Monday, July 23, 2018

వాట్సప్ | వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో | templeinfo.ml


వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో.....

watsapp latest updates
ఒకపూట తిండి లేకపోయినా ఫరవాలేదు. కాని ఒక్క గంట వాట్సప్ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా కొంపలంటుకోవూ.... ఎన్ని ఊసులు మిస్సవుతాం! ఎన్ని గ్రూపులు మిస్సవుతాం! ఆవకాయ పెట్టడం దగ్గర్నుంచి అఫీషియల్ వర్క్ వరకు అన్నీ వాట్సప్ మీద నడుస్తున్నాయి. బామ్మ గారి దగ్గర్నుంచి బాసుగారి వరకు చేతిలో స్మార్ట్ ఫోను, అందులో వాట్సప్ ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్తితి ఇది. అయితే ఆ కొంపలంటుకునే క్షణం వచ్చేసింది.
ఎందుకంటే వాట్సాప్.. లో ప్రచారమవుతున్న కొన్ని తప్పుడు వార్తల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్తితులు ఎక్కువవుతున్నాయి. తెలిసో తెలియకో మనం ప్రచారం చేస్తున్న ఈ తప్పుడు వార్తల కారణంగా రెండు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేవలం ఈ వార్తల కారణంగానే హత్యకు గురయినట్టు నిర్దారారణ అయింది. ముఖ్యంగా పిల్లల కిడ్నాపర్లు వస్తున్నట్టు వచ్చిన వార్తల కారణంగా ఎవరు కొంచెం అనుమానంగా కనిపించినా వాళ్ళను కొట్టి చంపేస్తున్న ఘటనలు ఊపందుకున్నాయి. దాంతో ప్రభుత్వం ఈ విషయం మీద గట్టి చర్యలే తీసుకోబోతోంది. వాట్సాప్ లో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నియంత్రించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపధ్యంలో వాట్సాప్ సంస్థ కొన్ని మార్పులు చేసిందట. ఇప్పుడు మనం ఒక మెసేజ్ ని మన బందు,మిత్ర,సపరివార సమేతానికి ఒకేసారి పంపించుకొని హమ్మయ్య ఓ పనైపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇకమీదట అలా కుదరదు. ఒకేసారి ఐదుగురికి మాత్రమే సమాచారాన్ని షేర్ చేసే విధంగా వాట్సప్ సాఫ్ట్ వేర్ ను మారుస్తోందట. వాట్సాప్ షేర్ ఐకాన్ ను కూడా తొలగిస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. తప్పుడు వదంతులు నియంత్రణలో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుందట.


No comments:

Post a Comment