Thursday, August 16, 2018

puri jagannatha temple history & secrets


జై జగన్నాథ | పూరీ జగన్నాధ క్షేత్రం

పరమ గురువులు శంకరాచార్యులవారి నుండి ప్రజాకవి శ్రీశ్రీ వరకు, విహారయాత్రికుల నుండి తీర్థయాత్రికుల వరకు, స్వదేశీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే పుణ్యస్థలం జగత్ప్రసిద్ధమైన పూరీ క్షేత్రం. భారతదేశ అద్భుత కట్టడాలలో ప్రముఖమైనదిగా అలరారుతోందీ జగన్నాథ ఆలయం. "పురుషోత్తమ క్షేత్రం", "శంఖుక్షేత్రం", "నీలాద్రి", "దారుకావనం", ఇలా ఎవరు ఎప్పుడు ఎలా పిలిచినా స్థిరంగా జనుల నోళ్ళలో నానే పేరు మాత్రం పూరీ. ఇక్కడ కొలువు తీరిన స్వామి నామంతో పాటు క్షేత్రనామం కూడా కలగలిసి "పూరీ జగన్నాధం" గా పిలువబడుతోంది పరమ పవిత్రమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలి పూరీక్షేత్రం. ఓడ్ర దేశంగా, ఉత్కళ దేశంగా పిలవబడే ప్రస్తుత ఒడిషా  రాష్ట్రంలో ఉందీ పూరీ క్షేత్రం. పురాణకాలంలో ఈ ప్రాంతాన్ని సౌర లేదా శబర అనే ఆటవిక జాతులవారు పరిపాలించినట్టు మహాభారతం చెప్తోంది. శ్రీ కృష్ణావతారం సమాప్తి కూడా ఇక్కడే జరిగిందన్నది పురాణ కథనం. ఇంత పురాణ ప్రసిద్ధమైన ప్రాంతం ఓడ్రదేశం. ఓడ్రదేశంలో మురళీధరుడు, వేణుగానలోలుడు నయన మనోహరమైన రూపంతో జగన్నాధుడు కొలువైన ప్రాంతం పూరీ క్షేత్రం. ఆ పూరీ క్షేత్ర చరిత్ర తెలుసుకుందాం.

Wednesday, August 15, 2018

Templeinfo-redgardens-lalbagh bangaloreTemple info-beauty of lambasingi agencyPuri jagannatha temple history | పూరీ ఆలయంలో జయదేవ, శంకరాచార్యులు


 పూరీ ఆలయంలో జయదేవకవి, శంకరాచార్యులు 

Puri jagannatha temple history
జయదేవుడు రచించిన అష్టపదులలో పంతొమ్మిదవ అష్టపదిని సగం జయదేవుడు వ్రాయగా ఆ మిగిలిన సగం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి పచ్చి పూర్తి చేసాడని చేప్తారు. దీనినే దర్శనాష్టపది' అని చెప్తారు. ఈ పందొమ్మిదవ అష్టపదిని వ్రాస్తున్నప్పుడు ఆరు పాదాలను వ్రాసిన తరువాత అతడి కలం ముందుకు సాగలేదు. ఏడవ పాదం ఎలా పూరించాలో జయదేవునికి ఎంతగా ఆలోచించినా స్ఫురణకు రాలేదు.

Templeinfo - అప్పుడు బ్లూవేల్ గేమ్ ఇప్పుడు మోమో ఛాలెంజ్


అప్పుడు బ్లూవేల్ ఇప్పుడు మోమో 

Templeinfo - బ్లూవేల్ గేమ్- మోమో ఛాలెంజ్
ఇప్పుడంతా చాలెంజ్ ల మయంగా నడుస్తోంది. ఇప్పటికే ఎన్నో చాలెంజ్ లు ప్రపంచ వ్యాప్తంగా వైరల్అ  వుతున్నాయి. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్

Tuesday, August 14, 2018

Devipuram temple history

దేవీపురం శ్రీ చక్ర మేరు ఆలయం

అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ చరిత్ర

అనకాపల్లి నూకాలమ్మ చరిత్ర


బొజ్జన్నకొండ బౌద్ధారామ క్షేత్రం

బొజ్జన్నకొండ 
బౌద్దారామ క్షేత్రం


puri jagannath temple history | chaitanya mahaprabhu, jayadeva kavi


పూరీ క్షేత్రంతో చైతన్యమహాప్రభు, జయదేవుల అనుబంధం 

   
puri  jagannath temple history | chaitanya mahaprabhu, jayadeva kavi

పూరీ  ఎంతోమంది మహానుభావులు దర్శించారు. జగన్నాధుని సేవించి తరించిపోయారు. కొందరు జగన్నాధునితో మమేకమైపోయి అక్కడే ఆ స్వామిలో లీనమైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

పూరీ క్షేత్రంలో చైతన్య మహాప్రభు

Templeinfo | మంగళగౌరి వ్రతం


మంగళగౌరీ వ్రతం


Templeinfo | మంగళగౌరి వ్రతం
 అమంగళాలను తొలగించి నిండు సౌభాగ్యాన్ని అందించే మహత్వపూర్వమైన వ్రతం శ్రావణ మంగళవార వ్రతం. మంగళగౌరీ వ్రతం చేస్తే వారి సౌభాగ్యానికి ఎలాంటి డోకా  ఉండదట. వైధవ్యబాధ లేకుండా సంపూరమైన అయిదవతనాన్ని ప్రసాదిస్తుంది మంగళగౌరీ దేవి.
మంగళగౌరీ వ్రతానికి మంగళవారానికి అధిపతి అయిన మంగళుడు

Monday, August 6, 2018

Templeinfo | ఇది కథ కాదు నిజజీవితగాధ

ఇది కథ కాదు నిజ జీవితం 

       
Templeinfo | ఇది కథ కాదు నిజజీవితగాధ
కొన్ని జీవితాలు అచ్చంగా సినిమా కథల్లాగే ఉంటాయి. కాదు కొందరి జీవిత కథలే సినిమాలుగా మారతాయి. ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వండర్ ఫుల్  బయోపిక్ కి ఏమాత్రం తీసిపోని స్టోరీ. తండ్రిని చంపిన వాళ్లను కటకటాల వెనక్కి పంపాలని కంకణం కట్టుకుని, అమ్మ మీద ఒట్టేసి మరీ ఐఏఎస్ అయింది.

ఇదిగో మీ నాన్న అని అమ్మ చెప్తే ఆ నాన్నను సరిగ్గా గుర్తు కూడా పట్టలేని పసిప్రాయంలోనే ఆ నాన్న దూరమయ్యాడు. చెయ్యిపట్టి నడిపించే

Sunday, August 5, 2018

puri jagannath temple history | పూరీలో దర్శించాల్సిన స్థలాలు


జమేశ్వర్ టెంపుల్

జగన్నాధ మందిరానికి దక్షిణంగా కిలోమీటరు దూరంలో ఉంది. జమేశ్వర్ ఆలయం లేదా పరమేశ్వరుని మందిరం. ఇది యమధర్మరాజుచే ప్రతిష్టించబడినదిగా పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడి స్వామి యమబంధాలను తొలగించేవాడు కాబట్టి యమేశ్వరునిగా ప్రసిద్ది చెందాడు. యమేశ్వరుడే స్థానికులచేత జమేశ్వరుడుగా కొలువబడుతున్నాడు. ఇక్కడి స్వామి యమేశ్వరుడుగా పేరు పొందడానికి కారణం... ఒకసారి ఈ పూరీ క్షేత్రంలో తపస్సులో మునిగి ఉన్న శివుని ధ్యానభంగం చేయడానికి ప్రయత్నించాడట యముడు. దాంతో ఆగ్రహించిన ఈశ్వరుడు యుద్ధంలో యముడ్ని ఓటమిపాలు చేసి అతనికి బుద్ధి చెప్పాడని అప్పటి నుంచి ఈ స్వామి యమేశ్వరునిగా ప్రసిద్ది చెందాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. స్థానికంగా యముడ్ని జముడు అని పిలుస్తారు కాబట్టి ఇది జమేశ్వరాలయంగా ప్రసిద్ధిచెందింది. ఇది పంచపాండవ ఆలయంగా కూడా చెప్తారు. ఇలా పంచపాండవాలయంగా చెప్పడానికి ఒక పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకసారి పూరీ క్షేత్రాన్ని దర్శించుకొని తమ అజ్ఞాతవాసం సఫలీకృతమవ్వాలని భగవంతుని ప్రార్థించారట. వారి క్షేత్ర దర్శనానికి గుర్తుగా అయిదు శివాలయాలు నిర్మించబడినట్లు అవే పంచపాండవ ఆలయాలుగా ప్రసిద్ది చెందినట్లు చెప్తారు. ఆ పంచపాండవ ఆలయాలే లోకనాధ ఆలయం, జమేశ్వర ఆలయం, కపాలమోచన ఆలయం, మార్కండేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయాలు.

బేడీ ఆంజనేయుడు:

పూరీలో చూడవలసిన ప్రదేశాలలో బేడీ ఆంజనేయుని ఆలయం ఒకటి. దీనినే దరియా మహావీర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయస్వామి కాళ్లకు సంకెళ్లతో మనకు దర్శనమిస్తాడు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణ కథనాన్ని... అది కూడా త్రేతాయుగం నాటి కథనాన్ని చెప్తారు. పూరీ క్షేత్రానికి తరచు సముద్రుని కారణంగా విపత్తు ఏర్పడుతూ ఉండేదట. నయనపథగామి జగన్నాథుని దర్శించాలన్న తపనతో సముద్రుడు ఉప్పొంగి ఉరకలేసేవాడు. జలాల విజృంభణకు పూరీక్షేత్రం పూర్తిగా మునిగిపోయేది. ఈ కారణంగా పూరీలో ఉన్న ప్రజలు ఎన్నో ఇక్కట్లకు గురవ్వాల్సి వచ్చేది. దాంతో ఈ విపత్తు నుంచి  ఎలాగైనా బయటపడాలని భావించిన పూరీక్షేత్రంలో పండితులు కొందరు శ్రీరామచంద్రుని దగ్గరకు వెళ్లి తమకు ఎదురవుతున్న కష్టాన్ని వివరించి, ఆ కష్టం నుండి తమను గట్టెక్కించమని కోరుకున్నారు. వీరి మొరాలకించిన శ్రీరామచంద్రుడు సముద్రుని పిలిచి ఇకమీదట పూరీవాసులకు ఎలాంటి కష్టం కలిగించడానికి వీలులేదనీ గట్టిగా చెప్పాడు. శ్రీరాముని మాటకు సరేనన్న సముద్రుడు కొంతకాలానికి తన సహజ ప్రవృత్తి ప్రకారం పూరీని ముంచెత్తాడు. దాంతో మళ్లీ శ్రీరామునితో మొర పెట్టుకున్నారు పూరీ ప్రజలు. ఇక లాభం లేదని ఆంజనేయుని పిలిచి, పూరీక్షేత్రానికి వెళ్లి సముద్రునికి బుద్ది చెప్పి, వారి కష్టాన్ని గట్టెక్కించి, పూరీ వాసులను రక్షించేవిధంగా కాపలాగా ఉండమని చెప్పి పంపించాడు శ్రీరాముడు. తన ప్రభువు చెప్పిన విధంగా పూరీ వెళ్లి రామాజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. అయితే ఆంజనేయుడు పూరీ పండితులు పెట్టే చప్పిడి భోజనం తినలేకపోయాడట. ఆంజనేయునికి అసలే లడ్డూలంటే అత్యంత ప్రీతి. అయోధ్యలో ఉండగా అతడు భుజించిన లడ్డూలు అతడికి నోరూరిస్తూ ఉండేవి. దాంతో రాత్రివేళల్లో అయోధ్యకు వెళ్లి తనకిష్టమైన లడ్డూలను తినివస్తూ ఉండేవాడట. ఇలా ఆంజనేయుడు రాత్రివేళల్లో పహరాలేకుండా అయోధ్య వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న సముద్రుడు ఒకనాటి రాత్రివేళ పూరీని ముంచెత్తాడు. మళ్లీ మళ్లీ భోరుమంటూ శ్రీరాముని ముందు చేరారు పూరీవాసులు. అంజనేయుడు వంటి అరివీరభయంకరుడు కాపలా ఉన్నాకూడా ఇలా ఎందుకు జరిగిందో ఆరా తీసాడు శ్రీరామచంద్రుడు. ఆంజనేయుడు రాత్రివేళల్లో పూరీలో ఉండకుండా అయోధ్యకు చేరుకోవడం వలన, ఆంజనేయుడు లేని సమయంలో ఇలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని ఆంజనేయుని రప్పించి ఇకమీదట ఇలా చేయవద్దంటూ హెచ్చరించి ఆంజనేయుడి కాళ్లను గొలుసులతో బంధించి పూరీలోనే ఉండమని ఆజ్ఞాపించాడట. అప్పటి నుంచి ఆంజనేయుడు పూరీని వదిలి పెట్టకుండా ఉన్నాడని, ఆంజనేయుని తృప్తిపరచడానికి పూరీవాసులు కూడా లడ్డూలను ఆంజనేయునికి సమర్పిస్తూండేవారని ఒక కథనం. ఈ కారణంగానే ఆంజనేయుడు కాళ్లకు సంకెళ్లతో పూరీ సముద్రతీరంలో మనకు దర్శనమిస్తాడు.

Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం


బిల్వవృక్షం

Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం
శ్రీ వృక్షం, మారేడు వృక్షం అని పిలువబడే బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమే. బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించడం అత్యంత శ్రేష్టం, సర్వపాపహరణం. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను

Saturday, August 4, 2018

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు


రావిచెట్టు 

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు
చెట్టు - పుట్ట, కొండ - కోన, రాయి - రప్ప... ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని భగవదంశగా చూడడం, దైవత్వాన్ని ఆపాదించి ఆరాధించడం, పూజలు చేయడం

Puri jagannatha temple history | పూరీలో దర్శనీయ స్థలాలు

Puri jagannatha temple history | పూరీలో దర్శనీయ స్థలాలు

పూరీలో దర్శనీయ స్థలాలు

విమలాదేవి మందిరం:

ఇది ప్రధాన ఆలయంలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న శక్తి విమలాదేవి. ఇది అమ్మవారి 58 శక్తిపీఠాలలో 17వదిగా చెప్తారు.

Wednesday, August 1, 2018

Puri jagannatha temple history


Puri jagannatha temple history

రోహిణీకుండం:

పంచతీర్దాలులో మరొకటి రోహిణకుండం. జగన్నాధమందిరంలోనే విమలాదేవి మందిరం ఎదురుగా ఉంది రోహిణీకుండం. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నివాసస్థలంగా చెప్తారు.

అక్కడ చనిపోయినవారిని బతికించేస్తున్నారట | templeinfo


అక్కడ చనిపోయినవారిని బతికించేస్తున్నారట

organic burial pods - capsula mundi burial
చనిపోయిన వారికి చేసే రకరకాల అంత్యక్రియల గురించి చాలానే విన్నాం. కొన్ని ప్రాంతాల్లో చేసే అంత్యక్రియలు తమాషాగా అనిపిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో జరిపే అంత్యక్రియలు వినడానికే భీభత్సంగా, భయంకరంగా ఉంటాయి. ఇక మన ఆప్తులు చనిపోయినప్పుడు వాళ్ళ గుర్తుగా ఓ సమాధి కడుతుంటారు. లేదా వాళ్ళ జ్ఞాపకంగా ఏదైనా చేయ్యాలనుకుంటాం.
అయితే వీటన్నిటికీ చాలా డబ్బు ఖర్చవుతుంది. అయితే ఇప్పుడలాంటి అంత్యక్రియలన్నిటికీ భిన్నంగా, తక్కువ ఖర్చుతోనే చనిపోయినవారి జ్ఞాపకం ఉండిపోయేలా  ఓ కొత్త తరహా అంత్యక్రియలను ఆవిష్కరించారు ఇటలీకి చెందిన అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్.

Tuesday, July 31, 2018

సామాన్యుడు కాదు అసామాన్యుడే

సామాన్యుడు కాదు అసామాన్యుడే 

big boss nutan naidu
నూతన్ నాయుడు సామాన్యుడిలా వచ్చి అసామాన్యుడిగా దూసుకుపోతున్నాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందువరకు నూతన్ నాయుడు ఎవరో  ఎవరికీ తెలీదు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా సామాన్యుడిగానే కనిపించాడు. హౌస్ నుంచి బయటికొచ్చాక నూతన్ నాయుడు లోని అసామాన్యుడు బయటకొచ్చాడు. సోషల్ మీడియాలో చాలా ఆవేశంతా మాట్లాడి దుమ్ముదులేపెసాడు. సరిగ్గా అప్పుడే బిగ్ బాస్ వారు ఎలిమినేట అయిన వారిని మళ్ళీ హౌస్ లోకి తీసుకువెళ్లదానికి ఓటింగ్ మొదలుపెట్టారు.

Monday, July 30, 2018

puri jagannatha temple history


పూరీలో దర్శనీయప్రదేశాలు 

                     సాక్షి గోపాలునికి సంబంధించి మరో కధనాన్ని కూడా చెప్తారు. దక్షిణ దేశం నుంచి ఇద్దరు బ్రాహ్మణులూ ఉత్తరదేశ యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రలో బృందావనంలో ఉండగా ఒక సందర్భంలో ఇద్దరిలో పెద్దవాడైన బ్రాహ్మణుడు తన కుమార్తెను ఆ యువకునికి ఇచ్చి వివాహం చేస్తానాని వాగ్దానం చేశాడు. అయితే ఆ యువకుడు ఈ వాగ్దానాన్ని బృందావనంలోని శ్రీకృష్ణుని ఎదుట చెయ్యమని అడుగుతాడు. అలాగే చేస్తాడు పెద్దవాడైన బ్రాహ్మణుడు. తీరా తిరిగి వచ్చే సమయంలో తన వాగ్దానాన్ని త్రోసిపుచ్చుతాడు. దాంతో ఆ బ్రాహ్మణ యువకుడు తమ సంభాషణకు సాక్షిగా ఉన్న శ్రీకృష్ణుని వేడుకుంటాడు. ఇతడి కృష్ణభక్తికి, తనమీద ఉన్న నమ్మకానికి ముచ్చటపడిన కృష్ణుడు నేరుగా ఇక్కడికి వచ్చి వారి సంభాషణకు సాక్ష్యం చెప్తాడు. అలా వచ్చిన గోపాలుడు. సుందరమైన ఆ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడి అక్కడే ఉండిపోయాడట. ఈ కథనానికి ఆకర్షించబడిన ప్రతాపరుద్రదేవుడు ఇక్కడ స్వామికి ఆలయాన్ని కట్టించాడని చెప్తారు. విశేషమేమంటే ఈ ఆలయం పూరీలోని జగన్నాధ ఆలయానికి నమూనాగా ఉంటుంది.

గుండీచా ఆలయం:

పూరీ క్షేత్రంలో దర్శించవలసిన ప్రసిద్ధ దర్శనీయస్థలం గుండీచామందిర్ .ఇంద్రద్యుమ్నుని భార్య గుందీచాదేవి పేరుతొ ఈ మందిరం నిర్మించబడిందని, జగన్నాధుడు ఈమెను మేనత్తగా గౌరవిస్తాడని ఒక కథనం. మందిరం విలక్షణమైన కళింగ శిల్పశైలిలో ఉంటుంది. ఇది 5 శతాబ్దంలో గుర్తించినట్లు చెప్తారు. ఈ గుందీచామందిర్ కు సంబంధించి ఎన్నో ప్రసిద్ధ కథనాలు వినబడతాయి. ప్రసిద్ధ వైష్ణవాచార్యుడు, గౌడియమత స్థాపకుడు, కృష్ణభక్తి ప్రచారకుడు చైతన్యమహాప్రభు ఈ మందిరంలోనికి వెళ్లి అక్కడ అంతర్ధానమయిపోయాడని, జగన్నాధునిలో లీనమయిపోయాడని ఒక కథనాన్నిచెప్తారు. గుండీచామందిరాన్నే జగన్నాధుని జన్మస్థలం.జనకపురి అని కూడా చెప్తారు. దీన్ని గుందీచాఘర్ అని కూడా పిలుస్తారు. జగన్నాదమందిరం నుంచి ఈశాన్యదిశగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. జగన్నాధుని రధయాత్రలో 9 రోజుల స్వామి ఇక్కడే ఉంటాడు. రథయాత్రరోజు జగన్నాదమందిరం నుంచి వచ్చిన స్వామికి బియ్యంతో చేసిన, పదౌపీఠ, పౌడవిత, పౌరపిత అని పిలిచే ఒక పదార్థాన్ని తినిపించి గుండీచా మందిరంలోకి స్వాగతం చెప్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో ప్రధానంగా చెప్పుకోతగినది. హీరాపంచమి యాత్ర”, రథయాత్రలో 5వ రోజు ఈ ఉత్సవాన్ని చేస్తారు.
గుండిచాకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. గుండీచాను గ్రామదేవతగా, దుర్గమ్మగా కూడా భావించి పూజిస్తారు ఒరియా ప్రజలు. ఒరియా భాషలో గుండి అంటే చిన్న అమ్మవారుగా చెప్తారు. అలా అమ్మవారు వచ్చి బాధపడుతున్న వారిని రక్షించే దేవతగా గుండీచాను ఆరాధిస్తారు స్థానికులు.
పంచతీరాలు:
పూరీ క్షేత్రంలో పంచతీరాలు తప్పక దర్శించవలసిన తీరాలుగా చెప్తారు. అందులో మొదటిది ఇంద్రద్యుమ్నుటేంక్ ఇది గుండమందిరానికి సమీపంలో ఉంది. జగన్నాథుని దర్శనం కోసం తపించిపోతు ఇంద్రద్యుమ్నుడు ఈ ప్రదేశంలోనే అశ్వమేధయజ్ఞం  చేసాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ యజ్ఞంలో వందలాది మంది బ్రాహ్మణులు పాల్గొనగా ఆ సందర్భంగా వేలాది  గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాడు ఇంద్రద్యుమ్నుడు, నీజానికి ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన ప్రాంతం కాబట్టి ఇది పూర్వం యజ్ఞకుండంగా పిలువబడేదని, తరువాతి కాలంలో ఇది ఆ రాజు పేరుమీద ఇంద్రద్యుమ్నతీర్థంగా పిలువబడుతున్నదని తెలుస్తోంది. ఇక్కడ ఇంద్రద్యుము మహారాజు వేలాదిగోవులను దానం చేయడంతో వాటి పదఘట్టనల కారణంగా అక్కడ గోతులు ఏర్పడ్డాయని, ఆ గోతులలో దానజలం నించి ఉండడం వలన అవి పరమపవిత్రమయిన తీర్థాలుగా మారిపోయాయని, అందుకే
ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాచరించి తమ పితృదేవతలకు తర్పణములు వదిలిన వారికి  సహస్రాశ్వమేధం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చేస్తున్నాయి. ఈ తీరధం సర్వపాపక్షయకరమైన జీవనది  అని కూడా చేప్తారు. ఇక్కడ అత్యంత సుందర రూపుడయిన బాలకృష్ణుని ఆలయం ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుండీచామందిరంలోనే జగన్నాధ, బలభద్ర, సుభద్రాదేవిల మూర్తులు విశ్వకర్మచేత ఆవిష్కరించ బడ్డాయి.

Konark temple | భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఓ చారిత్రక వైభవం


కోణార్క్ టెంపుల్భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పినఓ చారిత్రక వైభవం

Konark temple | ఓ చారిత్రక వైభవం
చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలకు మన దేశం పుట్టినిల్లు. అలాంటి అద్భుత కట్టడాలలో ముందువరుసలో చెప్పుకునే ఆలయం కోణార్క్ సూర్యదేవాలయం.  
భారతదేశం శిల్పకళకు, సంస్కృతి, సంప్రదాయాలకు ఖండాంతరాలలో సైతం కీర్తితెచ్చిన గొప్ప కట్టడం. ఎంతోమంది విదేశీయులను తనవైపు ఆకర్షించుకొని, అనేక చారత్రక సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. ఇది మాది అని భారతీయులు గర్వంగా చెప్పుకునే కోణార్క్ ఆలయ విశేషాలు చూద్దాం....

Saturday, July 28, 2018

puri jagannath temple history | దర్శనీయస్థలాలు


పూరీక్షేత్రంలో దర్శనీయస్థలాలు 

puri jagannath temple history | దర్శనీయస్థలాలు
కలియుగం అంతమయ్యే సమయానికి జగన్నాధుడు పూరీక్షేత్రం విడిచి పెట్టి వెళ్లిపోతాడా...? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా అవునంటున్నారు భాటియా గ్రామప్రజలు. అలాగే జరుగుతుందని అచ్యుతానందదాస్ అనే సాధువు చెప్పిన జోస్యం వారిని ఆ నమ్మకంలో ఉంచింది. జగన్నాధుడు అనగానే శరీర అవయవాలు సంపూర్ణంగాలేని అసంపూర్ణ మూర్తులు మన కళ్లముందు నిలుస్తారు. కాని ఈ భాటియా గ్రామంలో మాత్రం సంపూర్ణమైన అవయవాలతో రూపుదిద్దుకున్న జగన్నాధ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను చూడవచ్చు.

Pasupathinath temple kathmandu nepal


ప్రపంచ పైకప్పులో వెలసిన పశుపతినాథుడు

Pasupathinath temple kathmandu nepal
సామాన్య జీవితంలో కలగని ఆధ్యాత్మిక చింతన ఇక్కడ అడుగు పెట్టడంతోనే మొదలవుతుంది. ప్రపంచంలోని వేలాదిమంది హిందువులందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడే ప్రదేశం. ఆరాధ్య మందిరం. యునెస్కో వారిచేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటి. . ప్రసిద్ది చెందిన 275 శైవక్షేత్రాల్లో ఒకటి. అదే పశుపతినాథ్ టెంపుల్. ప్రపంచ పైకప్పుగా పిలుచుకునే నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది పశుపతినాథ్ మందిరం. ఇక్కడ చాలా అరుదుగా లభించే నాలుగుముఖాల శివదర్శనం లభిస్తుంది. పరమేశ్వరుడు ఒకసారి భూమ్మీద పర్యటిస్తూ నేపాల్ లోయ పరిసరాలకు వచ్చి ఆ లోయ అందానికి ముగ్ధుడైపోయాడట.  బంగారు కొమ్ములున్న లేడిగా మారి అక్కడ సంచరించాడట. అలా అక్కడ నాలుగు ముఖాలతో పశుపతినాథుడిగా అక్కడ వెలసినట్టు స్థల పురాణం చెప్తోంది.

Friday, July 27, 2018

RX100 hero kartikeya full interview


దూసుకొచ్చిన మరో గెడ్డం హీరోRX100 hero kartikeya  

తెలుగు తెరకు  మరో గెడ్డం హీరో పరిచయమయ్యాడు. ఇప్పుడెవరి నోట విన్నా అతని పేరే. నిన్నమొన్నటి వరకు అతనెవరో తెలీదు. ఒకటో రెండో సినిమాల్లో చిన్నచిన్న కేరెక్టర్స్ చేసాడు. మరిప్పుడు అందరి చూపు అతనివైపే. ఎలాంటి సినీ బేక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి సైలెంట్ గా వచ్చి తుఫాన్ సృష్టించాడు అతనే కార్తికేయ. rx 100 హీరో. సినిమాలో నటనకే కాదు అంతకంటే ముందే తన బోల్డ్ కామెంట్స్ తో అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు rx100  సక్సెస్ ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. సో మూవీ గురించి మరిన్ని ముచ్చట్లు అతని మాటల్లోనే......

puri jagannath temple history | జగన్నాథ ఉత్సవాలు

జగన్నాథుని యాత్రా విశేషాలు 

puri jagannath temple history | జగన్నాథ ఉత్సవాలు

శయనోత్సవం:

జగన్నాథునికి ఆషాడ శుక్ల ఏకాదశి నాడు శయనోత్సవం చేసారు. చాతుర్మాస్య వ్రతదీక్ష సందర్భంగా ఈ ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది.
డోలోత్సవం:

Wednesday, July 25, 2018

Nachiyar koil Temple mystery | సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం

సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం

Nachiyar koil Temple | సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం
సైన్స్ కే సవాలుగా మారిపోయిందా టెంపుల్. సైంటిస్టులకే చుక్కలు చూపిస్తోంది. ఆ ఆలయం నిండా అంతుచిక్కని రహస్యాలే. వీడని చిక్కుముళ్ళే.  
అది 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. పేరుకి వైష్ణ్వాలయమే కాని చూడ్డానికి శివాలయంలా కనబడుతుంది. ఏ ఆలయంలో అయినా ఉత్సవాల్లో ప్రధాన దైవం ఉత్సవామూర్తుల్నే ఊరేగిస్తారు. కాని ఇక్కడ మాత్రం వారి వాహనమైన గరుత్మంతుడిని ఊరేగిస్తారు. అలా ఊరేగిస్తున్నప్పుడు కూడా వింతలే. ఊరేగింపు మొదలైనప్పట్నుంచి గరుడుడు క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటాడు. చివరికి ఆ బరువు మొయ్యలేక మరింత మంది మోతదారులు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఊరేగింపు మొదలైనపుడు మామూలుగా ఉన్న ఉత్సవ విగ్రహ వస్త్రాలు తిరిగి వచ్చేసరికి పూర్తిగా తడిసిపోతాయి. ఎందుకలా.... ఎన్ని పరిశోధనలు జరిగినా ఈ విడివడని చిక్కుముళ్లన్నీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. మరి ఈ విశేషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో... ఆ రహస్యాల పరమర్ధమేంటో చూద్దాం......

Monday, July 23, 2018

puri temple history | రథయాత్ర విశేషాలు


తొలి రథయాత్ర

puri temple history | రథయాత్ర విశేషాలు
ఈనాడింత ప్రసిద్ది చెందిన రథయాత్రను తొలిసారిగా జరిపినదీ, రథ నిర్మాణాన్ని చేపట్టినదీ  ఇంద్రద్యుమ్న మహారాజు. రథనిర్మాణం ఏ విధంగా చేయాలి, వాటియొక్క అలంకరణ ఏవిధంగా ఉండాలి, రథాలను ఏవిధంగా భద్రపరచాలి, ఎలా కాపాడుకోవాలి, రథనిర్మాణానికి కావలసిన సామగ్రిని, కలపను ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్న అన్ని విషయాలను అశరీరవాణిగా సాక్షాత్తు నారాయణుడే చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. స్వామి చెప్పిన విషయాల ద్వారా, నారదుని సలహా, సూచనలతో ఇంద్రద్యుమ్న మహారాజు రథ నిర్మాణం చేయించగా ఒక శుభముహూర్తాన నారదుడు కార్యక్రమం నిర్వహింప చేశాడు.

చందనయాత్ర:


తొలి ఏకాదశి templeinfo

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి templeinfo
హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం గలిగింది ఏకాదశి వ్రతం. ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను నకాది మునులందరికి విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది.

