3, జులై 2018, మంగళవారం

మోక్షం కోసం సామూహిక ఆత్మహత్యలు


మోక్షం కోసం సామూహిక ఆత్మహత్యలుఇది మూర్ఖత్వమా?! పిచ్చా?!అంతకుమించి ఇంకేదైనానా?! 

Delhi buraree family suicids
మోక్షం కోసం సామూహిక ఆత్మహత్యలట! ఎంత దారుణం! మోక్షం కోసం ఒకే ఇంట్లో 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారట. ఇదెక్కడో మారుమూల కుగ్రామంలోనో, లేదంటే విద్యాగంధం అంతగా లేని ప్రాంతాల్లోనో కాదు... దేశరాజధాని, ఆధునికతకు ఆలవాలమయిన డిల్లీలో వ్యాపారస్తుల కుటుంబంలో జరిగింది. ఒకే ఇంట్లో అనుమానాదస్పద స్థితిలో ఉన్న 11 మృత దేహాలు బయపడి దేశ రాజధానిలో కలకలం సృష్టించాయి . డిల్లీలో బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషుల మృతదేహాలు కనిపించాయని వార్తలు గుప్పుమన్నాయి. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన నారాయణ్‌ దేవి కుటుంబం ఇరవై రెండేళ్ల క్రితం ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్‌నగర్‌కువచ్చి స్థిరపడ్డారు.  ఒక కిరాణా దుకాణం, ప్లైవుడ్‌ వ్యాపారం కూడా ఉంది వీరికి. అనుమానాస్పద స్థితిలో మరణించిన వీరిని ఎవరైనా హత్య చేసారా? లేక ఇంకేదైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే పోస్ట్ మార్టం లో చనిపోతున్నపుడు వీరు ఎలాంటి పెనుగులాట గానీ, గలాటాకు గానీ గురికాలేదని బయటపడింది. రకరకాల అనుమానాలు, విచారణలు జరిగిన తరువాత ఏతావాత తేలిందేంటంటే ఇదంతా మంత్ర, తంత్ర పూజల ఫలితంగానే జరిగిందని గట్టిగా వినిపిస్తున్న మాట. ఇదంతా మోక్షం కోసమేనట.తమకు తాముగా స్వఛ్చందంగా చనిపోతే మోక్షం లభిస్తుందన్న నమ్మకమే ఈ ఆత్మహత్యల వెనకున్న మోటో. ఆ ఇంట్లో దొరికిన లేఖల్లో కూడా ఈ విషయం గురించే, చావడానికి మీరు బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి. కళ్లను మూసుకోండి. అప్పుడే మీకు మోక్షం లభిస్తుంది లాంటి రాతలున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రస్తుతం జనాల్లో కలకలం రేపుతున్న విషయం. అసలు మోక్షం కోసం నిలువునా ప్రాణాలెలా తీసుకుంటారు?! ఇంత మూర్ఖత్వమా?!!!! ఆ ఇంట్లో కొందరు కుటుంబసభ్యులు తంత్ర పూజలు చేస్తుంటారని మొదట ఆ పూజలు చేసే వారే ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నారని ఆ తరువాత ఏం జరిగిందో కుటుంబంలోని మిగిలినవారిని కూడా చంపేసి ఆత్మహత్య చేసుకొని ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా వీళ్ళు మోక్షం కోసమే స్వచ్చందంగా ఆత్మహత్యలు చేసుకొని ఉంటే .... అది మూర్ఖత్వమనాలా?! లేక పిచ్చానాలా?! అంతకుమించి ఇంకేదైనా అనాలా...?!!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి