Friday, July 27, 2018

puri jagannath temple history | జగన్నాథ ఉత్సవాలు

జగన్నాథుని యాత్రా విశేషాలు 

puri jagannath temple history | జగన్నాథ ఉత్సవాలు

శయనోత్సవం:

జగన్నాథునికి ఆషాడ శుక్ల ఏకాదశి నాడు శయనోత్సవం చేసారు. చాతుర్మాస్య వ్రతదీక్ష సందర్భంగా ఈ ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది.
డోలోత్సవం:
ఫాల్గుణమాసంలో చతుర్దశి తిధిలో ఈ ఉత్సవానికి ప్రారంభం చేస్తారు. ఈ ఉత్సవంలో జగన్నాథుని ప్రతినిధిగా గోవిందునికి ఉత్సవం చేస్తారు. ఈ డోలోత్సవాన్ని చూసినవారు గోహత్యాది పాతకాల నుండి విముక్తులవుతారు. అది మాత్రమే కాదు ఈ ఉత్సవాన్ని తిలకించిన వారు జ్ఞానవంతులు, పుణ్యాత్ములు అయి సర్వసంపదలు, సుఖసంతోషాలు పొందడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది ముక్తిని పొందుతారు.
నవకళేబర ఉత్సవం:
సాధారణంగా మూలవిరాట్టులు కదపడం, మార్చడం అనేది ఎక్కడా చూడని, వినని విషయం. కాని పూరిక్షేత్రంలో మాత్రం ఈ వింతను చూడవచ్చు. ఇక మూలవిరాట్టుల్ని ఖననం చేయడం అనేది మన ఊహకందని విషయం. అధికాషాఢం వచ్చినప్పుడు పూరీ క్షేత్రంలో  ఈ వింత సంభవమవుతుంది. అధిక ఆషాడం పచ్చినప్పుడు జగన్నాథ, సుభద్ర, బలభద్రుల దారు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ముక్తిమండపం అని పిలువబడే కైవల్య వైకుంఠంలో ఖననం చేసి కొత్త దారువిగ్రహాలు ప్రతిష్టిస్తారు. నవ కళేబర ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆలయ ప్రధాన పూజారులు పూరీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కకట్ పూర్ కు వెళ్లి ప్రాచీ నదిలో స్నానం చేసి అక్కడే ఉన్న మంగళాదేవి ఆలయంలో నిద్రిస్తారు. అలా దేవి ఆలయంలో నిద్రించిన వారికి అమ్మవారు కలలో కనబడి విగ్రహానికి కావలసిన దారువు ఎక్కడ లభిస్తుందో చెప్పందట. చైత్రపార్నమి రోజున పందాలు ప్రత్యేకపూజలు, ప్రార్ధనలు నిర్వహించి తరువాత మూడు బృందాలుగా విడిపోయి విగ్రహాలకు కావలసిన దారుపును వెతుక్కుంటూ విగ్రహాలకు కావలసిన దారుపును అతి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఎటువంటి గాట్లు గాని, తెగుళ్ళు గాని, పక్షి గూళ్ళు గాని ఇతరాత్రా ఎలాంటి అవలక్షణాలు గాని ఉండకూడదు. జగన్నాధుని విగ్రహానికి కావలసిన దారువు మీద శంఖు, చక్ర ముద్రలుండాలి. సుదర్శన చక్రం గుర్తుండాలి. బలరాముడి విగ్రహానికి కావలసిన దుంగపై కమలం గుర్తు ఉండాలి. బలరాముడి విగ్రహానికి కావలసిన దుంగపై గద గుర్తుండాలి. సుభద్రాదేవి  విగ్రహం తయారుచేసే దుంగపై కమలం గుర్తు ఉండాలి. చెట్లకు దగ్గర్లో స్మశానం, చెరువు, శివాలయం, ఉండాలి, చెట్లనీడలో విషసర్పాలు, దగరలో ఓ చింతచెట్టు తప్పనిసరిగా ఉండాలి. చెట్టుకు ఏడు శాఖలుండాలి. బలభద్రుని విగ్రహానికి కావలసిన వృక్షం తెల్లగా ఉండాలి. ఇలా అన్ని లక్షణాలు సరిపోయిన వృక్షాలను గుర్తించిన తరువాత ఆ వృక్షాలకు వివిధ రకాల పూజలు, శాంతులు జరిపి ముందు బంగారు గొడ్డలితో తరువాత వెండి గొడ్డలితో కొద్దిగా ఖండించి తరువాత ఇనుప గొడ్డళ్లతో పూర్తిగా ఖండిస్తారు. అలా ఖండించిన వృక్షభాగాలను అడవినుంచి తరలించడానికి కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. చింతమొద్దులతో చేసిన బల్ల మీద మాత్రమే వాటిని తరలించాల్సి ఉంటుంది.
puri jagannath temple history | జగన్నాథ ఉత్సవాలు
అలా తరలించిన దారువులను ఉత్తరద్వారం గుండా వైకుంఠ మండపానికి చేర్చి విగ్రహాలను తయారుచేస్తారు. ఆషాఢ బహుళ చతుర్దశి అర్ధరాత్రి తరువాత విగ్రహలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆషాఢశుద్ధ నవమి వరకు విగ్రహాలకు రంగులద్దుతారు.
       కలియుగం అంతమయ్యే సమయానికి జగన్నాధుడు పూరీక్షేత్రం విడిచి పెట్టి వెళ్లిపోతాడా...? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా అవునంటున్నారు భాటియా గ్రామప్రజలు.......

No comments:

Post a Comment