Monday, January 30, 2017

రావణాసురుడు మమ్మీగా భూమ్మీదే ఉన్నాడట | Ravan be nascent again ? | unknown facts telugu | Facts about Rava...

రావణాసురుడు మమ్మీగా ఇంకా ఈ భూమ్మీదే ఉన్నాడట

లంకలో  రావణుని ఆనవాళ్ళు దొరికాయట.

రావణాసురుడు రామాయణం లో ఒక ముఖ్య పాత్ర . ఎలా బ్రతకకూడదో చెప్పేది రావణాసురుడి పాత్ర. ఇదెప్పుడో రామాయణ కాలంనాటి మాట మరిప్పుడు కొత్తగా చెప్పుకోడానికేం ఉంది అనుకుంటున్నారా? ఉంది... ఆ మధ్య లంకలో రావణాసురుడు మమ్మీ బయటపడిందని ఒక వార్త సంచలనం సృష్టించింది. అదేంటో ఈ వీడియోలో చూడండి.

దేవతావృక్షాలు.... రావిచెట్టు

 దేవతావృక్షాలు.... రావిచెట్టు: బ్లాగ్ మిత్రులకు వందనాలు.... చెట్టు - పుట్ట, కొండ - కోన, రాయి - రప్ప... ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని భగవదంశగా చూడడం, దైవత్వాన్ని ఆపాదించ...

దెయ్యాల నిలయం | డ్యుమాస్ బీచ్ | Mistery beach | Dumas beach | Gujarat

దెయ్యాల నిలయం డ్యుమాస్ బీచ్ 

మిస్టరీ బీచ్ 

 బీచ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? అలల సవ్వడి, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం ఇవే కదా... కానీ ఆ బీచ్ కెళితే మాత్రం దెయ్యాలు  గుసగుసలాడతాయి. తెలియని అందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి  మనల్ని మాయం చేసేస్తుంది. అందుకే అదో మిస్టరీ బీచ్ గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఎక్కడుందా బీచ్....?
ఈ భయంకరమైన బీచ్ ఎక్కడుందో తెలుసా... గుజరాత్ లోని సూరత్ కి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది..అదే ద్యుమాస్ బీచ్ .నిజానికి ఎంతో అందమైన బీచ్ డ్యుమాస్ బీచ్. కానీ అక్కడికి వెళ్లేవారికి మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయట. పగలంతా జనంతో కళకళలాడే బీచ్ సాయంత్రం అయేసరికి మాత్రం దెయ్యాల నిలయం గా మారిపోతుందట. ఆ బీచ్లో నడుస్తుంటే మన వెనకే కనబడకుండా దెయ్యాలు  మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుందట. మన చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుందట. ఎవరో బాధగా మూలుగుతున్నట్టు, అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, వినబడతాయాట. రాత్రిళ్ళు అక్కడికి వెళితే ఇక తిరిగి రారని కూడా కథనాలున్నాయి. నిజానికి ఇక్కడ నాలుగు బీచ్ లను కలిపి ద్యుమాస్ బీచ్ గా చెప్తారు. అందులో రెండు బీచ్ లు జనంతో కళకళలాడతాయి. మూడో బీచ్లో కూడా కాస్తో కూస్తో జనం ఉంటారు. నాలుగో బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల నిలయం .  విచిత్రమేమిటంటే ఈ బీచ్లో ఇసుక కూడా నల్లగా ఉంటుందట. అసలిక్కడ ఎందుకిలా జరుగుతోంది అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో స్మశానం ఉండేదని అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని, స్మశానంలో శవాల్ని కాల్చిన బూడిద కారణంగానే ఇక్కడి ఇసుక కూడా నల్లగా ఉంటుందని  స్థానికులు చెప్పే కథనం. ఈ కథనాల్లో నిజమెంతో చూద్దామని రాత్రిపూట ఆ బీచ్ కి వెళ్ళినవారు ఇక తిరిగిరాని సందర్భాలు, పగటిపూట కూడా భయంకరంగా ఏడుపులు, మూలుగులు వినబడిన  సందర్భాలున్నాయని కూడా చెప్తారు. చివరికి రాత్రిళ్ళు ఈ బీచ్ లోకి వెళ్ళడం కూడా నిషేదించారు.

Sunday, January 29, 2017

అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు?| కృష్ణుడు శపించాడా? Still Aswathama alive |

అశ్వత్థామ చిరంజీవి అవడానికి కృష్ణుని శాపమే కారణమా?

Aswathama | అశ్వత్థామ | శ్రీ కృష్ణుడు | చిరంజీవి
ఈ విశ్వంలో ఏడుగురు చిరంజీవులున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఏడుగురు చిరంజీవులలో అశ్వత్థామ కూడా ఒకరు. అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు? చిరంజీవి అయిన అశ్వత్థామ ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాడు? ఎప్పుడైనా, ఎవరికైనా కనిపించాడా? అశ్వత్థామ గురించి పురాణాలేమంటున్నాయి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో.........


Friday, January 27, 2017

మెర్మేయిడ్స్ నిజంగా ఉన్నాయా? | జలకన్యలు | మత్స్యకన్యలు | mermaids

మెర్మేయిడ్స్ గురించి మీకు తెలియని నిజాలు 

మెర్మేయిడ్స్ ... మత్స్యకన్యలు .... జలకన్యలు ... వీటి గురించి పురాణాలు, ప్రాచీన గ్రంధాలు విభిన్నమైన కథలు చెప్తున్నాయి. అసలు మెర్మేయిడ్స్ నిజంగా ఉన్నారా?  ఉన్నారో లేదో ఈ వీడియో చుస్తే మీకే తెలుస్తుంది

Wednesday, January 25, 2017

వింత హోటళ్ళు | వింత నిజాలు | Amazing restaurants | Unknown facts

ఈ వింత హోటళ్ళు  మీరు చూశారా?

కొన్ని విషయాలు వింటుంటే ఔరా; అని ముక్కున వేలోసుకోకుండా ఉండలేం. అలాంటి విషయాలే ఈ
వింత హోటళ్ళు.  ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు వాటిలో ఈ వింత హోటళ్ళు ప్రత్యేకం. అలాంటి
వింత హోటళ్ళు గురించి ఈ వీడియోలో.....

పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా? | మిస్టరీ | Birds sucside spot Jatinga

అక్కడ వేలాది పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.

 ఆ పక్షులకేం కష్టం వచ్చిందో ఒకటి కాదు రెండు కాదు వేలాది పక్షులు అక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అసలవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అక్కడికే వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి? అన్నీ ప్రశ్నలే.... అసలా పక్షుల ఆత్మహత్య సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Sunday, January 22, 2017

మరో గోపాల గోపాల | ఈ వింతలు విన్నారా? Funny things | crazy facts

మరో గోపాల ... గోపాల ... అన్నీ వింతలే 

ఈ ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు వింటే నవ్వు రావడమే కాదు.. what a crazy .. ఇలా కూడా జరుగుతుందా.... అని అవాక్కవుతాం. ఆ మధ్య గోపాల గోపాల సినిమా చూసి ఓవైపు నవ్వుకుంటూనే మరో వైపు ఆలోచనలో పడిపోయారు. ఎవరి నోట విన్నా గోపాల గోపాల అన్నమాటే. అలాంటి funny things , unknown facts telugu లో మీకోసం మరో గోపాల గోపాల .....

Saturday, January 21, 2017

వింత కేసులు

 ఈ ప్రపంచమే ఒక వింత. తరచి చూడాలేగాని ఈ ప్రపంచం ఒక విచిత్రాల హరివిల్లు.  అలాంటి కొన్ని వింతల గురించి ఇప్పుడు చూద్దాం..

విచిత్రం
సూర్యుని  మీద కేసు
ఆ మధ్య గోపాల గోపాల సినిమాలో హిరో దేవుడి మిద కేసు పెట్టడం మనం చూసాం. సరిగ్గా వ సంఘటన కూడా అలాంటిదే. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుణ్ని భగవంతుడిగా ఆరాధిస్తాం. పూజలు చేస్తాం. అలాంటి సుర్యభగవానుడినే కోర్టుకి ఈడ్చాడు ఓ ఘనుడు.  ఇంతకీ విషయమేమిటంటే మధ్యప్రదేశ్ లోని షాజపూర్ కి చెందిన శివపాల్ సింగ్ అనే వ్యక్తీ తన పనుల మీద ఫలోడి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన ఎండ మాడ్చేస్తోంది. అంతా ఉస్సు, అస్సు అనుకుంటూనే ఆ ఎండను భరిస్తున్నారు. కాని శివపాల్ సింగ్ రూటే వేరు కదా .. నువ్వలా చెలరేగిపోతే నేనూరుకుంటానా అని హుంకరించాడు. ఒక పరిమితి అనేది లేకుండా, చెలరేగుతూ ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యుని మీద చర్యలు తీసుకొని, ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టుకెళ్ళాడు. 

తాబేలు అరెస్ట్
ఇదింకా విచిత్రమైన కేసు. ఫ్లోరిడాలో పోలీసులొచ్చి ఉన్నపళంగా దాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు.  ఇంతకీ అదేం చేసిందంటే .... పాపం నోరులేని తాబేలేం చేస్తుందండి! రోడ్డు మీద తన మానాన తాను నిదానంగా వెళుతోంది. తాబేలుకంటే పనేంలేదు కాబట్టి నిదానంగా వెళుతోంది. కాని వెనకన వెళ్తూన్న జనాలు మాత్రం దానిని దాటుకొని ముందుకు వెళ్ళలేక, అలాగని తాము కూడా తాబేలు నడకలు నడవలేక చాలా ఇబ్బంది పడిపోయారట. దాంతో పోలిసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తుందని ఆ తాబేలుని అరెస్ట్ చేసి తిసుకుపోయారట. అదీ సంగతి.
         
         
విడ్డూరం

రామలక్ష్మణులకూ తప్పలేదు కేసులు
          ఇక బీహార్లోని సీతమడి జిల్లాలోని ఠాకూర్ చందన్ అనే లాయరయితే ఏకంగా రామలక్ష్మణులు మీదనే కేసు పెట్టేసాడు. ఒక అనామకుడి మాటలు పట్టుకొని సీతాదేవిని శ్రీరామచంద్రుడు అవమానించాడని, సత్యాసత్యాలను తెలుసుకోకుండా అడవులకు పంపించేసాడని, ఇందులో లక్ష్మణుడు కూడా అన్నకు సహకరించాడని, ఇది అన్యాయం కాబట్టి వీరిద్దరిపైన చర్య తీసుకోవాలన్నదిఈయనగారి వాదన.

దేవుడి మీదే కేసు
ఇలాంటి ఘటనే ఇజ్రాయిల్ లో కూడా జరిగింది. చిన్నప్పట్నుంచి కష్టాలే  తప్ప సుఖాలెరుగని ఓ వ్యక్తీ తన కష్టాలకు కారణం ఆ దేవుడేనని, తనకు ఇన్ని కష్టాలు పెట్టిన  దేవుడిని శిక్షించి, తనకు న్యాయం చేయమని పోలిసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళు మాత్రం  ఆ వ్యక్తిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా మూడు సంవత్సరాలు పోలిసుల చుట్టూ తిరిగి, ఇక లాభంలేదని తానే కోర్టులో కేసు దాఖలు చేసాడు. అసలు విషయం తెలుసుకున్న జడ్జిగారు అతని బాధలు తీర్చే చర్యలు చేపట్టామని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కథ సుఖాంతమయింది.


చిలుక మీద కేసు
ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే చిలకలా మాట్లాడుతున్నారంటాం. ఎందుకంటే చిలక పలుకులు అంత వినసొంపుగా, ముచ్చటగా ఉంటాయ్. కాని ఆ చిలుకే అసభ్యంగా, తిడుతూ, బూతులు మాట్లాడుతుంటే వినగలమా? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురయింది ఆ మామ్మగారికి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో జనాబాయికి, ఆమె కొడుకు  మనస్పర్ధలతో వేరువేరుగా నివసిస్తున్నారు. తల్లిమీద కక్ష తీర్చుకోవడాలనుకున్న  ఆ కొడుకు తన చిలుకకు తల్లి ఫోటో చూపించి ఆమెను బూతులు తిట్టడం నేర్పించాడు. దాంతో ఆ చిలుక జనాబాయి కనబడినప్పుడల్లా ఆమెను బూతులు తిడుతూ వెక్కిరించేది. చాలాకాలం ఒర్చుకున్న జనాబాయి ఇక సహించలేకపోయింది. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి చిలుక మీద కేసు పెట్టింది. దాంతో పోలీసులు ఆ చిలుకను రప్పించి అటవీశాఖకు అప్పగించేసారు.

ఇలా చెప్పుకుంటూపొతే ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఎన్నెన్నో.... వాటి గురించి మరోసారి ముచ్చటించుకుందాం.
         


Wednesday, January 18, 2017

టైటానిక్ మళ్ళీ వస్తోంది. Titanik

టైటానిక్ మళ్ళీ వస్తోంది. సినిమా కాదు సుమా.... షిప్పే 

 టైటానిక్ .... ఓ అద్భుతం. టైటానిక్ పేరుతొ ఎన్నో సినిమాలు వచ్చాయి. కథలొచ్చాయి. ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా టైటానిక్ నిత్యనూతనమే. అందుకే ఇది ఆదివారం ఆంధ్రప్రభలో పడిన నా వ్యాసం టైటానిక్ వ్యాసం మీ కోసం...

 

Tuesday, January 17, 2017

శ్రీ ముఖలింగం | ప్రముఖ పుణ్యక్షేత్రం

శ్రీ ముఖలింగం.....ఓ పుణ్యక్షేత్రం. 

ఒకప్పుడది అంగరంగ వైభవంగా వెలిగిపోయిన ఒక సామ్రాజ్యానికి రాజధాని నగరం శ్రీ ముఖలింగం. కళలకు కాణాచి. అపురూప చరిత్ర దీని స్వంతం. మరిప్పుడు.... ఇప్పుడా రాజులూ లేరు. రాజ్యాలు లేవు. ఆ వైభవం, ప్రాభవం అన్నీ మట్టిలో కలిసిపోయాయి. కేవలం ఒక పుణ్యక్షేత్రం  గా మిగిలిపోయింది. శ్రీ ముఖలింగం చరిత్ర చుస్తే మాత్రం ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఆ విశేషాలు ఈ వీడియోలో చూడండి.Sunday, January 8, 2017

Dumas beach | Gujarat | దెయ్యాల బీచ్ మనుషుల్ని మాయం చేసేస్తుంది.

అదో దెయ్యాల బీచ్


బీచ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? అలల సవ్వడి, చల్లగాలులు, ప్రశాంతమైన వాతావరణం ఇవే కదా... కానీ అక్కడికెళితే   మాత్రం దెయ్యాలు  గుసగుసలాడతాయి అందుకే దాన్ని అందరూ దెయ్యాల బీచ్ అని పిలుస్తారు.. తెలియని అందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి  మనల్ని మాయం చేసేస్తుంది. అందుకే అదో దెయ్యాల బీచ్  గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఎక్కడుందా బీచ్....? గుజరాత్ లోని సూరత్ లో ఉందీ దెయ్యాల బీచ్.

Sunday, January 1, 2017

వింత జలపాతాలు

వీ జలపాతాలే......

ఈ ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. అసలవి విని అవునా! నిజమే! అన్న ఆశ్చర్యంలోంచి తేరుకోలేని పరిస్థితి. అలాంటి వింతే రక్త జలపాతం, అగ్ని జలపాతం, పూల జలపాతంలాంటివి. జలపాతం అనగానే ఎత్తైన కొండల మీదినుంచి దుముకుతూ తమను అడ్డుకునేవారీ ప్రపంచంలో లేరన్నట్టు జలజల జారే పాలనురుగుల్లాంటి  జలధారలు మన మదిలో మెదులుతాయి. మరి ఈ రక్త జలపాతమేంటీ....?  అంటే రక్తధారలు కొండల మీదినుంచి కురుస్తాయా? అసలిలాంటి రక్త జలపాతాలుంటాయా? ఇలా అన్నీ ప్రశ్నలే....!

జ్వాలా జలపాతం :
ఇవీ
జ్వాలా జలపాతం 

హార్స్ టెయిల్ జలపాతంగా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ఉత్తరఅమెరికా లో ఉంది. ఈ జలపాతం ప్రత్యేకత ఏంటంటే  కేవలం నీరు మాత్రమే కాదు మంటలు జలజలలడుతూ జాలువారుతాయట. ఈ అద్భుతమైన జలపాతాన్ని చూసి, దాని దగ్గర ఫోటోలు దిగడానికి దేశదేశాల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారట. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి ఈ జలపాతాన్ని చుసేద్దామంటే మాత్రం కుదరదు సుమా! ఉత్తరమెరికాలోని యోసేమైట్ జాతీయ పార్కులో కేవలం ఫిబ్రవరి నెలలో రెండు వారలు మాత్రమే ఈ జ్వాల జలపాతాన్ని చూడగలం. మీ పిచ్చిగానీ జలపాతం మంటల్ని రాల్చడమేంటి? ఇదంతా కట్టుకథ అనుకుంటున్నారు కదూ! కట్టుకథ... కనికట్టు కాదు గానీ జలపాతం మధ్య కృత్రిమంగా మంటలు రాలేలా ఏర్పాటు చేశారన్నది మాత్రం నిజం. కొండకొనమీది నుంచి రకరకాల మందుగుండు సామగ్రిని పేల్చి మంటల్ని సృష్టించి ఈ అగ్నిశిఖల్ని కిందికి జాలువారేలా చేస్తారట.  ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో చివరి రెండువారాలలో సూర్యాస్తమయం సమయంలో ఈ జలపాతాన్ని చూసితీరాల్సిందేనని చెప్తారు. స్థానికులు హార్స్ టెయిల్ జలపాతంగా పిలుచుకునే ఈ మంటల జలపాతాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారట.రక్త జలపాతం :
రక్త జలపాతం 

అంటార్కిటికాలోని ఒక అద్భుతమే ఈ రక్త జలపాతం! సుమారు 98 శాతం మంచుతో నిండిపోయి అక్కడి వాతారణాన్ని తట్టుకొని నిలబడగలిగే కొన్ని రకాల మొక్కలు, జంతువులు తప్ప మనుష్య సంచారం ఉండని అంటార్కిటికాలో కనబడే ఒక వింత ఈ రక్త జలపాతం. అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రైవేలి దగ్గర ఒక ప్రాంతంలో ఒక దగ్గర ప్రవహిస్తున్న నీరు ఎర్రగా రక్తంలాగే ప్రవహిస్తుందట. మిగిలిన చోట్లలో సహజంగానే ప్రవహిస్తున్న నీరు ఈ వేలి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎర్రటి ఎరుపు రంగులో ప్రవహిస్తుందట. అందుకే దీనిని బ్లడ్ ఫాల్స్ అని పిలవడం జరుగుతోంది. ఇలా ఒక్క ప్రాంతంలోనే ఎర్రటి నీరు ప్రవహించడానికి కారణమేంటని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ దానికి ఖచ్చితమైన కారణం మాత్రం అంతు చిక్కడం లేదట. నిజానికి ఎక్కడ చూసినా మంచుగడ్డలే తప్ప నీరన్నది కనబడని ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ రక్తధారను 1911 లో గ్రిఫ్ట్ టేలర్ అన్న పరిశోధకుడు కనుగొన్నాడు. అప్పట్లో తన బృందంతో పరిశోధనలో ఉన్న టేలర్ కి ఈ రక్తవర్ణపు ధారను చూసి ఆశ్చర్యంతో పటు భయం కూడా కలిగిందట. మొట్టమొదట ఈ రక్తదారను కనుగొన్నది టేలర్ కాబట్టి దానికి టేలర్ హిమనీనదమ్ అని పేరు స్థిరపడిపోయిందిమంచుగడ్డలు మాత్రమే ఉండే ఈ మంచుఖండంలో ఇక్కడ మాత్రమే నీరు కనబడకుండా ఎలా పారుతోంది? అసలు ఆ ఆ నీరు కూడా ఎర్రటి రక్తంలా వస్తోంది? ఇలా చాలా ప్రశ్నలతో ఈ పరిశోధనలు మొదలయ్యాయి.  ఈ పరిశోధనల్లో రక్తజలపాతానికి సంబంధించి ఎన్నో వివరాలు బయటకొచ్చాయి. ఈ టేలర్ హిమానీనదం క్రిందన వేల ఏళ్లకు పూర్వం 1300 అడుగుల లోతులో ఓ చిన్న సరస్సు ఉండేదని, అందులో ఆక్సిజన్, వెలుతురు, వేడి ఇవేమీ అక్కర్లేకుండా బ్రతకగలిగే కొన్ని రకాల సూక్ష్మజీవులుండేవని, అవే ప్రస్తుతం భూమిమీద ఉండే ప్రాణులకు మూలమని ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన నమ్మలేని విషయాలు బయటపెట్టారు పరిశోధకులు. అయితే ఈ రక్తజలపాతం ఇలా ఎర్రరంగులో ఎందుకు ప్రవహిస్తోంది, అసలక్కడ నీరు గడ్డకట్టకుండా ఉండడానికి కారణమేమిటి అన్న విషయం  కనుక్కోడానికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయట.పూలజలపాతాలు :
వింత జలపాతాలు
పూల జలపాతం 

పూలజలపాతాలు చూడాలంటే మాత్రం మనం జపాన్ దేశానికి వెళ్ళాల్సిందే. ఈ పూలజలపాతాలను చూడడానికి ప్రపంచదేశాల నుంచి వేలాదిమంది జనం జపాన్ కు వస్తారట. ఇంతకీ ఏంటి పూలజలపాతలు? రక్తజలపాతం, అగ్ని జలపాతం లాగే ఇక్కడ కూడా నీరు పూలలాగా జాలువారుతుందా? అనుకుంటున్నారు కదూ! నిజానికి ఇదొక ఫ్లవర్  ఫాల్ గార్డెన్. ఇక్కడ ఎత్తైన చెట్లనుంచి పూలతలు కొండల మీదినుంచి పూ దొంతరలు జలజల జారుతున్నాయా.... అని భ్రమపడేవిధంగా ఉంటాయి. ఇవి చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే ఈ పూల జలపాతాలకు ఎంతోమంది పర్యాటకులు వస్తారట.          కృత్రిమ జలపాతం
జలపాతం అనగానే సహజసిద్ధంగా ఎత్తైన కొండల మీదినుంచి కిందికి జాలువారే నీటిధారగా మనకందరికీ తెలిసిందే. కాని అత్యంత సహాజంగా కనబడుతూ.... కృత్రిమ జలపాతం అంటే ఏ మాత్రం నమ్మలేని విధంగా ఏర్పాటు చేసిన జలపాతాన్ని చూడాలంటే మాత్రం చైనా వెళ్ళాల్సిందే. నీటి ఫౌంటేన్ ల వరకు అయితే చాలా రకాల నిర్మాణాల్ని మనం చూస్తున్నాం. కాని అచ్చమైన జలపాతం లాంటి కృత్రిమ నిర్మాణం చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదైన జలపాతం చైనాలోని యునాన్ ప్రావిన్సీ కున్ మింగ్ పట్టణంలో నియులాన్ నదికి దగ్గరలో నిర్మించారు. 11 వేల కోట్లకు పైగా డబ్బు ఖర్చుపెట్టి మూడేళ్ళు శ్రమించి ఈ నిర్మాణాన్ని చేసారట. ఇంకా నమ్మలేని విషయమేమిటంటే కాస్కటాడెల్లె మార్మోర్ అన్న పేరుతో ఇలాంటి కృత్రిమ జలపాతాన్ని క్రీ పూ 271 లోనే ఇటలీలో నిర్మించినట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ లోని రాన్ ఆల్ ఖైమా ప్రాంతంలోను, యుఎస్ ఏ లో కూడా ఇలాంటి కృత్రిమ జలపాతాల్ని నిర్మించారు.

Creepy island of dolls, బొమ్మల దీవి