Tuesday, July 31, 2018

సామాన్యుడు కాదు అసామాన్యుడే

సామాన్యుడు కాదు అసామాన్యుడే 

big boss nutan naidu
నూతన్ నాయుడు సామాన్యుడిలా వచ్చి అసామాన్యుడిగా దూసుకుపోతున్నాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందువరకు నూతన్ నాయుడు ఎవరో  ఎవరికీ తెలీదు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు కూడా సామాన్యుడిగానే కనిపించాడు. హౌస్ నుంచి బయటికొచ్చాక నూతన్ నాయుడు లోని అసామాన్యుడు బయటకొచ్చాడు. సోషల్ మీడియాలో చాలా ఆవేశంతా మాట్లాడి దుమ్ముదులేపెసాడు. సరిగ్గా అప్పుడే బిగ్ బాస్ వారు ఎలిమినేట అయిన వారిని మళ్ళీ హౌస్ లోకి తీసుకువెళ్లదానికి ఓటింగ్ మొదలుపెట్టారు.
మరి వచ్చిన అవకాశాన్ని అసామాన్యుడు ఎలా వదులుకుంతాడు. ప్రేక్షకుల మద్దతుతో సెలబ్రిటీ అయిన శ్యామల కంటే ఎక్కువ ఒత్లతోనే మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనంతటికీ కారణం సంపూర్నేష్ బాబు, కౌశల్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల అనుకూల ఓటింగేనని కూడా జనాల ఉవాచ. మరి ఇంత సంచలనం సృష్టించి అసామన్యుడుగా మారిన సామాన్యుడు అసలేవరు ఎక్కడివాడు చూద్దాం.....
విశాఖపట్నంకు చెందిన నూతన్ కుమార్ నాయుడు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కాపు వర్గానికి చెందినవాడుఎం ఏ, ఎం ఫిల్ చేసిన నూతన్ నాయుడు మంచి స్పీకర్. తన వాగ్దాటితో ఎదుటివారిని ఆకట్టుకోవడంలో దిట్ట. 
కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చాల ఏక్టివ్ గా పనిచేసాడు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. సోషల్ వర్కర్ గా ఎన్నో కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. రాజకీయాల్లో రాణించి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఒక మంచి నాయకుడిగా తన సత్తా ప్రూవ్  చేసుకోవాలనుకున్తున్నాడు.
మరిప్పుడు సైలెంట్ గా ఉంటూనే సెలబ్రిటీల కంటే దూసుకుపోతున్నాడు. చూద్దాం హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు వచ్చిన అవకాశాన్ని ఎలా యూస్ చేసుకుంటాడో..... 

No comments:

Post a Comment