Saturday, August 4, 2018

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు


రావిచెట్టు 

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు
చెట్టు - పుట్ట, కొండ - కోన, రాయి - రప్ప... ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని భగవదంశగా చూడడం, దైవత్వాన్ని ఆపాదించి ఆరాధించడం, పూజలు చేయడం
మన సంస్కృతిలో ఒక భాగం. సృష్టిలో ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకతను, విశిష్టతను ఆపాదించి చెప్నున్నాయి మన పురాణాలు. ఈ ఒరవడిలోనే వృక్షాలను దేవతాంశలుగా, దైవ స్వరూపాలుగా వర్ణించాయి పురాణాలు. అలాంటి దేవతావృక్షాల గురించి తెలుసుకుందాం.

అశ్వత్థ వృక్షం:

దేవతావృక్షాలు అనగానే మొట్టమొదట మన కళ్ల ముందు సాక్షాత్కరించేది అశ్వత వృక్షం అంటే రావి చెట్టు. ఇది హిందువులకే కాదు, బౌద్ధులకు కూడా అత్యంత పవిత్రమైనది. బుద్దుని సాధనలో అతడికి నీడనిచ్చింది ఈ రావిచెట్టే. అతనికి జ్ఞానోదయమైంది కూడ ఈ చెట్టు క్రిందనేనట. హిందూ సంప్రదాయంలో ఈ వృక్షానికి అత్యున్నత స్తానముంది. హిందూ గ్రంధాల ప్రకారం ఈ వృక్షం నుండే సరస్వతీ నది ఆరంభమైందని చెప్పారు.

సర్వదేవతల నిలయం రావిచెట్టు:

రావి చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజిస్తారు.అశ్వత్థస్సర్వ వృక్షాణాం, దేవర్షీణాం చ నారదః |గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని" అంటే ఋషులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిలుడు, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేనే అన్నాడు భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు. అగ్రంలో పరమేశ్వరుడు ఉంటాడని పురాణ వచనం. రావి చెట్టు మీద ముప్పై మూడు కోట్ల మంది దేవతలు, శనిదేవుడు, పితృదేవతలు నివాసముంటారని చెప్తున్నాయి పురాణాలు. ఈ చెట్టు కొమ్మ లలో ఇంద్రాది దేవతలు, వ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు, తూర్పు కొమ్మ
ల్లో పుణ్యనదులు ఉంటాయట. మూలంలో 'ఆ కారం, మానులో '' కారం, పళ్లలో ''కారం అంతా కలిపి ప్రణవ స్వరూపంగా చెప్తారు. హిందూ సంప్రదాయంలో ఈ పకానికి అత్యు తమ స్థానముంది. హిందూగ్రంథాల ప్రకారం ఈ పక్షం నుండే సరస్వతీ నది ఆరంభమైందని చెప్తారు. స్వరూపంగా చెప్తారు, అందుకనే ఈ చెటుని కల్పవృక్షగా వ్యవహరిస్తారు.

ప్రదక్షిణ ప్రధానం:

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు
రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సర్వదేవతలను ఆరాధించినట్టే.మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణీ, అగ్రత శివరూపాయ అశ్వత్థ వృక్ష రాజాయ తే నమో నమఃఅని ప్రార్థిస్తూ రావి చెట్టకు ప్రదక్షిణలు ముఖ్యంగా సోమవదమావాస్య' అంటే అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన రోజున అశ్వత వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ ఫలితాన్ని అందిస్తాయి. శని బాధలను అనుభవిస్తున్న వారు గాని, పితృదేవతల శాపకారణంగా బాధపడుతున్న వారు గాని, అన్నిటా అశాంతి, అపజయం, ఎదుర్కొంతున్నవారు గాని రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ బాధల జీవికి నుండి బయట పడవచ్చట. ఈ చెట్టుకు పాలు కలిపిన నీటిని పోసి ప్రార్ధించి, విష్ణు స్వరూపంగా భావించి నూటఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సత్పలితాలు
అందుకోవచ్చు. ఇంత మహిమాన్వితమైనది కావడం వల్లనే రావిచెట్టును నరకడం బ్రహ్మహత్యా దోషంతో సమానమని చెప్తారు. 

 అగ్ని సంబంధిత కథనం:

ఒకప్పుడు అగ్నిదేవుడు దేవలోకం నుంచి వెళ్ల గొట్టబడ్డాడట. అప్పుడు అగ్నిదేవుడు అశ్వరూపాన్ని ధరించి అదృశ్యంగా ఈ వృక్షాన్ని ఆశ్రయించాడట. అప్పటినుండి ఈ వృక్షం అశ్వత్థ వృక్షంగా పిలువబడుతూ అతి పవిత్రమైన చెట్టుగా స్థానం సంపాదించుకుంది. బ్రహ్మవైవర్త పురాణం, తైత్తిరీయ సంహిత, ధర్మశాస్త్రాలు కూడ ఈ వృక్ష మాహాత్మ్యం గురించి తెలియజేసాయి. శనివారంనాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగిపోతుందట.

గ్రహ దోషాలను మాయం చేసే మహత్తర వృక్షం:

కోణస్థః పింగళ బభ్రుః, కృష్ణోరౌద్రాంతకో యమః
శౌరిశ్చనైశ్వరో మందః పిప్పలో దేవసంస్తుతః
అనే మంత్రం చదివి ఈ చెట్టును పూజిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. ఈ చెట్టుక్రింద కూర్చుని గాయత్రి జపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితమిస్తుందంటున్నాయి శాస్త్రాలు. ఈ చెట్టును నాటితే నలభైరెండుతరాల వారికి స్వర్గవాసం లభిస్తుందని బ్రహ్మాండపురాణం చెప్తోంది.
ఆరోగ్యాన్నిచ్చే అశ్వత్థ వృక్షం:
ఆధ్యా త్మికంగానే కాదు లౌకికంగా చూసినా కూడ ఇది అత్యంత ఉపయోగకరమైన వృక్షమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రావిచెట్టు మీది నుంచి వచ్చే గాలి కూడ ఎంతో ఆరోగ్యకరం అంటారు. శాస్త్ర జ్ఞులు చెప్తున్న దాని ప్రకారం ఒక్క రావిచెట్టు మాత్రమే  రోజంతా ఆక్సిజన్ విడుదల చేస్తుందట. దీని బెరడు కఫా నాశనంగా పని చేస్తుంది. దీని బెరడును జ్ఞాపకశక్తి పెంచే మందుగా కూడ ఉపయోగిస్తారు. ఇంకా అనేక వ్యాధులకు మందుగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు.
ఇలా ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా కూడ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకడం మాత్రం నిషిద్ధమే. ఆది, సోమ, శుక్రవారాల్లోను, సంక్రమణ సమయాల్లోను, రాత్రి భోజనం చేసిన తరువాత ఈ వృక్షాన్ని తాకి, పూజించడం నిషిద్దం. ముఖ్యంగా శనివారం నాడు మాత్రమే రావిచెట్టు పూజనీయమై మిగిలిన రోజుల్లో రావి చెట్టును తాకడం నిషిద్దమని, దానికి కారణం జ్యేష్ఠాదేవితో ముడిపడి ఉందని కార్తిక పురాణం చెప్తోంది.

కార్తిక పురాణ కథ:

Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు
పూర్వం క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అనేకమైన జీవులు, దేవతలు, వస్తువులు ఎన్నో ఆవిర్భవించాయట. అలా క్షీరసాగరం నుండి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మిని స్వీకరించమని దేవతలు శ్రీ మహావిష్ణువును కోరారట. అదే విధంగా శ్రీమహావిష్ణువును వివాహం చేసుకోమని దేవిని కోరారట. అయితే విష్ణువును వివాహం చేసుకోవడానికి తనకు అభ్యంతరంలేదనీ కాని తన అక్క జ్యేష్టాదేవికి వివాహం కాకుండా తాను వివాహం చేసుకోవడం సమంజసం కాదు కాబట్టి, ముందు జేష్టాదేవికి వివాహం జరిపించమని కోరింది. లక్ష్మీదేవి మాటలు సమంజసమేనని గ్రహించిన పెద్దలు, ఉద్దాలకుడు అనే మునితో జెష్టాదేవికి వివాహం జరిపించారు. అయితే భర్తతో ఆశ్రమంలో అడుగు పెట్టిన జేష్టాదేవికి ఆ ఆశ్రమ వాతావరణం నచ్చలేదట.
వెంటనే భర్తకు తన ఆలోచన తెలియ జేసింది. దైవభక్తి, ధార్మిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, తనకు నచ్చవని, దైవనామస్మరణ వినబడని ప్రదేశాలు, యజ్ఞ యాగాదులు, పూజలు మొదలైన ధార్మిక కార్యక్రమాలు జరగని చోటు , నిత్యం కలహాలతో నిండి ఉన్న ప్రాంతాలు, నీటి నియమాలకు చోటు లేని ప్రదేశం వెతికి తనను అక్కడ ఉంచమని కోరింది. భార్య మీద అనురాగంతో సరేనన్నాడు ఉద్దాలకుడు. తానూ వచ్చేవరకు ఈ చెట్టు క్రింద ఉండమని రావి చెట్టు క్రింద కూర్చుండబెట్టి వెళ్లిపోయాడు. సాక్షాత్తు విష్ణుస్వరూపమైన రావిచెట్టు క్రింద కూర్చుని భర్త కోసం ఎదురు ఈ చూస్తోంది. అయితే ఆమెకు నచ్చే అనుక కూలమైన ప్రదేశాలను వెతుకుతూ త్వరగా తిరిగి రాలేకపోయాడు ముని.
Templeinfo | దేవతావృక్షాలు | రావిచెట్టు
ఎంతకీ రాని భర్తమీద బెంగతో విలపించడం మొదలు పెట్టింది. ఆమె రోదనలు విన్నవిష్ణుమూర్తి ఆమె ముందు ప్రత్యక్ష మయి, ఆమెను ఓదార్చి, నివాసం కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవలసిన పని లేదని, తన అంశతో ఆవిర్భవించిన ఈ రావిచెట్టునే స్థిర నివాసంగా మార్చుకొమ్మని, పుణ్యదినాలలో రావి చెట్టును తాకి పూజించవచ్చని, అలా చేస్తే లక్ష్మీదేవి కరుణ లభిస్తుందని చెప్పాడట విష్ణుమూర్తి. అప్పటి నుంచి రావిచెట్టు పూజకు శనివారం శ్రేష్టమైనదిగా మారిందని పురాణ కథనాలు చెప్తున్నాయి.

No comments:

Post a Comment