4, జులై 2018, బుధవారం

వారణాసిలో వేశ్యలు చేసే వింత నృత్యాలు

వారణాసిలో వింత నృత్యాలు 


ఈ నృత్యాల గురించి వింటే ఔరా! అని ముక్కున వేలేసుకోక మానరు. ఎందుకంటే ఇది
స్మశాన నృత్యం. కాశీలోని స్మశానమే దీనికి వేదిక. సమాజం చీదరించుకునే వేశ్యలే కళాకారులు. శవాలు, శవాల్ని చూసి ఏడుస్తున్న బంధువులే ప్రేక్షకులు.  ఇదేంటి .... భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, మణిపురి ఇలా రకరకాల నృత్యరీతుల గురించి విన్నాం. గానీ ఇలాంటి డేన్స్ గురించి ఎప్పుడూ వినలేదే! అనుకుంటున్నారు కదూ.... వస్తున్నా ... వస్తున్నా ఆ వివరాల్లోకే వస్తున్నా.... 
   ఎగిసిపడుతున్న చితిమంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తారు వేశ్యలు. ఇది

వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న వింత ఆచారం. నమ్మకం కలగడం లేడు కదూ.... కాని ఇది అక్షరసత్యం. సుమారు 450 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆచారం. రాజా మంజీసింగ్ కాలం నుంచి ఉన్న ఈ ఆచారం మళ్ళీ బాబా సంశాన్ నాథ్ ఆధ్వర్యంలో పునఃప్రారంభించబడిందట. ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగనాడు జరిగే ఆ నృత్య ప్రదర్శన ప్రధానంగా కాశీలోని మణికర్ణికా ఘాట్ లో జరుగుతుంది.   శ్రుంగార్ ఆఫ్ స్మశానేశ్వర్ మహాదేవ్ గా పిలుచుకునే ఈ వేడుకలో పాల్గొనే వేశ్యలు శివదాస్పూర్, మండూదిహ్, చునార్, దల్మదిండి వంటి సుదూర ప్రాంతాల నుంచి వారణాసికి గుంపులు గుంపులుగా వచ్చిన వేశ్యలు అక్కడ కాలుతున్న చితిమంటల చుట్టూ తిరుగుతూ డేన్స్ చేస్తారు. ఇలా నృత్యం చేసే ఆ వేదికను మహాస్మశాన్ అని, గొప్ప దహనభూమి అని పిలుస్తారు. అక్కడ స్మశానవాసి,  భూతనాధుడైన పరమేశ్వరుని స్మశానేశ్వార్ గా పూజలు చేస్తారట. సారాయి, భంగు, గంజాయి, మాంసం  వంటి పదార్ధాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.   తరువాత రాత్రంతా ఆడి, పాడి స్వామిని అర్చిస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎందుకొచ్చిందో తెలుసా ...... ఇదంతా ఆ వేశ్యలు తమ తరువాతి జన్మలోనైనా తమకు ఇలాంటి నీచజన్మ కాకుండా మంచి జన్మ రావాలని స్మశానవాసి అయిన ఆ మహాదేవుని ఆ స్మశానంలోనే తమ నృత్యాల ద్వారా కోరుకుంటారట. ఈ నృత్యాలను చూడడం కోసం తండోపతండాలుగా జనాలు వస్తారట. ప్రళయకాలంలో కూడా నాశనంకాని పవిత్రభూమి కాశీగా చెప్తారు. అందుకే అంతటి పవిత్రమైన ఆ భూమి మీద స్మశానేశ్వర్ బాబాని ఆరాధిస్తే, బాబా తమ మొర విని తమకు మంచి జీవితాన్ని ప్రసదిస్తాదన్న  నమ్మకంతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని ఆ వేడుకలో పాల్గొనే వేశ్యలు చెప్తారు.
       


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి