30, జూన్ 2018, శనివారం

Ryali jaganmohini kesavaswami temple secret | బదిలీల దేవుడు

Ryali jaganmohini kesavaswami temple secret
బదిలీల దేవుడు 

Ryali jaganmohini kesavaswami temple secret | బదిలీల దేవుడు
మీకు ఎంతకాలంగా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ట్రాన్స్ ఫర్ కావడంలేదా.... అయితే ఈ స్వామిని దర్శించండి తప్పకుండా బదిలీ అవుతుంది అంటారు ఆ స్వామి మహిమను తెలిసినవారు. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ దివ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆరో దేవాలయంగా ఖ్యాతికెక్కింది. అదే ర్యాలి క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. ఆ విశేషాలు ఈ వీడియోలో.....

                                                                                                                                                                               

29, జూన్ 2018, శుక్రవారం

తలుపులమ్మతల్లి ఆలయ విశేషాలు | Talupulamma lova temple tuni East Godavari

తలుపులమ్మతల్లి ఆలయ విశేషాలు
Talupulamma lova temple tuni East Godavari

Talupulamma lova temple tuni East Godavari Andhra Pradesh
 తలపులను తీర్చే తల్లిగా, 'తలుపులమ్మ'గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది.  పచ్చటి ప్రకృతిలో ఎటుచూసినా కొండలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవి. అలంటి అడవిలో ఎత్తైన రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు కొలువుతీరి ఉంటుంది.  

28, జూన్ 2018, గురువారం

one log house garberville California | చెట్టు కాండంలో ఇల్లు


one log house garberville Californiaచెట్టు కాండంలో ఇల్లు 

one log house garberville California | చెట్టు కాండంలో ఇల్లు

           ఈ ఫోటో చూస్తున్నారుగా.... ఇదే one log house. పెద్ద పెద్ద చెట్లను, మహావృక్షాలను చూసినపుడు వామ్మో.... ఇంత పెద్ద చెట్టే.....అని ఆశర్యంతో నోరెళ్ళబెదతాం. అలాగే రకరకాల పద్ధతుల్లో కట్టిన ఇళ్ళను కూడా చూస్తుంటాం. కానీ ఒక చెట్టు కాండంలో ఏకంగా ఒక ఇల్లే పట్టేసిందంటే నమ్మగలమా! నమ్మం సరికదా ఆ విషయం గురించి ఎవరైనా చెప్తే, ఛ.... ఊరుకొండి... మరీ వింటున్నాం కదా అని చెవుల్లో పువ్వులు పెట్టకండి అంటూ కొట్టిపరేస్తాం. కానీ ఈ విషయం వింటే... one log house  ఫోటో చూస్తే మాత్రం ఖచ్చితంగా నిజమని నమ్మితీరాలి. మరి దాని డిటైల్స్ ఏంటో తెలుసుకుందాం.....

one log house garberville California 

‘వన్‌ లాగ్‌ హౌస్‌’!  అమెరికాలోని క్యాలిఫోర్నియా దగ్గర  గార్బెర్‌విల్‌ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం రెడ్ వుడ్ చెట్లకు ప్రసిద్ధి. చెట్లంటే అలాంటిలాంటి చెట్లు కావు. ఆకాశాన్నంటే ఎత్తుతో  వేల సంవత్సరాలు బతికే రెడ్‌ ఉడ్‌ చెట్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది. ఇక్కడే ఉంది ఈ  వన్ లాగ్ హౌస్. దాదాపు 2100  సంవత్సరాల వయసు ఉన్న రెడ్‌ ఉడ్‌ చెట్టు  కాండాన్ని తొలిచి ఏడడుగుల ఎత్తూ 32 అడుగుల పొడవుతో  ఈ వన్‌లాగ్‌హౌస్‌ ను ఏర్పాటు చేశారు. చెట్టు కాండంలో ఇల్లంటే అలాంటిలాంటి ఇల్లు కాదు. దీని లోపల అద్భుతమైన లివింగ్‌ రూమ్, డైనింగ్‌ రూమ్, బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వన్ లాగ్ హౌస్ అక్కడో ప్రఖ్యాత పర్యటక ఆకర్షణగా మారిపోయింది. 

satyanarayana swamy temple vizag isukakonda

ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయం, విశాఖపట్నం 

satyanarayana swamy temple vizag isukakonda
భక్తుల ఆపదలు గట్టెక్కించి కోర్కెలు తీర్చడంలో సత్యదేవుడిది పెద్ద పేరే. ఆయన కథ చెప్పుకుని కాస్త ప్రసాదం సేవిస్తేచాలు ఎంతటి అడ్డంకులైనా తొలగిపోతాయట.ఇంటి ఇలవేలుపుగా ఏ దేవుడ్ని, దేవతను కొలుచుకున్నా, వాళ్లతో పాటూ సత్యనారాయణస్వామికి  మొక్కులు చెల్లించుకోవాల్సిందే. సకల శుభాలకూ కారకుడైన స్వామి ఇంట్లో అడుగుపెడితే చాలు సుఖసంతోషాలు వర్థిల్లుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఏ ఇంట్లో పెళ్లి, పేరంటం  గృహప్రవేశం ఏ  శుభకారయం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితీరాల్సిందే. సత్యనారాయణ స్వామి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అన్నవరం. అయితే అన్నవరం తరువాత  అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన క్షేత్రం విశాఖపట్నం ఇసుకకొండ మీద శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి.ఆ ఆలయ విశేషాలు చూద్దాం......

27, జూన్ 2018, బుధవారం

వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి తెరపైకి .....

వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి మళ్లీ తెరపైకి వచ్చింది

Controversial child goddess Shambhavi

శాంభవి ....

సుమారు ఓ ఎనిమిది సంవత్సరాల క్రితం దేశంలో సంచలనం రేపిన పేరు. తాను గతజన్మలో దలైలామా స్నేహితురాలినని, గౌతమబుద్ధుని శిష్యురాలినని, టిబెట్ కు స్వాతంత్ర్యం తీసుకురావడానికే పుట్టిన కారణజన్మురాలినని ప్రకటించుకొని దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ తరువాత కొంతకాలానికే మళ్ళీ తెరమరుగయింది బాలసన్యాసిని శాంభవి. ఆ తరువాత ఆ పాప ఎక్కడుందో కూడా తెలియలేదు. యధాప్రకారం మీడియాతో పాటు సామాన్యజనం కూడా మర్చిపోయారు. ఇప్పుడా వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి మళ్లీ తెరపైకి వచ్చింది...
2009లో క‌ర్నూలు జిల్లాలో ఏడేనిమిదేళ్ల ఓ చిన్నాఎనిమిదేళ్ళ శాంభ‌వి బాల‌స‌న్యాసిగా వెలుగులోకొచ్చింది. అప్పట్లో ఆ పాప, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. తాను, ద‌లైలామా పూర్వ‌జ‌న్మ‌లో స్నేహితులమని, గౌత‌మ బుద్దుని శిష్యులమని చెప్పి సంచలనం రేపింది. అంతేకాదు టిబెట్ దేశానికి మ‌రో మూడు ఏళ్ల‌లో స్వాతంత్య్రం ఇప్పించేందుకే  తాను జ‌న్మించాన‌ని, వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి వీర‌భోగ వ‌సంత‌రాయులుగా  మ‌ళ్లీ జ‌న్మించి, దుష్ట శిక్ష‌ణ‌,శిష్ట‌ ర‌క్ష‌ణ చేస్తాడ‌ని, 2012వ సంవ‌త్స‌రంలో భూమిలో చాలామటుకు  న‌శిస్తుంద‌ని, ఇందులో భార‌త‌దేశం బాగానే ఉంటుంది కానీ, చైనా,పాకిస్థాన్,అమెరికా లాంటి దేశాలు మాత్రం నాశ‌నమయిపోతాయ‌ని ఇలా చాలా చాలా విషయాలే చెప్పింది బాల సన్యాసిని శాంభ‌వి.  త‌న‌కు చాలా మాన‌వాతీత‌,దైవ శ‌క్తులున్నాయ‌ని,ద‌లైలామాతో టెలిప‌తిలో మాట్లాడుతాన‌ని కూడా చెప్పుకుంది.
ఈ విషయం మీద దీనిపై బాబు మానవతావాది గోగినేని ముందుకొచ్చి, ఇదంతా ఒత్తి అభూతకల్పనని, శాంభవిని బాల‌స‌న్యాసిగా ప్ర‌చారం చేస్తూ, జ‌నంలో మూఢ‌న‌మ్మాకాన్ని స్ప్రెడ్ చేస్తున్నార‌ని, ఆ బాలిక హ‌క్కులు కాల‌రాస్తున్నార‌ని, స్కూలుకి వెళ్లి చదువుకోవలసిన పాపను ఇలా బాల సన్యాసిని గా ప్రచారం చేసి ఆ పాపను బాల్యానికి దూరం చేస్తున్నారని, ఇదంతా ఆధ్యాత్మికత పేరుతొ చేస్తున్న వ్యాపారమని  గట్టిగా చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అప్పట్లో ఈ విషయం మాన‌వ‌హ‌క్కుల సంఘందాకా వెళ్లింది. ఆర్డీవో విచార‌ణ కూడా జ‌రిగింది. అప్ప‌ట్లో కోర్టు కూడా శాంభవిని స్కూళ్లో చేర్పించి, చ‌దువు చెప్పించాల‌ని తీర్పిచ్చింది. ఆ త‌ర్వాత బాలసన్యాసిని సడెన్ గా మాయమయింది.  ఎక్క‌డుందో కూడా ఎవరికీ తెలియలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు  స‌డెన్ గా ఇప్పుడు ప్ర‌త్య‌క్ష‌మైంది బాలసన్యాసిని శాంభ‌వి.
రావడం రావడమే బాబు గోగినేనిపై ఆరోప‌ణ‌లతో వచ్చింది. ఆయ‌న తమ ఆశ్ర‌మం ప‌క్క‌న ఓ శ‌వాన్ని పాతిపెట్టించాడని, అనేక ఇబ్బందులకు గురిచేసాడని, తన ఫోటోల‌ను మార్ఫింగ్ చేయించి ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడ‌ని, ద‌లైలామాపై కూడా దుష్ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, ఆయనపై  క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు తాము సిద్దం అవుతున్నామంటూ ఆయ‌న నుంచి త‌మను తాము కాపాడుకునేందుకు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌చ్చాన‌ని ఇలా చాలాచాలా అభియోగాలతో మళ్ళీ బయటికొచ్చింది బాలసన్యాసిని శాంభవి.
అయితే, ఇంత‌కాలం సైలెంట్ గా ఉండి,ఇప్పుడే ఎందుకు ఆమె బ‌య‌టికి వ‌చ్చిందీ 
బాలసన్యాసిని శాంభవి? దీనివెనుక కూడా చాలా చాలా ఊహాగానాలే మొదలయ్యాయి. కొంతకాలం క్రితం ఓ చానల్ లో వచ్చిన డిబేట్ లో బాబు గోగినేని త్వరలో చాలా ఇబ్బందుల్లో పడబోతున్నారని ఓ జ్యోతిష్యుడు చెప్పడం, ఈ నేపధ్యంలో ఈ బాలసన్యాసిని శాంభవి ఇలా బాబు గోగినేని మీద అభియోగాలతో రావడం, ఇదంతా ఏదో కుట్ర అని కొందరి ఊహాగానాలు. అసలింతకీ ఈ వ్యాఖ్యలకు స్పందించాల్సిన బాబు గోగినేని మాత్రం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల ఆయనెలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

