Wednesday, July 18, 2018

నేటి విశేషం | great fire of rome



రోమ్ఈ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తి 

Today importance | Great fire of Rome
Great fire of rome 
జూలై 18. ఈ రోజు ప్రంపంచ చరిత్రలో మరచిపోలేని రోజు.1964 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు అంటే జులై 18 న అగ్ని ప్రమాదం జరిగి రోమ్ లో చాలా భాగం తగలబడిపోయింది. అదే Great fire of rome. ఆ రోజు రాత్రి మొదలైన మంటలు 5 రోజుల వరకు చల్లారలేదట. రోమ్ లోని 14 ప్రాంతాల్లో 4 ప్రాంతాలు పూర్తిగా భస్మమయి పోయాయి. మరో ఏడూ ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయట. ఈ విషయం గురించే ఓ పక్కన రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడని అంటుంటారు. నిజానికది ఫిడేలు కాదు.
లైర్ అనే వాద్యమట. అప్పటికింకా ఫిడేలు రూపొందలేదట. రోమన్ చరిత్రకారుడు టాసిటస్ రాసినదాని ప్రకారం .... చూస్తె అప్పటి రోమ్ చక్రవర్తి నీరో ఓ పక్క నగరం తగలబడిపోతుంటే తన అంతఃపురంలో కూచుని లైర్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నాడట. దీన్నే గ్రేట్ ఫైర్ ఆఫ్ రోమ్ గా ప్రసిద్ధి చెందింది.
క్రీ.శ.64 జూలై 18. న రోమ్ నగరం తగలబడిపోయిన రోజు. ఇళ్లు, భవంతులు అన్నీ బూడిద కుప్పలయ్యాయి. వరసగా ఐదు రోజులు మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయట. నీరో చక్రవర్తే ఈ దారుణానికి పూనుకున్నాడని అంతా అనుకున్నారు. డోమస్ ఆరియా అనే మహా అద్భుత రాజప్రాసాదాన్ని నిర్మించేందుకు నీరో ఈ దారుణానికి ఒడిగట్టాడంటారు.
ఓ పక్క నగరమంతా తగలబడిపోతుంటే నీరో మాత్రం ‘లైర్’ అనే వాద్యాన్ని వాయించడంలో మునిగిపోయాడట.  

No comments:

Post a Comment