Saturday, July 28, 2018

puri jagannath temple history | దర్శనీయస్థలాలు


పూరీక్షేత్రంలో దర్శనీయస్థలాలు 

puri jagannath temple history | దర్శనీయస్థలాలు
కలియుగం అంతమయ్యే సమయానికి జగన్నాధుడు పూరీక్షేత్రం విడిచి పెట్టి వెళ్లిపోతాడా...? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా అవునంటున్నారు భాటియా గ్రామప్రజలు. అలాగే జరుగుతుందని అచ్యుతానందదాస్ అనే సాధువు చెప్పిన జోస్యం వారిని ఆ నమ్మకంలో ఉంచింది. జగన్నాధుడు అనగానే శరీర అవయవాలు సంపూర్ణంగాలేని అసంపూర్ణ మూర్తులు మన కళ్లముందు నిలుస్తారు. కాని ఈ భాటియా గ్రామంలో మాత్రం సంపూర్ణమైన అవయవాలతో రూపుదిద్దుకున్న జగన్నాధ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను చూడవచ్చు.
కొన్ని వందల ఏళ్లుగా ఈ మూర్తులనే పూజిస్తూ స్వామి తమ ఊరికి వచ్చేరోజును తలచుకుంటూ ఉంటారట అక్కడి ప్రజలు.
ఇక పూరిక్షేత్రంలో చూడవలసిన స్థలాల విషయానికి వస్తే, పూరిక్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యమైన స్థలాల గురించి తెలుసుకుందాం

సాక్షి గోపాల్:

పూరీలో తప్పనిసరిగా చూడవలసిన ప్రముఖ కృష్ణ దేవాలయం సాక్షిగోపాల్. దీనినే సత్యబాడీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నయనమనోహరమైన శ్రీకృష్ణుని నిలువెత్తు విగ్రహం ఉంటుంది. పూరీ క్షేత్రానికి 19 కిలోమీటర్ల దూరంలో పూరీ క్షేత్రానికి ఉత్తరంగా భువనేశ్వర్ వెళ్లే దారిలో ఉంది సాక్షిగోపాల్. పూరీ క్షేత్రాన్ని దర్శించుకున్న తరువాత తప్పనిసరిగా సాక్షిగోపాలుడ్ని దర్శించుకోవాలని చెప్తారు. ఎందుకంటే మనం పూరీ క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నదానికి, మన విన్నపాలు విన్నవించుకున్న దానికి ఈ గోపాలుడు సాక్షంగా ఉంటాడని అందుకే సాక్షిగోపాలుడుగా పేరుపొందాడని, అందుకే సాక్షిగోపాలుడ్ని దర్శించుకోకపోతే పూరీ యాత్ర పరిపూర్ణం కాదని చెప్తారు. సాక్షిగోపాల్లో శ్రీకృషుడు కొలువుతీరడానికి, సాక్షిగోపాలుడుగా పిలువబడడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో నిరు పేద యువకుడు ఉండేవాడు. అతడు ఆ గ్రామపెద్ద కూతురుని ప్రేమిస్తాడు. ఆమెనే వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ గ్రామపెద్ద కూతురు కూడా యువకుడ్ని ఇష్టపడుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఈ ఆర్ధిక అంతరాల కారణంగా ధనికుడు తన కుమార్తెను వివాహమాడే అర్హతలేదని గేలిచేసాడు. కానీ సమయంలోనే నిరు పేద యువకుడు, గ్రామ పెద్దలతో సహితంగా ఆ గ్రామవాసులందరూ వారణాసి యాత్రకు బయలుదేరి వెళతారు. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత గ్రామ పెద్ద జబ్బు పడడం జరిగింది. ఇతని  పరిస్థితిని గమనించిన యువకుడు అతడికి అన్ని విధాల సహాయపడి అతడిని మామూలు మనిషిని చేసాడు. ఆ సందర్బంలో అతని మంచితనాన్ని గమనించిన గ్రామ పెద్ద తన కూతురినిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే మళ్లీ గ్రామానికి వచ్చేసరికి మాత్రం తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడడు. పైగా తను ఆ వివాహానికి సమ్మతించినట్టుగా ఆధారమేంటని అడుగుతాడు. దాంతో హతాశుడయిన యువకుడు శ్రీకృష్ణుని ప్రార్ధిస్తాడు. అతని ప్రార్థనలకు సంతసించిన నల్లనయ్య నేను నీ సమస్యను పరిష్కరిస్తాను. నీతో పాటు నేను కూడా వచ్చి గ్రామ పెద్ద నీకిచ్చిన మాటకు నేను సాక్ష్యం చెప్తాను. అయితే నువ్వు ముందు నడుస్తూ ఉంటే నేను వెనుక నడుస్తాను. కాని గమ్యానికి చేరుకునేంతవరకు నీవు ఎట్టి పరిస్థితిలోను వెనక్కు తిరిగి చూడకూడదు. ఈ షరతుకు ఒప్పుకుంటే నేను నీతో వస్తానన్నాడు. ఆ షరతుకు ఒప్పుకున్న యువకుడు ముందు నడుస్తుంటే వెనుక గోపాలుడు నడుస్తున్నాడు. అలా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ సాగిపోతున్నారు యువకుడు,గోపాలుడు.  శ్రీకృష్ణుడు నడిచి వస్తున్న అడుగుల చప్పుడును గమనిస్తూ నడుస్తున్నాడు యువకుడు. కొంతసేపటికి అడుగుల శబ్దం వినబడలేదు. దాంతో యువకునికి సందేహం కలిగింది. వెనుక గోపాలుడు వస్తున్నాడా..? లేదా..? వస్తే అడుగుల శబ్దం వినబడదేం..? ఒకవేళ కృష్ణుడు రావడం లేదా? వస్తానని చెప్పి తనను మోసం చేస్తున్నాడా? అందుకే తనను వెనక్కు తిరిగి చూడవద్దన్నాడా? ఇలా సందేహాలతో సతమతమవుతూ వెనక్కు తిరిగి చూశాడు. అంతే అంతవరకు అతడి వెనులే నడిచి వస్తున్న కృష్ణయ్య ఉన్నచోటే స్థాణువుగా మారిపోయాడు. అప్పటికి గాని తన తప్పు తెలిసిరాలేదా యువకునికి. అయ్యయ్యో ఎంతపని జరిగిపోయింది. గోపాలుడు చెప్పనే చెప్పాడు. వెనక్కు తిరిగి చూడవద్దు. కానీ తను ఆ మాటను పెడచెవిన పెట్టారు. గోపాలునికి కోపం తెప్పించాడు. దాని ఫలితమే ఇలా జరిగింది అనుకుంటూ ఎంతో చింతించాడు. ఇక తనకు సహాయం చేసేవారెవరు అనుకుంటూ వేదనలో పడిపోయాడు. యువకుని బాధను చూసిన కృష్ణయ్య, అంతలోనే  అక్కడకు చేరిన గ్రామస్తులముందు, గ్రామ పెద్ద యువకునికిచ్చిన మాటకు సాక్ష్యం చెప్పాడు. అప్పటినుంచి స్వామి ఆ ప్రాంతీయులచేత సాక్షిగోపాలుడుగా పూజలందుకుంటు న్నాడు. భక్తుని ఉద్దరించడానికి వచ్చి శిలారూపంగా మారి సాక్ష్యం చెప్పి సాక్షిగోపాలుడు గా వెలిసిన ఆ మాధవునికి తొలిపూజారిగా పూజలు చేసే అర్హత భక్తుడైన ఆ యువకునికే దక్కింది. సాక్షి గోపాలునికి సంబంధించి మరో కథనాన్ని కూడా చేప్తారు.................

No comments:

Post a Comment