Monday, July 16, 2018

కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్

సంచలనంగా మారిన కిరణ్ బేడీ ట్వీట్  

Kiranbedi 1st lady IPS
కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్
ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ క్రొయేషియాపై విజయం సాధించింది. మరి సహజంగానే గెలిచిన వారికి జేజేలు పలకడం ఉన్నదే కదా. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఫ్రాన్స్ జట్టుకు అభినందనలు తెలియచేసారు. ఇప్పుడదే కిరణ్ బేడీ ని ఎగతాళి పాలు చేసింది.
ఫ్రాన్స్ విజయం సందర్భంగా పుదుచ్చేరియన్లం. ప్రపంచ కప్ గెలుచుకున్నాం. అభినందనలు అంటూ ట్వీట్ చేశారు కిరణ్ బేడీ. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఒకప్పుడు  ఫ్రెంచ్ భూభాగంలో ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఫ్రాన్స్ విజయాన్ని ఈ విధంగా వర్ణించడంతో నెటిజనలు ట్రోల్స్ మొదలుపెట్టేసారు. మనం భారతీయులమని గుర్తుంచుకోండిఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపాలంటూ చురకలేస్తున్నారు.     ఇంతకీ విశేషమేమిటంటే మనదేశంలో తోలి ఐ పి ఎస్ అధికారిగా కిరణ్ బేడీ 1972 లో సరిగ్గా ఇదేరోజు అంటే జూలై 16న నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఓసారి కిరణ్ బేడీ జీవిత విశేషాలు చూద్దాం....
కిరణ్ బేడి జూన్ 9, 1949వ తేదీన పంజాబ్ లోని అమృతసర్ లో జన్మించారు. 1972లో  పోలీస్ సర్వీస్ లో చేరారు. ఐపిఎస్ కేడర్ల అఫీసర్లలో ఈమే మొట్టమొదటి మహిళా ఆఫీసర్. డిసెంబర్ 2007 సంవత్సరంలో కిరణ్ బేడి డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు స్వచ్ఛంద సేవా సంస్ధలను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలకుగాను 1994 లో ఈమెకు రామన్ మెగసేసే అవార్డు లభించింది. టెన్నిస్ ఆటలో అద్భుత ప్రావీణ్యం ఉన్న కిరణ్ బేడీ 22 సంవత్సరాల వయసుకే అనేక జాతీయ స్ధాయి అవార్డులు గెలుచుకున్నారు. 1972 వ సంవత్సరంలో కిరణ్ బేడి బ్రిజ్ బేడి అనే పారిశ్రామిక వేత్తను మతాంతరం వివాహం చేసుకున్నారు. ఐపిఎస్ ఆఫీసర్ గా అనేక సాహసోపేతమైన నిర్ణయాలతో సుభాష్ అనిపించుకున్నారు. మత్తు మందుల నియంత్రణ వంటి విషయాల్లో చాలా సాహసోపేతంగా ముందుకు దూకారు. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కిరణ్ బేడి ఒక ప్రధాన సభ్యురాలు. కిరణ్ బేడి జీవితంపై ఆస్ట్రేలియా చలన చిత్ర నిర్మాత మేగన్ డోనేమన్ ఒక చిత్రాన్ని కూడా నిర్మించారు.

No comments:

Post a Comment