వాట్సప్ | వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో | templeinfo.ml


వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో.....

watsapp latest updates
ఒకపూట తిండి లేకపోయినా ఫరవాలేదు. కాని ఒక్క గంట వాట్సప్ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా కొంపలంటుకోవూ.... ఎన్ని ఊసులు మిస్సవుతాం! ఎన్ని గ్రూపులు మిస్సవుతాం! ఆవకాయ పెట్టడం దగ్గర్నుంచి అఫీషియల్ వర్క్ వరకు అన్నీ వాట్సప్ మీద నడుస్తున్నాయి. బామ్మ గారి దగ్గర్నుంచి బాసుగారి వరకు చేతిలో స్మార్ట్ ఫోను, అందులో వాట్సప్ ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్తితి ఇది. అయితే ఆ కొంపలంటుకునే క్షణం వచ్చేసింది.

Thursday, July 19, 2018

puri jagannatha temple history | rathayara


జగన్నాధుని ఉత్సవాలు 

puri jagannatha temple history | rathayara

పహాండీ ఉత్సవం:

ముందుగా రథం పైకి సుదర్శనమూర్తిని తీసుకువచ్చి సుభద్రాదేవి రథంలో పెడతారు. తరువాత ఎవరికి నిర్దేశించిన రథాలలో వారిని ఉంచుతారు. ఈ విధంగా మూలమూర్తులను ఆలయంలో నుంచి బయటకు రథాల దగ్గరకు తీసుకువచ్చే పని కేవలం దయితులుగా చెప్పబడేవారు మాత్రమే. ఇలా తీసుకురావడాన్నే పహాండీ ఉత్సవం ఉంటారు.
హీరాపంచమి:

Latest Tollywood news | chit chat with RX100 Director Ajay Bhupathi

Special chit chat with RX100 Director Ajay Bhupathi

Latest Tollywood news | chit chat with RX100 Director Ajay Bhupathi
RX100 యూత్ ని కుదిపేస్తున్న పేరు. టాలివుడ్ లో సంచలనంగా మారిన పేరు. రకరకాల సంచలనాల మధ్య విజయం సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డిని ఇంకా మర్చిపోనేలేదు. ఇప్పుడలాంటి ఊపుతోనే ఓ రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ జోష్ తోనే వచ్చేసింది RX 100 మూవీ. మరో బోల్డ్ సినిమా. సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ వెరైటీగా, డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగా చిత్రయూనిట్‌ కూడా తన బోల్డ్ కామెంట్స్ తో టాలివుడ్ ఆడియన్స్ అటెన్షన్ బాగానే గెయిన్ చేసింది. రొటీన్‌ సినిమాలు చూడాలనుకునేవారు మా సినిమాకు రావొద్దంటూ ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోయాయి. దానికి తోడూ మూవీ డైరెక్టర్ ది గ్రేట్ రామ్‌ గోపాల్ వర్మ దగ్గర దర్శశిష్యుడాయే. సో... ఇవన్నీ కలిస్తే rx 100. మరి మూవీ మీద అందరి కన్ను పడకుండా ఉంటుందా.... అదంతా సరే అసలీ rx100 పేరేంటి? అదేంటో మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి మాటల్లోనే విందాం....

Wednesday, July 18, 2018

puri jagannatha temple history | జగన్నాథ రథయాత్ర


రథయాత్రలో విశేషాలు

puri jagannatha temple history | జగన్నాథ  రథయాత్ర
రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత పూరీలో శంకర భగవత్పాదులు ఏర్పాటు చేసిన గోవర్ధన మఠ పీఠాధిపతులు వచ్చి స్వామిని దర్శించుకొని వెళతారు. అనంతరం భగవంతుడి ముందు ఎంతటివారైనా సేవకులే అని చెప్పడానికి నిదర్శనంగా పూరీ రాజు వచ్చి మూడు రథాల ముందు కస్తూరి కళ్లాపి జల్లి బంగారు చీపురుతో ఊడుస్తాడు.

నేటి విశేషం | great fire of romeరోమ్ఈ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తి 

Today importance | Great fire of Rome
Great fire of rome 
జూలై 18. ఈ రోజు ప్రంపంచ చరిత్రలో మరచిపోలేని రోజు.1964 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు అంటే జులై 18 న అగ్ని ప్రమాదం జరిగి రోమ్ లో చాలా భాగం తగలబడిపోయింది. అదే Great fire of rome. ఆ రోజు రాత్రి మొదలైన మంటలు 5 రోజుల వరకు చల్లారలేదట. రోమ్ లోని 14 ప్రాంతాల్లో 4 ప్రాంతాలు పూర్తిగా భస్మమయి పోయాయి. మరో ఏడూ ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయట. ఈ విషయం గురించే ఓ పక్కన రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడని అంటుంటారు. నిజానికది ఫిడేలు కాదు.

Tuesday, July 17, 2018

Puri jagannath temple history | జగన్నాథ రథయాత్ర


జగన్నాధుని ఉత్సవాలు

Puri jagannath temple history
జగన్నాథ రథయాత్ర 
జగాలనేలే జగన్నాధుని ఉత్సవాల విషయానికి వస్తే.. ఆ పరమాత్మకు ఉత్సవాలకే కొదవా! ఎన్ని ఉత్సవాలు.. మరెన్ని పండుగలు.. ఇంకెన్ని పర్వాలు.. జగన్నాధుని ఉత్సవాల విషయంలో ఒక నానుడి ఉంది.