umoja village kenya | ప్రమీలరాజ్యం అక్కడ పురుషులకు ప్రవేశం లేదు

umoja village kenya
ప్రమీలరాజ్యం అక్కడ పురుషులకు ప్రవేశం లేదు

umoja village kenya | ప్రమీలరాజ్యం అక్కడ పురుషులకు ప్రవేశం లేదు
ప్రమీలరాజ్యం ఈ మాట వినగానే మహాభారతమ్ గుర్తొస్తుంది. ఆ  కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాతృస్వామ్యం ఉండేదంట. అక్కడంతా ఆడవాళ్ళదే రాజ్యం. అక్కడంతా ఆడవాళ్లే కనబడతారు. ఆ ఆడవాళ్ళ రాజ్యంలో మగపురుగు కూడా చేరడానికి వీల్లేదు. అదే ప్రమీలరాజ్యం.  కేరళలోని ట్రావన్‌కోర్‌ రాజవంశం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో... ఎనిమిదిమంది బాలికల్ని దత్తత తీసుకుంది. కారణం ఒక్కటే .. మహిళా వారసత్వాన్ని కొనసాగించడం. ఇక ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మాత్రుస్వామ్యమే సాగుతున్న కథనాలు కూడా వింటున్నాం. కాని పూర్తిగా ఆడవాళ్ళతోనే నిండిపోయి మగ అన్నామాటకే చోటులేని ప్రాంతాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే అలాంటి ప్రమీలా రాజ్యాలు కొన్ని ఈ కెన్యా, ఇండోనేషియాలలో కనిపిస్తున్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం.
ఉమోజా ....ఉత్తర కెన్యాలోని సాంబురు ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం. ఆధునిక ప్రమీలరాజ్యం. ఈ  ప్రమీలా రాజ్యం ఉమోజాలో అందరూ మహిళలు, పిల్లలే ఉంటారు.15 మందితో మొదలైన ఉమోజ  గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు

26, జూన్ 2018, మంగళవారం

The History of Fake Babas | Vjayamavuru

The History of Fake Babas
Dera Baba, Radhe Maa,Asharam Bapu

The History of Fake Babas
India is a place where there is mysticism. In any case, the incongruity is that a similar land has seen probably the most un-otherworldly and contemptuous Fake babas, who have been blamed for violations and have even been sentenced. 

Counterfeit babas are only a revile for the general public. The fack babas don't simply hamper the development of the general public yet in addition help increment intolerable criminal exercises. Yet, are these babas equipped for doing such things alone? The appropriate response presumably is negative. More details about fake babas in this video.................

దేశంలో బాబాలు పడ్డారు. అవునండీ.....మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో గానీ ఈ బాబాలు తలచుకుంటే మాత్రం ఉన్నపళంగా నోట్ల వర్షం కురిపించేస్తారు. కష్టాల సుడిగుండాన్ని అమాంతం దాటించేస్తారు. ఎంత తీవ్రమయిన మానసిక సమస్యలయినా చిటికెలో చిటికెలో ఉఫ్ అని ఊదిపారేస్తారు. ఇక ఎంతటి మొండి, దీర్ఘరోగాల్నయినా చిటికెడు విభూతితో తరిమేస్తారు. ఇవన్నీ ఇప్పుడు చాలామంది భక్తుల నోటినుంచి ఎంతో నమ్మకంగా, ఇంకా చెప్పాలంటే తన్మయత్వంతో వచ్చే మాటలు. భక్తి ముసుగులో కొందరు బాబాలు చేసే అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా ఇంకా ఇంకా వాళ్ళను గుడ్డిగా నమ్మే జనం సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంది. బాబాల భక్తీ వెనకున్న రక్తి బయటపడుతుండడంతో ఒక్కొక్కరు వరుసగా జైలు పాలు అవుతూనే ఉన్నారు. జైల్లో ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో కొందరు కాస్ట్లీ,మోడరన్ బాబాలు, మాతల విశేషాలు పై వీడియోలో .......


25, జూన్ 2018, సోమవారం

Buddhist temple, made by million beer bottles

Buddhist temple 
made by million beer bottles
buddhist temple made bu million beer bottles
its a wonder. temple and liquor don't precisely go together, not to mention envisioning one made of beer bottles! Furthermore, you will never trust it could happen except if you see Wat Pa Maha Chedi Kaew, a Buddhist sanctuary in Thailand.Situated in the Khun Han region of Sisaket region in Thailand, the sanctuary is known to have been completely made of in excess of a million brew bottles. For more details watch this video..........
కొన్ని లక్షల బీర్ బాటిళ్ళతో గుడి కట్టారు. అది కూడా బుద్ధిస్ట్ టెంపుల్. వాట్....బీర్ బాటిళ్లతో గుడా.... ఎస్... ఇట్స్ ట్రూ .... సుమారు 15 లక్షల ఖాళీ బీర్ బాటిల్స్ తో ఓ బుద్ధిస్ట్ టెంపుల్ కట్టారు. వినడానికే వింతగా ఉన్న ఈ కథా కమామిషు ఈ వీడియోలో.......

24, జూన్ 2018, ఆదివారం

sahastrabahu (sas bahu) temple gwalior, madhya pradesh | అత్తాకోడళ్ల గుడి

sahastrabahu temple gwalior, madhya pradesh 

sas bahu temple

అత్తాకోడళ్ల గుడి

sahastrabahu temple gwalior, madhya pradesh, sas bahu temple, అత్తాకోడళ్ల గుడి

sas bahu temple 


Sasbahu Temple, likewise called the Sas-Bahu Mandir, Sas-Bahu Temples, Sahastrabahu Temple or Harisadanam sanctuary, is an eleventh century twin sanctuary in Gwalior, Madhya Pradesh, India. Near the Gwalior Fort and committed to Vishnu in his Padmanabha frame, as most Hindu and Jain sanctuaries in this area, it is for the most part in ruins and was gravely harmed from various intrusions and Hindu-Muslim wars in the region. It was worked in 1093 by King Mahipala of the Kachchhapaghata line, as per an engraving found in the bigger of the twin sanctuary. The twin sanctuaries are arranged in the Gwalior Fort For more details see this video...... 


