Friday, July 13, 2018

Iskcon temple on vaikuntha hill bangalore



ఇహలోకంలో వైకుంఠము 

Iskcon temple  on vaikuntha hill bangalore
Iskcon temple  on vaikuntha hill bangalore 
"సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హరిత నగరము, గ్రీన్ సిటీ, సరస్సుల నగరము, ఇలా ఎన్నో విశిష్టతలకు మారుపేరైన బెంగళూరులో చూడవలసిన ప్రసిద్ధ స్థలం ఇస్కాన్ టెంపుల్.  
11 ఎకరాల  విశాల ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు పూత గోపురంతో, బంగారు పూతతో ఏర్పాటు చేసిన 56 అడుగుల ధ్వజస్తంభంతో అద్భుత కృష్ణ మందిరంగా అలరారుతోంది ఇస్కాన్ టెంపుల్. ఇదే రాధాకృష్ణ మందిరంగా పిలుస్తారు. 

1987 వ సంవత్సరం సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ఏర్పాటయింది. ఈ ఇస్కాన్ టెంపుల్.  తరువాత ప్రభుత్వం  ఇచ్చిన 11 ఎకరాల స్థలంలో 1990 – 1997 మధ్యకాలంలో మందిర నిర్మాణం పూర్తీ చేసారు. ఈ రాధాకృష్ణ మందిరాన్ని  అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా 1997 మే 31 ప్రారంభించారు..
                         దీనిగురించి కూడా తెలుసుకోండి 
                         కెంప్ ఫోర్ట్ బెంగుళూరులో మరో అద్భుతం 
 ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్‌ అనే ప్రాంతములో ఉంది బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం . మెజస్టిక్‌ నుండి ఇస్కాన్ టెంపుల్ కి సిటీ బస్సులు ఉన్నాయి. శ్రీరామనవమి,నరసింహ జయంతి, రథయాత్ర, బలరామ జయంతి,శ్రీ కృష్ణాష్టమి, రాదాష్టమి, వైకుంఠ ఏకాదశి, వ్యాసపూజ, గోవర్ధనపూజ,లాంటి పర్వదినాల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
బెంగుళూర్ జయనగర్ లో హరేకృష్ణ కొండమీద ఉన్న  ఈ రాధాకృష్ణ చంద్ర ఆలయం' నిరంతరం భక్తులతో కిటకిటలాడుతుంటుంది .  జనం మానసికవిశ్రాంతికైఈ అలయానికి వస్తుంటారు. అద్భుతమైన శిల్పకళకు నిలయం ఈ ఆలయం. ఉన్నతమైన నాల్గు గోపురాలతో,  బంగారు పూత తో  వున్న శిఖరం మీది  షుమారు 1.5 టన్నుల బరువున్న కలశంతో బెంగుళూరు వెళ్ళిన ప్రతి ఒక్కరు చూడవలసిన ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే  56అడుగుల ఎత్తైన ధ్వజ స్థంభం కనువిందు చేస్తుంది. ఆలయంలో కృష్ణ , బలరామ, మూర్తులతో పాటు గౌరాంగ మూర్తులను చూడ వచ్చు. ప్రశాంతంగా ' ధ్యానం' చేసుకునే  భక్తులకు  అనువైన పవిత్ర ప్రదేశం ఇది. ప్రతిరోజూ 6నుండి8 వేల మంది భక్తులు  వస్తారు

No comments:

Post a Comment