పురాణాలేమంటున్నాయి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో.........


Friday, January 27, 2017

మెర్మేయిడ్స్ నిజంగా ఉన్నాయా? | జలకన్యలు | మత్స్యకన్యలు | mermaids

మెర్మేయిడ్స్ గురించి మీకు తెలియని నిజాలు 

మెర్మేయిడ్స్ ... మత్స్యకన్యలు .... జలకన్యలు ... వీటి గురించి పురాణాలు, ప్రాచీన గ్రంధాలు విభిన్నమైన కథలు చెప్తున్నాయి. అసలు మెర్మేయిడ్స్ నిజంగా ఉన్నారా?  ఉన్నారో లేదో ఈ వీడియో చుస్తే మీకే తెలుస్తుంది

Wednesday, January 25, 2017

వింత హోటళ్ళు | వింత నిజాలు | Amazing restaurants | Unknown facts

ఈ వింత హోటళ్ళు  మీరు చూశారా?

కొన్ని విషయాలు వింటుంటే ఔరా; అని ముక్కున వేలోసుకోకుండా ఉండలేం. అలాంటి విషయాలే ఈ
వింత హోటళ్ళు.  ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు వాటిలో ఈ వింత హోటళ్ళు ప్రత్యేకం. అలాంటి
వింత హోటళ్ళు గురించి ఈ వీడియోలో.....

పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా? | మిస్టరీ | Birds sucside spot Jatinga

అక్కడ వేలాది పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.

 ఆ పక్షులకేం కష్టం వచ్చిందో ఒకటి కాదు రెండు కాదు వేలాది పక్షులు అక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అసలవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అక్కడికే వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి? అన్నీ ప్రశ్నలే.... అసలా పక్షుల ఆత్మహత్య సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Sunday, January 22, 2017

మరో గోపాల గోపాల | ఈ వింతలు విన్నారా? Funny things | crazy facts

మరో గోపాల ... గోపాల ... అన్నీ వింతలే 

ఈ ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు వింటే నవ్వు రావడమే కాదు.. what a crazy .. ఇలా కూడా జరుగుతుందా.... అని అవాక్కవుతాం. ఆ మధ్య గోపాల గోపాల సినిమా చూసి ఓవైపు నవ్వుకుంటూనే మరో వైపు ఆలోచనలో పడిపోయారు. ఎవరి నోట విన్నా గోపాల గోపాల అన్నమాటే. అలాంటి funny things , unknown facts telugu లో మీకోసం మరో గోపాల గోపాల .....

Saturday, January 21, 2017

వింత కేసులు

 ఈ ప్రపంచమే ఒక వింత. తరచి చూడాలేగాని ఈ ప్రపంచం ఒక విచిత్రాల హరివిల్లు.  అలాంటి కొన్ని వింతల గురించి ఇప్పుడు చూద్దాం..

విచిత్రం
సూర్యుని  మీద కేసు
ఆ మధ్య గోపాల గోపాల సినిమాలో హిరో దేవుడి మిద కేసు పెట్టడం మనం చూసాం. సరిగ్గా వ సంఘటన కూడా అలాంటిదే. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుణ్ని భగవంతుడిగా ఆరాధిస్తాం. పూజలు చేస్తాం. అలాంటి సుర్యభగవానుడినే కోర్టుకి ఈడ్చాడు ఓ ఘనుడు.  ఇంతకీ విషయమేమిటంటే మధ్యప్రదేశ్ లోని షాజపూర్ కి చెందిన శివపాల్ సింగ్ అనే వ్యక్తీ తన పనుల మీద ఫలోడి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన ఎండ మాడ్చేస్తోంది. అంతా ఉస్సు, అస్సు అనుకుంటూనే ఆ ఎండను భరిస్తున్నారు. కాని శివపాల్ సింగ్ రూటే వేరు కదా .. నువ్వలా చెలరేగిపోతే నేనూరుకుంటానా అని హుంకరించాడు. ఒక పరిమితి అనేది లేకుండా, చెలరేగుతూ ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యుని మీద చర్యలు తీసుకొని, ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టుకెళ్ళాడు. 

తాబేలు అరెస్ట్
ఇదింకా విచిత్రమైన కేసు. ఫ్లోరిడాలో పోలీసులొచ్చి ఉన్నపళంగా దాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు.  ఇంతకీ అదేం చేసిందంటే .... పాపం నోరులేని తాబేలేం చేస్తుందండి! రోడ్డు మీద తన మానాన తాను నిదానంగా వెళుతోంది. తాబేలుకంటే పనేంలేదు కాబట్టి నిదానంగా వెళుతోంది. కాని వెనకన వెళ్తూన్న జనాలు మాత్రం దానిని దాటుకొని ముందుకు వెళ్ళలేక, అలాగని తాము కూడా తాబేలు నడకలు నడవలేక చాలా ఇబ్బంది పడిపోయారట. దాంతో పోలిసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తుందని ఆ తాబేలుని అరెస్ట్ చేసి తిసుకుపోయారట. అదీ సంగతి.
         
         
విడ్డూరం

రామలక్ష్మణులకూ తప్పలేదు కేసులు
          ఇక బీహార్లోని సీతమడి జిల్లాలోని ఠాకూర్ చందన్ అనే లాయరయితే ఏకంగా రామలక్ష్మణులు మీదనే కేసు పెట్టేసాడు. ఒక అనామకుడి మాటలు పట్టుకొని సీతాదేవిని శ్రీరామచంద్రుడు అవమానించాడని, సత్యాసత్యాలను తెలుసుకోకుండా అడవులకు పంపించేసాడని, ఇందులో లక్ష్మణుడు కూడా అన్నకు సహకరించాడని, ఇది అన్యాయం కాబట్టి వీరిద్దరిపైన చర్య తీసుకోవాలన్నదిఈయనగారి వాదన.

దేవుడి మీదే కేసు
ఇలాంటి ఘటనే ఇజ్రాయిల్ లో కూడా జరిగింది. చిన్నప్పట్నుంచి కష్టాలే  తప్ప సుఖాలెరుగని ఓ వ్యక్తీ తన కష్టాలకు కారణం ఆ దేవుడేనని, తనకు ఇన్ని కష్టాలు పెట్టిన  దేవుడిని శిక్షించి, తనకు న్యాయం చేయమని పోలిసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళు మాత్రం  ఆ వ్యక్తిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా మూడు సంవత్సరాలు పోలిసుల చుట్టూ తిరిగి, ఇక లాభంలేదని తానే కోర్టులో కేసు దాఖలు చేసాడు. అసలు విషయం తెలుసుకున్న జడ్జిగారు అతని బాధలు తీర్చే చర్యలు చేపట్టామని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కథ సుఖాంతమయింది.


చిలుక మీద కేసు
ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే చిలకలా మాట్లాడుతున్నారంటాం. ఎందుకంటే చిలక పలుకులు అంత వినసొంపుగా, ముచ్చటగా ఉంటాయ్. కాని ఆ చిలుకే అసభ్యంగా, తిడుతూ, బూతులు మాట్లాడుతుంటే వినగలమా? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురయింది ఆ మామ్మగారికి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో జనాబాయికి, ఆమె కొడుకు  మనస్పర్ధలతో వేరువేరుగా నివసిస్తున్నారు. తల్లిమీద కక్ష తీర్చుకోవడాలనుకున్న  ఆ కొడుకు తన చిలుకకు తల్లి ఫోటో చూపించి ఆమెను బూతులు తిట్టడం నేర్పించాడు. దాంతో ఆ చిలుక జనాబాయి కనబడినప్పుడల్లా ఆమెను బూతులు తిడుతూ వెక్కిరించేది. చాలాకాలం ఒర్చుకున్న జనాబాయి ఇక సహించలేకపోయింది. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి చిలుక మీద కేసు పెట్టింది. దాంతో పోలీసులు ఆ చిలుకను రప్పించి అటవీశాఖకు అప్పగించేసారు.

ఇలా చెప్పుకుంటూపొతే ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఎన్నెన్నో.... వాటి గురించి మరోసారి ముచ్చటించుకుందాం.