ఇంటిలోన పోరు ఇంతింత కాదయా .అంటూ చెప్పకనే చెప్పాడు యోగి వేమనగారు. ముఖ్యంగా అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తుల తలనోప్పుల్ని పేస్ చేయడం సామాన్యులకే కాదు రాజులు, రాజాది రాజులకే తప్పలేదు. మహామహులే అత్తకోడల్లా మధ్య ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్న సందర్భాలెన్నో. ఇలాంటి ఘటనే ఓసారి గ్వాలియర్ రాజులకేదురయిండి. అయితే ఆ రాజులకేదురయిన ఆ ఇంటిపోరు అద్భుతమైన ఓ మందిర నిర్మాణానికి దారితీసింది. అదే ఇప్పుడు ప్రఖ్యాత పర్యాటకస్థలంగా ప్రసిద్ధి చెందింది. 

23, జూన్ 2018, శనివారం

snake island brazil most deadliest place on earth


Snake island brazil 

Nagalokkam in the earth

That's a beautiful world from outside. But there is a terrible story behind that beauty. It is a terrible island called snake island, that no human bearer can enter. Most deadliest place on earth. That is Nagalokkam on earth called snake island brazil. For more details watch this video.....

22, జూన్ 2018, శుక్రవారం

budhanilkantha temple khatmandu,Nepal | mystery&history of budhanilkantha|నీట్లో తేలే భారీవిగ్రహం

Mystery of  Lord Vishnu statue Which Floats On Water, Budhanilkantha temple

A spiritual wonder Buddhanilakanth Temple is located in Bagmathi state in Nepal. The temple was known for an idol of this temple. The temple is dedicated to Lord Vishnu. Buhhanilkanth is a small town with Hindu God Sleeping Vishnu, located about 8 kilometers from Kathmandu. Thousands of travelers arrived this temple all the year around. see more details in this video....

21, జూన్ 2018, గురువారం

Park ....
 a beautiful and pleasant atmosphere. If you sit in the park and relax in the floral fragrances of cool air, you feel that way. But all the parks do not have to do that! It's not pleasant to hear about some parks ... we're going to hear their name and we'll be glad to hear about it all. Such is the poison park, the oxygen park, the toy park. 
So ... let's look at those parks .....
పార్క్....

పార్క్ అనగానే అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళముందు కదులుతుంది. పార్క్లో కూర్చొని చల్లటి గాలి తీసుకొచ్చే పూల పరిమళాలను పీలుస్తూ విశ్రాంతిగా కూర్చుంటే ఓహ్ ఆ అనుభూతే వేరు. అయితే అన్ని పార్కులు అలా ఉండవు సుమా! కొన్ని పార్కుల గురించి వింటే ఆహ్లాదకరమైన అనుభూతి కాదు కదా... వాటి పేరు వింటేనే అందోళనతో పరుగులు పెడతాం, మరికొన్నిటిని గురించి వింటే ఆనందంతో గంతులేస్తాం. అలాంటివే పాయిజన్ పార్క్, ఆక్సిజన్ పార్క్,బొమ్మల పార్క్ లాంటివి. సో...ఆ పార్కుల గురించి చూద్దాం.....14, జూన్ 2018, గురువారం

History and mystery of Ajanta caves

History and mystery of Ajanta caves

The mysteries of the mysterious beings.
Wherever the history of the eras will stand before our eyes.

Testimony of centuries history. Every stone and every stone, there's a lot of stories.

Thousands of feet are some ... thousands of meters long and some more ...

Some more in the interior of the land ...
Some of the gods like the gods ...


The same cave ... the same caves .... caves ....
These caves are the amazing sculptures of any human being. One of the most immediately recognized caves is Ajanta Caves one ....

So now let's get in the Ajanta caves Letts go .....

అంతుచిక్కని రహస్యాలకు నిలయాలవి.
అక్కడికెళితే యుగయుగాల చరిత్ర మన కళ్ళముందు నిలబడుతుంది.

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలవి. అక్కడ అడుగడుగునా ప్రతి రాయి, రప్ప ఎన్నో కథలు చెప్తుంది.

వేల అడుగుల ఎత్తులో ఉండేవి కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఉండేవి ఇంకొన్ని...

భూ అంతర్భాగంలో మరికొన్ని...
దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు నివాసాలుగా మరికొన్ని...

ఇంతకీ అవేంటి.....అవే గుహలు....కేవ్స్....
ఏ మనిషి కట్టని ప్రకృతి చెక్కిన అద్భుతాలే ఈ గుహలు. కేవ్స్ అనగానే వెంటనే గుర్తొచ్చే వాటిలో అజంతా కేవ్స్ ఒకటి ....

సో.... ఇప్పుడు అజంతా గుహలల్లోకి ఎంటరైపోదాం