Monday, July 30, 2018

puri jagannatha temple history


పూరీలో దర్శనీయప్రదేశాలు 

                     సాక్షి గోపాలునికి సంబంధించి మరో కధనాన్ని కూడా చెప్తారు. దక్షిణ దేశం నుంచి ఇద్దరు బ్రాహ్మణులూ ఉత్తరదేశ యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రలో బృందావనంలో ఉండగా ఒక సందర్భంలో ఇద్దరిలో పెద్దవాడైన బ్రాహ్మణుడు తన కుమార్తెను ఆ యువకునికి ఇచ్చి వివాహం చేస్తానాని వాగ్దానం చేశాడు. అయితే ఆ యువకుడు ఈ వాగ్దానాన్ని బృందావనంలోని శ్రీకృష్ణుని ఎదుట చెయ్యమని అడుగుతాడు. అలాగే చేస్తాడు పెద్దవాడైన బ్రాహ్మణుడు. తీరా తిరిగి వచ్చే సమయంలో తన వాగ్దానాన్ని త్రోసిపుచ్చుతాడు. దాంతో ఆ బ్రాహ్మణ యువకుడు తమ సంభాషణకు సాక్షిగా ఉన్న శ్రీకృష్ణుని వేడుకుంటాడు. ఇతడి కృష్ణభక్తికి, తనమీద ఉన్న నమ్మకానికి ముచ్చటపడిన కృష్ణుడు నేరుగా ఇక్కడికి వచ్చి వారి సంభాషణకు సాక్ష్యం చెప్తాడు. అలా వచ్చిన గోపాలుడు. సుందరమైన ఆ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడి అక్కడే ఉండిపోయాడట. ఈ కథనానికి ఆకర్షించబడిన ప్రతాపరుద్రదేవుడు ఇక్కడ స్వామికి ఆలయాన్ని కట్టించాడని చెప్తారు. విశేషమేమంటే ఈ ఆలయం పూరీలోని జగన్నాధ ఆలయానికి నమూనాగా ఉంటుంది.

గుండీచా ఆలయం:

పూరీ క్షేత్రంలో దర్శించవలసిన ప్రసిద్ధ దర్శనీయస్థలం గుండీచామందిర్ .ఇంద్రద్యుమ్నుని భార్య గుందీచాదేవి పేరుతొ ఈ మందిరం నిర్మించబడిందని, జగన్నాధుడు ఈమెను మేనత్తగా గౌరవిస్తాడని ఒక కథనం. మందిరం విలక్షణమైన కళింగ శిల్పశైలిలో ఉంటుంది. ఇది 5 శతాబ్దంలో గుర్తించినట్లు చెప్తారు. ఈ గుందీచామందిర్ కు సంబంధించి ఎన్నో ప్రసిద్ధ కథనాలు వినబడతాయి. ప్రసిద్ధ వైష్ణవాచార్యుడు, గౌడియమత స్థాపకుడు, కృష్ణభక్తి ప్రచారకుడు చైతన్యమహాప్రభు ఈ మందిరంలోనికి వెళ్లి అక్కడ అంతర్ధానమయిపోయాడని, జగన్నాధునిలో లీనమయిపోయాడని ఒక కథనాన్నిచెప్తారు. గుండీచామందిరాన్నే జగన్నాధుని జన్మస్థలం.జనకపురి అని కూడా చెప్తారు. దీన్ని గుందీచాఘర్ అని కూడా పిలుస్తారు. జగన్నాదమందిరం నుంచి ఈశాన్యదిశగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. జగన్నాధుని రధయాత్రలో 9 రోజుల స్వామి ఇక్కడే ఉంటాడు. రథయాత్రరోజు జగన్నాదమందిరం నుంచి వచ్చిన స్వామికి బియ్యంతో చేసిన, పదౌపీఠ, పౌడవిత, పౌరపిత అని పిలిచే ఒక పదార్థాన్ని తినిపించి గుండీచా మందిరంలోకి స్వాగతం చెప్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో ప్రధానంగా చెప్పుకోతగినది. హీరాపంచమి యాత్ర”, రథయాత్రలో 5వ రోజు ఈ ఉత్సవాన్ని చేస్తారు.
గుండిచాకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. గుండీచాను గ్రామదేవతగా, దుర్గమ్మగా కూడా భావించి పూజిస్తారు ఒరియా ప్రజలు. ఒరియా భాషలో గుండి అంటే చిన్న అమ్మవారుగా చెప్తారు. అలా అమ్మవారు వచ్చి బాధపడుతున్న వారిని రక్షించే దేవతగా గుండీచాను ఆరాధిస్తారు స్థానికులు.
పంచతీరాలు:
పూరీ క్షేత్రంలో పంచతీరాలు తప్పక దర్శించవలసిన తీరాలుగా చెప్తారు. అందులో మొదటిది ఇంద్రద్యుమ్నుటేంక్ ఇది గుండమందిరానికి సమీపంలో ఉంది. జగన్నాథుని దర్శనం కోసం తపించిపోతు ఇంద్రద్యుమ్నుడు ఈ ప్రదేశంలోనే అశ్వమేధయజ్ఞం  చేసాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ యజ్ఞంలో వందలాది మంది బ్రాహ్మణులు పాల్గొనగా ఆ సందర్భంగా వేలాది  గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాడు ఇంద్రద్యుమ్నుడు, నీజానికి ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన ప్రాంతం కాబట్టి ఇది పూర్వం యజ్ఞకుండంగా పిలువబడేదని, తరువాతి కాలంలో ఇది ఆ రాజు పేరుమీద ఇంద్రద్యుమ్నతీర్థంగా పిలువబడుతున్నదని తెలుస్తోంది. ఇక్కడ ఇంద్రద్యుము మహారాజు వేలాదిగోవులను దానం చేయడంతో వాటి పదఘట్టనల కారణంగా అక్కడ గోతులు ఏర్పడ్డాయని, ఆ గోతులలో దానజలం నించి ఉండడం వలన అవి పరమపవిత్రమయిన తీర్థాలుగా మారిపోయాయని, అందుకే
ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాచరించి తమ పితృదేవతలకు తర్పణములు వదిలిన వారికి  సహస్రాశ్వమేధం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చేస్తున్నాయి. ఈ తీరధం సర్వపాపక్షయకరమైన జీవనది  అని కూడా చేప్తారు. ఇక్కడ అత్యంత సుందర రూపుడయిన బాలకృష్ణుని ఆలయం ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుండీచామందిరంలోనే జగన్నాధ, బలభద్ర, సుభద్రాదేవిల మూర్తులు విశ్వకర్మచేత ఆవిష్కరించ బడ్డాయి.

No comments:

Post a Comment