Haridwar temple tour | స్వర్గద్వారం హరిద్వార్


స్వర్గద్వారం హరిద్వారం

Haridwar temple tour
స్వర్గద్వారం హరిద్వార్
మాయాపురి! గంగాద్వారం! హరద్వారం! హరిద్వార్!ఎందరినో ప్రకృతి సౌందర్యాలతో మురిపించి మరెందరినో ఆధ్యాత్మిక మార్గానికి మరలించిన హిమాలయ పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్న పుణ్య క్షేత్రం. పావన గంగానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రంలో తరతరాలుగా ఎంతోమంది ఋషులు ఆశ్రమాలు నిర్మించుకున్నారు. తపస్సు చేశారు. ఇప్పటికీ  మోక్ష పథగాములైనవారు తమ ధ్యానానికి, సాధనకు అనువైన చోటుగా భావించే ప్రదేశం హరిద్వార్, ఉత్తరప్రదేశ్ లోని అతి ముఖ్యమైన పుణ్య క్షేత్రా లలో ఒకటి.

Monday, July 16, 2018

కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్

సంచలనంగా మారిన కిరణ్ బేడీ ట్వీట్  

Kiranbedi 1st lady IPS
కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్
ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ క్రొయేషియాపై విజయం సాధించింది. మరి సహజంగానే గెలిచిన వారికి జేజేలు పలకడం ఉన్నదే కదా. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఫ్రాన్స్ జట్టుకు అభినందనలు తెలియచేసారు. ఇప్పుడదే కిరణ్ బేడీ ని ఎగతాళి పాలు చేసింది.

puri temple history | జగన్నాథ - 12


పూరీ జగన్నాథ క్షేత్ర చరిత్ర 

puri temple history - 12
puri temple history

అసంపూర విగ్రహాల వెనుక ఉన్న కారణం :

పూరీ క్షేత్రంలో దేవతామూర్తులు అసంపూర్ణమైన అవయవాలతో మనకు దర్శనమిస్తారు. ఇలా ఎందుకంటే దానికొక పురాణ కథనాన్ని చెప్పారు.

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం | కాకతీయుల కళావైభవం

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం

Ramappa temple a historical glory
రామప్ప టెంపుల్ ... ఓ చారిత్రక వైభవం 
800 సంవత్సరాల చరిత్ర ఆ టెంపుల్ ది. కళల కాణాచి ఆ ఆలయం. కాల ప్రవాహంలో ఎన్నో ఎదురుదాడులు. ఎన్నో యుద్ధాలు, ఇంకెన్నో దాడులు, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ తట్టుకొని ఠీవిగా నాటి రాజసానికి, సంస్కృతీ సంప్రాదాయలకు ప్రతీకగా సజీవంగా నిలబడింది ఆ గుడి. ఆలయమంతా ఎన్నో అద్బుతాలు. ఒకప్పటి కాకతీయ రాజుల క‌ళా వైభవాన్ని ఆధునికులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటుతోంది. ఓ వైపున చారిత్రక నేపథ్యం ... మరో వైపున ఆధ్యాత్మిక వైభవం....ఇంకోవైపు కాకతీయుల కళావైభవానికి గీటురాయి అన్నీ కలగలిసిన అరుదైన పుణ్య క్షేత్రం. తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్.

అద్భుతాలకు నిలయం రామప్ప టెంపుల్

రామప్ప దేవాలయం ఎన్నో విశిష్టతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం. రామప్ప దేవాలయంగా పిలుస్తున్నా నిజానికిది శివాలయం.

Friday, July 13, 2018

యామినీ కృష్ణమూర్తి జీవితంతో బయోపిక్

 వెండితెరకు మరో బయోపిక్ యామిని కృష్ణమూర్తి 

       ప్రస్తుతం బయోపిక్ ల కాలం జోరుగా నడుస్తోంది. వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి జీవితంతో వచ్చిన మహానటి చిత్రం అఖండ విజయాన్ని సాధించి, ఊహల్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోయినా విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్, ఇంకా చాలామంది క్రీడాకారుల జీవితాలతో మరిన్ని చిత్రాలు  రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు ఎక్కబోతోందట. యామినీ కృష్ణమూర్తి...వారిగురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  నాట్యానికి మారుపేరు.  కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కళాకారిణి. పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి ఎన్నో అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఇప్పుడామె జీవితం తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు చలనచిత్రం గా రాబోతోంది.

Iskcon temple on vaikuntha hill bangaloreఇహలోకంలో వైకుంఠము 

Iskcon temple  on vaikuntha hill bangalore
Iskcon temple  on vaikuntha hill bangalore 
"సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హరిత నగరము, గ్రీన్ సిటీ, సరస్సుల నగరము, ఇలా ఎన్నో విశిష్టతలకు మారుపేరైన బెంగళూరులో చూడవలసిన ప్రసిద్ధ స్థలం ఇస్కాన్ టెంపుల్.  
11 ఎకరాల  విశాల ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు పూత గోపురంతో, బంగారు పూతతో ఏర్పాటు చేసిన 56 అడుగుల ధ్వజస్తంభంతో అద్భుత కృష్ణ మందిరంగా అలరారుతోంది ఇస్కాన్ టెంపుల్. ఇదే రాధాకృష్ణ మందిరంగా పిలుస్తారు.