Wednesday, August 1, 2018

Puri jagannatha temple history


Puri jagannatha temple history

రోహిణీకుండం:

పంచతీర్దాలులో మరొకటి రోహిణకుండం. జగన్నాధమందిరంలోనే విమలాదేవి మందిరం ఎదురుగా ఉంది రోహిణీకుండం. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని నివాసస్థలంగా చెప్తారు.
ఇక్కడ ఉన్న మహావటవృక్షాన్నే అక్షయవటవృక్షంగా,  దేవతావృక్షంగా పూజిస్తారు. ప్రళయకాలంలో మార్కండేయ మహర్షి జలాలలో మునిగి దిక్కుతోచక తిరుగుతున్నప్పుడు ఈ వటవృక్షం మీదినుంచే స్వామి మహర్షికి దర్శనమిచ్చి, క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని కలిగించాడని పురాణ ఉవాచ. ఈ ప్రదేశంలోనే విధివశాత్తు ఏదో జంతువుగా భ్రమసి వేటగాడు శ్రీకృష్ణుని బాణంతో కొట్టాడని, ఆ శరాఘాతానికి స్వామి నిర్యాణం చెందాడని కూడా ఒక కథనం. ఈ రౌహిణీకుండంలో జలం యొక్క మహత్మ్యాన్ని తెలియకుండా పానం చేసినా దాని సత్పలితాన్ని పొందవచ్చని పురాణ ఉవాచ. ఒక సందర్భంలో ఒక దురాత్ముడు మిక్కిలి దాహంతో ఉండి ఈ రౌహిణీకుండంలో జలాన్ని పానం చేసాడట. వెంటనే అతడి పాపాలన్నీ ప్రక్షాళనమయి ఉత్తమగతులను పొందాడని ఒక విప్రుడు ఇంద్రద్యుమ్నునికి తెలియచేసినట్టు స్కందపురాణాంతర్గత కథనం. రోహిణీకుండంలో స్నానమాచరించిన వారికి గతజన్మల పాతకాలన్నీ ప్రక్షాళనమయిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ కుండం వెనుక భూసందకాక అన్న పేరుతో ఒక వాయసం మూర్తిని చూడవచ్చు. పురాణకాలంలో ఒక కాకి ఇక్కడకు వచ్చి ఈ కుండంలో మునగడంతో తన పాపాలన్నీ ప్రక్షాళననుయి అద్బుతమైన దేహంతో ఈ సాన్నిధ్యం పొందింది. దానికి గుర్తుగా ఈ మూర్తి భాసిల్లుతోంది.

మార్కండేయ కుండం:

ఇక పంచతీర్థాలలో మూడవది  మార్కండేయకుండం. శ్రీమహావిష్ణువు మార్కండేయుని అనుగ్రహించిన తరువాత ఈ కుండంలోనే ఆ మహర్షి స్వామి సూచనతో తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది చిరంజీవిత్వాన్ని పొందాడు. మార్కండేయుని పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కుండంలో స్నానమాచరించి స్వామిని దర్శించినవారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందని సాక్షాత్తు లక్ష్మీదేవే స్వయంగా యమధర్మరాజుతో చెప్పింది.

నాల్గవది శ్వేతగంగ:

జగన్నాదమందిరానికి పశ్చిమంగా ఉన్న ఈ తీర్థం శ్రీమన్నారాయణుని గోరునుంచి ఆవిష్కరించబడిందని చెప్తారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న మందిరాలలో శ్వేతమాధవుడు, శ్రీమన్నారాయణుని మత్స్యావతార మూర్తులను చూడవచ్చు.
 మహెూదధి:
మహెూదధిగా పిలువబడే ఇక్కడి సాగరం సర్వ తీర్దమయం. ఇక్కడ ఒక ఒడ్డును స్వర్గద్వారమని పిలుస్తారు. ఈ స్వర్గద్వారంలో స్నానమాచరించిన వారి పాపాలు ప్రక్షాళనమయి స్వర్గలోకవాసం పొందుతారని నమ్మకం. ప్రళయంలో మార్కండేయునికి స్వామి దర్శనమిచ్చిన కల్పవటవృక్షం ఈ సాగరపర్యంతం ఉందని, శంఖాకారంగల ఈ క్షేత్రం ఉదరభాగాన్ని ఈ సముద్రజలాలు తాకుతున్నవి కాబట్టి అలా తాకిన సముద్రప్రాంతం మహాపుణ్యతీర్థంగా విరాజిల్లుతుందని సాక్షాత్తు లక్ష్మిదేవే స్వయంగా మార్కండేయునితో చెప్పిందన్నది పురాణకథనం. ఈ సముద్రంలోనే జగన్నాద, సుభద్ర, బలభద్రుల దారుమూర్తులకు కావలసిన మహావృక్షం కొట్టుకువచ్చింది. అందుకే ఈ సముద్రజలాలలో స్నానం అత్యంత పాపహరణంగా భావిస్తారు. మహెూదధిగా పిలువబడే ఈ సముద్రతీరంలో స్నానం అత్యంత పుణ్యప్రదం. ఇక్కడ స్నానమాచరించిపితృదేవతలకు తర్పణములు వదిలినట్టయితే, అలా చేసిన వారితో పాటు వారి వంశంవారందరికీ పాపప్రక్షాళన జరుగుతుంది. ఇక్కడ చేసిన ఏ చిన్న పుణ్యమయినా కోటిరెట్లు ఫలితమిస్తుంది. ఈ జలములలో స్నానమాచరించిన వారికి యమబాధలుండవు. సాక్షాత్తు దేవతలే ఈ మహెూదధిలో స్నానమాచరించడానికి ఉవ్విళ్లూరుతారట. ఈ సాగరంలో స్నానం చేసిన వారికి సర్వతీర్ధాలలో స్నానమాచరించిన ఫలితం. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని స్కాందపురాణాంతర్గత కథనాలు చెప్తున్నాయి.

No comments:

Post a Comment