Wednesday, September 27, 2017

tirupati temple telugu | Tirumala tirupahti web series telugu part-2| ti...

#tirupathi secrets, #tirumala tirupathi, #secrets of seven hills, తిరుమల తిరుపతి, తిరుమల #యాత్రMonday, September 4, 2017

భయంకరమైన రైల్వేస్టేషన్లు

భయంకరమైన రైల్వేస్టేషన్లు

ఆ స్టేషన్ల లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. 
గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్టేషన్ల లోకి వెళ్ళగలరు.

భారతీయ రైల్వేలకు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నెట్వర్క్ ఉంది.

రైల్వే స్టేషన్చేరుకోగానే అక్కడ ఓ చిన్న ప్రపంచాన్నే చూడొచ్చు. రకరకాల మనుషులతో, వారు మాట్లాడే భాషలతో, రణగొణధ్వనులతో, చాయ్ వాలాల హడావుడి, చిరుతిళ్ళు అమ్ముకునేవారి కేకలు, అరుపులతో కోలాహలంగా,   సందడిగా ఉంటుంది. కానీ కొన్ని రైల్వే స్టేషన్ ల పేర్లు వింటే మాత్రం ఇవేవీ      జ్ఞాపకం రావు. భయంతో ఓణికిపోవడం తప్ప. అలాంటి భయంకరమైన              రైల్వే స్టేషన్ ల గురించి తెలుసుకుందాం.

 టన్నెల్ నెం. 33

       
హిమాచల్ ప్రదేశ్ .....అందానికి, ఆహ్లాదానికి, చల్లదనానికి మారుపేరు. 

అందులోనూ సిమ్లా అయితే ఇక చెప్పనక్కరలేదు. అంత చల్లని ప్రదేశంలో కుడా చెమటలు కారేలా చేస్తుంది.  టన్నెల్ నెం. 33. సిమ్లాలో  బరోగ్              రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉంది టన్నెల్ నెం.33. ఈ టన్నెల్ ద్వారా         ప్రయాణం చేస్తున్నపుడు తరచుగా ఒక ఆత్మ కనిపిస్తుంది అన్నది 
బాగా ప్రచారంలో ఉన్న విషయం. టన్నెల్ గోడల మీద లీలగా,                     నీడలా కనబడే ఆ ఆత్మ అక్కడే తిరుగుతూ ఆ మార్గం గుండా 
వచ్చే పోయే వారందరికీ కనబడుతూ ఉంటుందని భయంభయంగా    చెప్పుకుంటారు. ఇంతకీ క్రమం తప్పకుండా అక్కడే తిరుగాడుతున్న 
ఆ ఆత్మ ఎవరిది. అక్కడే ఎందుకు తిరుగుతుంది. .........                         బ్రిటీషు వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో 

కల్కా ప్రాంతంలో రైలు మార్గాన్ని వెయ్యాలని ఆ బాధ్యతను కల్నల్                

బరోగ్ కు అప్పగించారు. అయితే బరోగ్ అంచనాలు తారుమారు               కావడంతో నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. అప్పటికే చాల డబ్బు         ఖర్చయింది. ఓ వైపు చేపట్టిన పనిలో పరాజయం, మరోవైపు అధికారుల         వత్తిడి ..... దాంతో బరోగ్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.     అతడిని ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. తరువాత టన్నెల్ నిర్మాణం       పూర్తయింది. అయితే ఆ తర్వాత ఆ టన్నెల్ గుండా రైళ్ళు వెళుతున్నపుడు వింత,వింత శబ్దాలు, ఎవరో బాధగా ఏడవడం వినిపించేదట. దాంతోపాటు టన్నెల్ గోడల మీద లీలగా, నీడగా ఒక ఆత్మ కనిపించడం మొదలయింది. క్రమంగా ఆ ఆత్మను గుర్తించిన వారు అది కల్నల్ బరోగ్ ఆత్మగా తేల్చారు. తరచుగా  ఆత్మ కనబడడంతో ప్రజల భయంతో వణికిపోవడం చూసి ఒక సందర్భంలో ఈ         టన్నెల్ ను మూసివేయాలని ఒక మెటల్ డోర్ చేయించి ప్రారంభ ద్వారం దగ్గర పెట్టించిందట ప్రభుత్వం. కాని ఆ మర్నాడే దానికదే విరిగి పోవడంతో ఆ     ప్రయత్నాన్ని మానుకున్నారట. అయితే ఈ దెయ్యం చాల మంచి           దెయ్యమని ఎవర్నీ ఏమీ చేసిన దాఖలాలు లేవని కూడా చెప్తుంటారు.             ఎంత మంచిదయినా దెయ్యమంటే ఎవరైనా భయపడకుండా ఉండగలరా!       అందుకే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఈ టన్నెల్ దగ్గరకు     వచ్చేసరికి మాత్రం ప్రయాణికులు భయంతో వణికిపోతుంటారట.

బేగన్ కోడోర్ స్టేషన్ పశ్చిమబెంగాల్

ఇది ప్రేతాత్మల స్టేషన్ గా ప్రఖ్యాతి చెందింది. కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1967 

ప్రాంతంలో ఇక్కడ తరచుగా రాత్రి వేళల్లోను, మనుష్య సంచారం అంతగా ఉండని 

సమయాల్లోనూ ఒక స్త్రీ తెల్లచీరతో కనబడుతుండేదని, అలా ఆమెను చూసినవారు 

కొద్దికాలానికే అకారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేవారని 

కధనాలున్నాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడంతో ఆ స్టేషన్ 

పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ భయం ఎంతగా     పెరిగిపోయిందంటే ఆ స్టేషన్ లో ఎవరూ దిగడం కూడా మానేశారు. దాంతో     దాదాపు 42 సంవత్సరాలు ఆ స్టేషన్ ను మూసేశారు. మళ్ళీ 2007     మమతాబెనర్జీ టైంలో ఈ స్టేషన్ పునరుద్ధరించడం జరిగింది. అయితే             అప్పటి ఆ అనుభవాలు, నమ్మకాలు మాత్రం ఇంకా అక్కడివారిని వెంటాడుతునే ఉన్నాయట. గతంలోని కధనాలతో ఇప్పుడదో టూరిస్ట్ స్పాట్ గా మారింది.
నైని స్టేషన్ ------ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని నైని స్టేషన్ మరో ప్రేతాత్మల స్టేషన్ గా చెప్తారు. గతంలో అంటే బ్రిటిష్ 

వారి కాలంలో ఇక్కడ ఒక జైలుండేదట. అ జైలులో స్వాతంత్ర్యసమరయోధులను 

ఉంచి వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేసేవారట. ఈ జైలు రైల్వే స్టేషన్ కి 

దగ్గరలోనే ఉండేదని  జైలులో చిత్రహింసలనుభవించి మరణించిన వారు ప్రేతాత్మలుగా 

మారి ఈ స్టేషన్ లో సంచరిస్తున్నారని అక్కడివారి బలమైన నమ్మకం. ఆ నమ్మకం 

ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

డిల్లీలోని ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్

ఇక్కడి పరిస్థితి మరీ విచిత్రం. ఇక్కడ స్టేషన్ చుట్టుపక్కల ఒక స్త్రీ

ప్రేతాత్మ విచిత్రమైన చేష్టలతో ప్రజల్ని బెంబేలేత్తిస్తోందట. అకస్మాత్తుగా గట్టిగా అరుస్తూ 

కనబడి భయపెట్టడం, అటుగా వెళుతున్న కార్లను గ్లాస్ ల మీద కొట్టి ఆపడం, కార్ల 

వెంట పరుగెత్తడం, ఒక్కోసారి హటాత్తుగా కనబడి వారిని చెంపదెబ్బలు కొట్టడం చేసి 

బెంబేలెత్తిస్తోందట.

రబీంద్ర సరోవర్ మెట్రో రైల్వే స్టేషన్  ----కోల్కతా

ఇక్కడ మరీ విచిత్రమైన సన్నివేశాలు కనబడుతుంటాయని కథలు కథలుగా 

చెప్పుకుంటారు. అంతవరకు మామూలుగానే ఉన్న ప్రయాణికులు సడన్ గా ఎవరో 

తోసినట్టుగా స్పీడ్ గా వస్తున్న రైలు కింద పడిపోతుంటారట. ఇలాంటి ఆత్మహత్యలు 

చాల పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయట ఇక్కడ. దీనికంతటికీ అక్కడున్న ప్రేతత్మలే 

కారణమని, చనిపోయినవారి ఆత్మలు నీడల రూపంలో అక్కడే తిరుగుతూ 

కనిపిస్తాయని అక్కడ కథలు కథలుగా  చెప్పుకుంటారు. చివరి రైలు వెళ్ళిపోయిన 

తరువాత ఆ స్టేషన్ లో ఎవరైనా ఉంటే అక్కడ ఎదురైన భయంకరమైన అనుభవాలకు 

గుండాగి చావాల్సిందే అంటారు. దీనికి సంబంధించిన వీడియో చూడండి......


Saturday, September 2, 2017

వారణాసిలో వేశ్యలు చేసే వింత నృత్యాలు

వారణాసిలో వేశ్యలు చేసే వింత నృత్యాలు 

ఈ నృత్యాల గురించి వింటే ఔరా! అని ముక్కున వేలేసుకోక మానరు. ఎందుకంటే ఇది 

స్మశాన నృత్యం. వారణాసిలో స్మశానమే దీనికి వేదిక. సమాజం చీదరించుకునే వేశ్యలే 

కళాకారులు. శవాలు, శవాల్ని చూసి ఏడుస్తున్న బంధువులే ప్రేక్షకులు.  ఇదేంటి ....

 భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, మణిపురి ఇలా రకరకాల నృత్యరీతుల

 గురించి విన్నాం. గానీ ఇలాంటి డేన్స్ గురించి ఎప్పుడూ వినలేదే! అనుకుంటున్నారు

 కదూ.... వస్తున్నా ... వస్తున్నా ఆ వివరాల్లోకే వస్తున్నా.... 

 ఎగిసిపడుతున్న చితిమంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తారు వేశ్యలు. ఇది 

వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న వింత ఆచారం. నమ్మకం కలగడం లేడు

 కదూ.... కాని ఇది అక్షరసత్యం. సుమారు 450 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న

 ఆచారం. రాజా మంజీసింగ్ కాలం నుంచి ఉన్న ఈ ఆచారం మళ్ళీ బాబా సంశాన్ నాథ్ 

ఆధ్వర్యంలో పునఃప్రారంభించబడిందట. ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగనాడు 

జరిగే ఆ నృత్య ప్రదర్శన ప్రధానంగా  వారణాసి లోని మణికర్ణికా ఘాట్ లో జరుగుతుంది. 

  శ్రుంగార్ ఆఫ్ స్మశానేశ్వర్ మహాదేవ్ గా పిలుచుకునే ఈ వేడుకలో పాల్గొనే వేశ్యలు 

శివదాస్పూర్, మండూదిహ్, చునార్, దల్మదిండి వంటి సుదూర ప్రాంతాల నుంచి

 వారణాసికి గుంపులు గుంపులుగా వచ్చిన వేశ్యలు అక్కడ కాలుతున్న చితిమంటల

 చుట్టూ తిరుగుతూ డేన్స్ చేస్తారు. ఇలా నృత్యం చేసే ఆ వేదికను మహాస్మశాన్ అని

, గొప్ప దహనభూమి అని పిలుస్తారు. అక్కడ స్మశానవాసి,  భూతనాధుడైన

 పరమేశ్వరుని స్మశానేశ్వార్ గా పూజలు చేస్తారట. సారాయి, భంగు, గంజాయి, 

మాంసం  వంటి పదార్ధాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.   తరువాత రాత్రంతా 

ఆడి, పాడి స్వామిని అర్చిస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎందుకొచ్చిందో తెలుసా ...... 

ఇదంతా ఆ వేశ్యలు తమ తరువాతి జన్మలోనైనా తమకు ఇలాంటి నీచజన్మ కాకుండా 

మంచి జన్మ రావాలని స్మశానవాసి అయిన ఆ మహాదేవుని ఆ స్మశానంలోనే తమ 

నృత్యాల ద్వారా కోరుకుంటారట. ఈ నృత్యాలను చూడడం కోసం తండోపతండాలుగా

 జనాలు వస్తారట. ప్రళయకాలంలో కూడా నాశనంకాని పవిత్రభూమి కాశీగా చెప్తారు.

 అందుకే అంతటి పవిత్రమైన ఆ భూమి మీద స్మశానేశ్వర్ బాబాని ఆరాధిస్తే, బాబా 

తమ మొర విని తమకు మంచి జీవితాన్ని ప్రసదిస్తాదన్న  నమ్మకంతో ఈ ఆచారాన్ని

 కొనసాగిస్తున్నామని ఆ వేడుకలో పాల్గొనే వేశ్యలు చెప్తారు.