11, జులై 2018, బుధవారం

జై జగన్నాథ - 9 | puri temple history


ఇంద్రద్యుమ్నుడు జగన్నాధుని విగ్రహాలు తయారుచేయించడం 

puri temple history
అయితే జగన్నాధుడు  ఇమ్ద్రద్యుమ్నుని స్వప్నంలో సాక్షాత్కరించి చింతించవలసిన పనిలేదని, ప్రాయోపవేశం చేయవలసిన అవసరం అంతకంటే లేదని, త్వరలో నీచేత ఒక దైవకార్యం చేయవలసి ఉందని... కాబట్టి ఆ ప్రయత్నం విరమించుకొనమని, కొంతకాలానికి సముద్రంలో ఒక మహావృక్షం కొట్టుకువస్తుందని, దానితో నాలుగు మూర్తులను తయారు చేయించమని, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్ర సమేతుడైన జగన్నాథ విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠ చేయించమని చెప్పాడు. శ్రీమహావిష్ణువు చేసిన సూచనతో సంతసించిన అవంతీపురాధీశుడు ఇంద్రద్యుమ్నుడు కార్యోన్ముఖుడయ్యాడు.
కొంతకాలం అక్కడు ఉండి అశ్వమేధాది క్రతువులను చేసాడు. ఎన్నో పుణ్యకార్యాలను, సత్కర్మలను చేస్తూ స్వామి చెప్పిన సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎక్కడినుండో సముద్రంలో ఒక మహావృక్షం తేలుతూ వస్తోందని వేగులు తెచ్చిన సమాచారం విని ఆనందసాగరంలో పడిపోయాడు. హుటాహుటిన సాగరతీరానికి చేరుకున్నాడు. సముద్రంలో కొట్టుకువచ్చిన కొయ్యదుంగలను చేసి ఇంద్రద్యుమ్నుడు విగ్రహాలను తయారు చేయించే ఆలోచనలో పడ్డాడు. అయితే స్వామి ఆనతిచ్చిన విధంగా విగ్రహాలను తయారుచేయగల సమర్థుడెవరా అన్న ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి విశ్వకర్మతో సహా మారువేషంలో అక్కడకు వచ్చాడు.
"ఓ రాజా ఈ కొయ్యదుంగలను వీక్షిస్తూ ఉండిపోయావు. విషయమేంటని ప్రశ్నించాడు మారువేషంలో ఉన్న శ్రీమన్నారాయణుడు.
"మహానుభావా... నీవెవరివో తెలియదు. కాని నీవు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ దారువుతో జగన్నాథ, సుభద్రాదేవి, బలభద్రుడు, సుదర్శన చక్ర మూర్తులను తయారు చేయించాలి. కాని దానికి సమర్థుడయిన శిల్పి ఎవరా..? ఎక్కడ దొరుకుతాడా అని యోచిస్తున్నాను' అని సమాధానం చెప్పాడు ఇంద్రద్యుమ్నుడు.
ఇంద్రద్యుమ్నుని ఆలోచన తెలుసుకొనిఓస్ ఇంతేనా దానికింత ఆలోచనెందుకు? నాతో ఉన్న ఈ మహానుభావుడు అపూర్వమైన శిల్పి. సమర్థుడు. నీవు కోరుకున్న రీతిలో విగ్రహాలను తయారుచేయగలవాడు. ఇతడికి నీ పని అప్పగించి ప్రశాంతంగా ఉండుఅని చెప్పి విశ్వకర్మను అప్పగించాడు.
puri temple history
Add caption
తన కార్యం ఇలా సులభతరమయినందుకు ఆనందించిన ఇంద్రద్యుమ్నుడు ఆ శిల్పితో విగ్రహాలు తయారుచేయించి వాటిని పురుషోత్తమక్షేత్రంలో ప్రతిష్టింప పూనుకున్నాడు ఈ ప్రయత్నంలో భాగంగానే అవంతీపురాధీశుడు మూనవదేహంతో బ్రహ్మలోకానికి వెళ్లి తన ప్రయత్నాన్ని గురించి బ్రహ్మదేవునికి తెలియచేసాడు. బ్రహ్మదేవుడు కూడా లోగడ లక్ష్మీదేవి చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకొని
, తాను ముందుండి కార్యాన్ని నడిపిస్తానని చెప్పి
నారదాది మునులతో, ఇంద్రాది సమస్త దేవతలతో భూలోకానికి తరలి వచ్చాడు. ఒక శుభ ముహూరాన్ని నిర్ణయించి స్వయంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించాడు. ఈ కార్యక్రమంలో ఎగడుగునా ఏ కార్యక్రమం ఏవిధంగా చేయవలెనో, ఎప్పుడు చేయవలెనో మొదలైన విషయములన్నీ ఎప్పటికప్పుడు అశరీరవాణిగా ఆ స్వామియే వినిపించి ఇమ్ద్రద్యుమ్నాదులకు మార్గదర్శనం చేసాడు..................




వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి