Wednesday, June 27, 2018

వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి తెరపైకి .....

వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి మళ్లీ తెరపైకి వచ్చింది

Controversial child goddess Shambhavi

శాంభవి ....

సుమారు ఓ ఎనిమిది సంవత్సరాల క్రితం దేశంలో సంచలనం రేపిన పేరు. తాను గతజన్మలో దలైలామా స్నేహితురాలినని, గౌతమబుద్ధుని శిష్యురాలినని, టిబెట్ కు స్వాతంత్ర్యం తీసుకురావడానికే పుట్టిన కారణజన్మురాలినని ప్రకటించుకొని దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ తరువాత కొంతకాలానికే మళ్ళీ తెరమరుగయింది బాలసన్యాసిని శాంభవి. ఆ తరువాత ఆ పాప ఎక్కడుందో కూడా తెలియలేదు. యధాప్రకారం మీడియాతో పాటు సామాన్యజనం కూడా మర్చిపోయారు. ఇప్పుడా వివాదాస్పద బాల సన్యాసిని శాంభవి మళ్లీ తెరపైకి వచ్చింది...
2009లో క‌ర్నూలు జిల్లాలో ఏడేనిమిదేళ్ల ఓ చిన్నాఎనిమిదేళ్ళ శాంభ‌వి బాల‌స‌న్యాసిగా వెలుగులోకొచ్చింది. అప్పట్లో ఆ పాప, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. తాను, ద‌లైలామా పూర్వ‌జ‌న్మ‌లో స్నేహితులమని, గౌత‌మ బుద్దుని శిష్యులమని చెప్పి సంచలనం రేపింది. అంతేకాదు టిబెట్ దేశానికి మ‌రో మూడు ఏళ్ల‌లో స్వాతంత్య్రం ఇప్పించేందుకే  తాను జ‌న్మించాన‌ని, వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి వీర‌భోగ వ‌సంత‌రాయులుగా  మ‌ళ్లీ జ‌న్మించి, దుష్ట శిక్ష‌ణ‌,శిష్ట‌ ర‌క్ష‌ణ చేస్తాడ‌ని, 2012వ సంవ‌త్స‌రంలో భూమిలో చాలామటుకు  న‌శిస్తుంద‌ని, ఇందులో భార‌త‌దేశం బాగానే ఉంటుంది కానీ, చైనా,పాకిస్థాన్,అమెరికా లాంటి దేశాలు మాత్రం నాశ‌నమయిపోతాయ‌ని ఇలా చాలా చాలా విషయాలే చెప్పింది బాల సన్యాసిని శాంభ‌వి.  త‌న‌కు చాలా మాన‌వాతీత‌,దైవ శ‌క్తులున్నాయ‌ని,ద‌లైలామాతో టెలిప‌తిలో మాట్లాడుతాన‌ని కూడా చెప్పుకుంది.
ఈ విషయం మీద దీనిపై బాబు మానవతావాది గోగినేని ముందుకొచ్చి, ఇదంతా ఒత్తి అభూతకల్పనని, శాంభవిని బాల‌స‌న్యాసిగా ప్ర‌చారం చేస్తూ, జ‌నంలో మూఢ‌న‌మ్మాకాన్ని స్ప్రెడ్ చేస్తున్నార‌ని, ఆ బాలిక హ‌క్కులు కాల‌రాస్తున్నార‌ని, స్కూలుకి వెళ్లి చదువుకోవలసిన పాపను ఇలా బాల సన్యాసిని గా ప్రచారం చేసి ఆ పాపను బాల్యానికి దూరం చేస్తున్నారని, ఇదంతా ఆధ్యాత్మికత పేరుతొ చేస్తున్న వ్యాపారమని  గట్టిగా చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అప్పట్లో ఈ విషయం మాన‌వ‌హ‌క్కుల సంఘందాకా వెళ్లింది. ఆర్డీవో విచార‌ణ కూడా జ‌రిగింది. అప్ప‌ట్లో కోర్టు కూడా శాంభవిని స్కూళ్లో చేర్పించి, చ‌దువు చెప్పించాల‌ని తీర్పిచ్చింది. ఆ త‌ర్వాత బాలసన్యాసిని సడెన్ గా మాయమయింది.  ఎక్క‌డుందో కూడా ఎవరికీ తెలియలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు  స‌డెన్ గా ఇప్పుడు ప్ర‌త్య‌క్ష‌మైంది బాలసన్యాసిని శాంభ‌వి.
రావడం రావడమే బాబు గోగినేనిపై ఆరోప‌ణ‌లతో వచ్చింది. ఆయ‌న తమ ఆశ్ర‌మం ప‌క్క‌న ఓ శ‌వాన్ని పాతిపెట్టించాడని, అనేక ఇబ్బందులకు గురిచేసాడని, తన ఫోటోల‌ను మార్ఫింగ్ చేయించి ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడ‌ని, ద‌లైలామాపై కూడా దుష్ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, ఆయనపై  క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు తాము సిద్దం అవుతున్నామంటూ ఆయ‌న నుంచి త‌మను తాము కాపాడుకునేందుకు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌చ్చాన‌ని ఇలా చాలాచాలా అభియోగాలతో మళ్ళీ బయటికొచ్చింది బాలసన్యాసిని శాంభవి.
అయితే, ఇంత‌కాలం సైలెంట్ గా ఉండి,ఇప్పుడే ఎందుకు ఆమె బ‌య‌టికి వ‌చ్చిందీ 
బాలసన్యాసిని శాంభవి? దీనివెనుక కూడా చాలా చాలా ఊహాగానాలే మొదలయ్యాయి. కొంతకాలం క్రితం ఓ చానల్ లో వచ్చిన డిబేట్ లో బాబు గోగినేని త్వరలో చాలా ఇబ్బందుల్లో పడబోతున్నారని ఓ జ్యోతిష్యుడు చెప్పడం, ఈ నేపధ్యంలో ఈ బాలసన్యాసిని శాంభవి ఇలా బాబు గోగినేని మీద అభియోగాలతో రావడం, ఇదంతా ఏదో కుట్ర అని కొందరి ఊహాగానాలు. అసలింతకీ ఈ వ్యాఖ్యలకు స్పందించాల్సిన బాబు గోగినేని మాత్రం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల ఆయనెలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment