Saturday, August 4, 2018

Puri jagannatha temple history | పూరీలో దర్శనీయ స్థలాలు

Puri jagannatha temple history | పూరీలో దర్శనీయ స్థలాలు

పూరీలో దర్శనీయ స్థలాలు

విమలాదేవి మందిరం:

ఇది ప్రధాన ఆలయంలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న శక్తి విమలాదేవి. ఇది అమ్మవారి 58 శక్తిపీఠాలలో 17వదిగా చెప్తారు.

గణేశ ఆలయం:

దీనినే కంచి గణేశ ఆలయంగా కూడా వ్యవహరిస్తారు. ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమదేవ మహారాజు కంచి యువరాణి పద్మావతీదేవిని వివాహమాడినపుడు కంచి రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహూకరించాడని కథనం.

మార్కండేశ్వరుని ఆలయం:

పంచపాండవాలయాలలో ఒకటి ఈ మార్కండేశ్వర ఆలయం. ప్రళయ కాలంలో శ్రీమహావిష్ణువు మార్కండేయుని రక్షించి అతడికి తన లీలా విశేషాలను తెలియచేసిన ప్రదేశంగా కూడా చెప్తారు. మార్కండేయటేంక్ కు అత్యంత సమీపంలో ఉంటుంది మార్కండేశ్వర ఆలయం. రుషిపంచమి, శివరాత్రి, రాఖీపూర్ణిమ మొదలైన పర్వదినాలలో ఇక్కడ పెద్దఎత్తున ఉత్సవాలు జరుపుతారు. ఈ ఆలయానికి అతి సమీపంలోనే రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన విష్ణుస్వామి మఠం కూడా  చూడవచ్చు.

శ్యామ్ కాళీ టెంపుల్:

పూరీ రాజకుటుంబీకులకు వందలాది సంవత్సరాలుగా కులదేవతగా భాసిల్లుతోంది శ్యామ్ కాళీ అమ్మవారు. ఈనాటికీ కూడా పట్టాభిషిక్తుడై రాజుగా ప్రకటించబడగానే వెంటనే మొట్టమొదట తమ కులదైవమైన క్యామ్కాళీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వం ఈ ఆలయం గజపతి మహారాజుల స్వయం పర్యవేక్షణలో ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆలయానికి సంబంధించి అన్ని విషయాలు ఆలయ ప్రధానపూజారి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కాళీపూజ, డీపావళి, దుర్గాపూజ, దసరా ఉత్సవాలు, జగద్ధాత్రిపూజ మొదలైన ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలలో లెక్కలేనంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

సిద్దమహావీర్ టెంపుల్

గుండీచా ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉంటుంది సిద్ధమహావీర్ ఆలయం. ఈ ఆలయం శిల్పకళారీత్యా అంతగా చెప్పుకోదగినది కాకపోయినా మతపరంగా మాత్రం అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయం. పూరీ పట్టణంలో ఉన్న ఎనిమిది మంది మహావీరులలో ఈ సిద్ధమహావీర్ ఒకరిగా పరిగణిస్తారు. ప్రసిద్ద రామభక్తుడు, రామచరితమానస్ గ్రంధకర్త అయిన తులసీదాసు పూరీ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఈ ఆలయంలోనే ఎక్కువగా గడిపాడని చెప్తారు. ఒక చేత్తో గద, మరో చేత్తో పర్వతాన్ని పట్టుకున్న ఆరడుగుల భారీ హనుమంతుడు దర్శనమిస్తాడీ ఆలయంలో.
లోకనాథ్ టెంపుల్:
పూరీలో చూడవలసిన ప్రదేశాలలో అతి ముఖ్యమైనది లోక్ నాథ్ ఆలయం. దీనిని పంచపాండవ ఆలయంగా కూడా చెప్తారు. పూరీ జగన్నాథ ఆలయానికి పశ్చిమంగా సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివభక్తులకు అత్యంత ముఖ్యమైన తీర్థస్థలం ఈ లోక్ నాథ్ ఆలయం. ఈ ఆలయం క్రీ.శ. పది, పదకొండు శతాబ్దాల కాలంలో వెలుగులోకి వచ్చినట్లుగా చరిత్ర చెప్తోంది. ఇది సాక్షాత్తు శ్రీరామునిచే ప్రతిష్టించబడినదిగా చెప్తారు. త్రేతాయుగం నాటి ఆలయమిది. త్రేతాయుగంలో సీతాపహరణం జరిగిన తరువాత సీతమ్మవారిని వెతుకుతూ
లంకకు బయలుదేరిన శ్రీరాముడు సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే తన అన్వేషణ సఫలీకృతం కావాలని పరమేశ్వరుని ప్రార్థించి ప్రసన్నుడిని చేసుకున్నాడు. సీతాన్వేషణలో పయనం మొదలు పెట్టిన శ్రీరామచంద్రుడు శబరపల్లిగా పిలువబడే ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ శబరులనే గిరిజనులు రామచంద్రమూర్తికి ఒక లౌకాను అంటే గుమ్మడికాయను కానుకగా ఇచ్చారు. ఇది చూడడానికి శివలింగం మాదిరిగా ఉండడంతో శివలింగంగా దానినక్కడే ప్రతిష్టించాడు శ్రీరామచంద్రప్రభువు. అప్పటి నుంచి ఆ పరమేశ్వరుడు లౌకానాధుడుగా పిలువబడుతూ కాలక్రమంలో లోకనాధునిగా మార్పుచెందాడు. ఇక్కడ విశేషమేమిటంటే గర్భగుడిలో కొన్ని  అడుగుల ఎత్తున పూజాద్రవ్వాలయిన పత్రాలు, పుష్పాలు నిండి ఉంటాయి. నిరంతరం నీటిలోను, పత్రాలు. పూజాద్రవాలలోను మునిగి ఉంటుంది. సంవత్సరంలో శివరాత్రి ఒక రోజు మాత్రమే శివలింగాన్ని  పూర్తిగా దర్శించుకోగలుగుతాం. అక్కడ ప్రతిరోజు ఆకులు. స్వామికి సమర్పించే పుష్పాలు, పత్రాలు ఎప్పటికప్పుడుశుభ్రం చేయడం జరగదు.  అలాగే ఉంచేస్తారు. ఒక శివరాత్రికి మాత్రమే ఇవన్నీ తీసి ముఖం చేయడం జరుగుతుంది. శివరాత్రికి మూడురోజులు ముందు వచ్చే ఏకాదశికి ఇదంతా శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే వేలాదిమంది శివభక్తులు స్వామి సంపూర్ణస్వరూపాన్ని చూడగలుగుతారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం శరంతి సోమోబార్ మేలా. ఈ స్వామి దర్శనం అన్ని ఇక్కట్లను దూరం చేస్తుందని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఎటువంటి మొండిరోగాన్నైనాయం చేస్తుందని నమ్మకం. సంవత్సరమంతా భక్తులు మర్పించే బిల్వపత్రాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు మొదలైన పూజాద్రవ్యాలు, స్వామికి అభిషేకించిన పదార్థాలన్నీ అక్కడే ఉండి ఒక రకమైన ప్రత్యేకవాసనతో వైద్యపరమైన ప్రయోజనాలతో కూడి ఉంటుందని అందుకే ఈ నీరు తీర్ధంగా స్వీకరించిన భక్తులకు రోగాలు నయమవుతాయని నమ్మకం.

No comments:

Post a Comment