4, జులై 2018, బుధవారం

The History Of Bheemili Narasimha Temple

భీమిలి నరసింహ క్షేత్ర విశేషాలు 

భీమిలి నరసింహక్షేత్ర విశేషాలు
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణుడు దశావతారములు ఎత్తాడు. అందులో నాలుగవది నరసింహావతారం. సగం  మనిషి, సగం సింహం శరీరంతో వెలసిన అవతారం ఈ నరసింహావతారం. ఆంధ్రప్రదేశ్ లో  ఉన్న 32 నారసింహ మూల క్షేత్రాలలో ఒకటి విశాఖపట్నం సమీపాన ఉన్న భీమునిపట్నం  లోని నరసింహ క్షేత్రం. ఇది స్వయంభూ నారసింహ క్షేత్రం. మిగిలిన నారసింహ క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ స్వామి నాలుగు చేతులలో శంఖు,చక్ర,గదా,పద్మాలతో శాంతస్వరూపుడుగా నారాయణ స్వరూపంగా దర్శనమిస్తాడు.
టు విశాలమైన సాగర తీరం.. ఇటు పచ్చటి తివాచీ పరిచారా అన్నట్టున్న కొండలు.. మధ్యలో అందాల విశాఖనగరం. ఆ విశాఖనగరానికి సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే మరో సుందర సముద్ర తీరప్రాంతం  భీమిలి గా పిలిచుకునే భీమునిపట్నం.  ఇటు పౌరాణికంగాను, అటు చారిత్రాత్మకంగాను కూడా భీముని పట్నానికి కి పెద్ద స్థానమే ఉంది.
భీమునిపట్నం లో స్వామివారు వెలసిన కొండను సౌమ్యగిరిగా పిలుస్తారు. వివరాలు ఈ వీడియోలో ............

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి