Wednesday, August 1, 2018

అక్కడ చనిపోయినవారిని బతికించేస్తున్నారట | templeinfo


అక్కడ చనిపోయినవారిని బతికించేస్తున్నారట

organic burial pods - capsula mundi burial
చనిపోయిన వారికి చేసే రకరకాల అంత్యక్రియల గురించి చాలానే విన్నాం. కొన్ని ప్రాంతాల్లో చేసే అంత్యక్రియలు తమాషాగా అనిపిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో జరిపే అంత్యక్రియలు వినడానికే భీభత్సంగా, భయంకరంగా ఉంటాయి. ఇక మన ఆప్తులు చనిపోయినప్పుడు వాళ్ళ గుర్తుగా ఓ సమాధి కడుతుంటారు. లేదా వాళ్ళ జ్ఞాపకంగా ఏదైనా చేయ్యాలనుకుంటాం.
అయితే వీటన్నిటికీ చాలా డబ్బు ఖర్చవుతుంది. అయితే ఇప్పుడలాంటి అంత్యక్రియలన్నిటికీ భిన్నంగా, తక్కువ ఖర్చుతోనే చనిపోయినవారి జ్ఞాపకం ఉండిపోయేలా  ఓ కొత్త తరహా అంత్యక్రియలను ఆవిష్కరించారు ఇటలీకి చెందిన అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్.
మనమ అభిమానించే మనుషుల్ని మళ్ళీ చిరకాలం ప్రాణం పోసుకునేలా చెయ్యండి. చెట్లుగా మార్చి ఆ చెట్ల రూపంలో అన్న కాప్షన్ తో ఈ కాన్సెప్ట్ ను ప్రపంచం ముందుకు  తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ తో శవాన్ని పాతిపెట్టడానికి స్థలం కూడా ఎక్కువగా అవసరం లేదట. అతి తక్కువ స్థలంలోనే భౌతిక కాయాలను పూడ్చిపెట్టేందుకు అనువైన శవపేటికలను ఇటలీకి చెందిన డిజైనర్లు అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్ రూపొందిస్తున్నారు. సేంద్రియ పదార్థాలతో కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ శవ పేటికను తయారు చేశారు. ఈ పేటికలో వ్యక్తి మృతదేహాన్ని లేదా శవాన్ని దహనం చేస్తే వారి అస్థికలను ఆ పేటికలో పెట్టి, వాటిలో తమకిష్టమైన మొక్క విత్తనం లేదంటే ఓ మొక్కను నాటి భూమిలో పాతిపెడితే కొంత కాలానికి ఆ పేటిక నుంచి భూమిపైకి విత్తు మొలకెత్తుతుంది. అది కాస్తా మొక్కై పెరుగుతుంది.
        దీన్ని క్యాప్సూలా ముండి అన్న పేరుతొ పిలుస్తున్నారు. వాటి ఆ చెట్టు  వేర్లు ఈ క్యాప్సుల్‌ పేటికలోకి చేరి మానవ శరీరంలో పోషకాలను గ్రహిస్తూ ఎదుగుతుందట. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు శ్మశానాలను పచ్చటి వనాలుగా మార్చడమే ఈ పేటికల లక్ష్యమని అంటున్నారు డిజైనర్లు. 2015లో రూపొందించిన ఈ విధానం  ఇప్పుడు క్రమంగా అక్కడ ఊపందుకుంటోందట. ప్రస్తుతం దీన్ని రూపొందించిన ఇటలీలోనే కాదు అమెరికా, బ్రిటన్ దేశాల్లో కూడా ఈ చెట్టు శవపేటికలకు బ్రహ్మాండమైన డిమాండు ఉందట. ఈ పధ్ధతి వలన స్మశానాలన్నీ పచ్చపచ్చగా మెరిసిపోతున్నాయని సంబరపడిపోతున్నారట అక్కడి జనాలు.

No comments:

Post a Comment