Monday, July 9, 2018

జోన్స్ టౌన్ నరమేధం


చరిత్రలో అత్యంత విషాద సంఘటన జోన్స్ టౌన్ నరమేధం


jonstown mass suicides
మూఢత్వంతో కూడిన మతవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఎంతటి దారుణానికి దారితీస్తాయో మొన్న ఢిల్లీలో జరిగిన సామూహిక ఆత్మహత్యల సంఘటన రుజువు చేస్తోంది. కొన్నిరోజున క్రితం  ఢిల్లీలోని బురారీలో ఓ కటుంబంలోని 11 మంది సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ మరణాల వెనుక ఉన్న కారణాల గురించి రకరకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేక హత్యలా అని కూడా అనుమానాలతో పోలీసు శోధనలు జరుగుతున్నాయి. ఏతావాతా ఇప్పటికి తేలిందేమిటంటే అందరూ మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని. ఆ ఇంట్లో దొరికిన కొన్ని కాగితాలలో రాతలు చూసిన తరువాత కేవలం మూఢవిశ్వాసాలతో మోక్షం కోసమే వీరు స్వఛ్చందంగా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కాగితాల్లో ఏం రాసుందో తెలుసా... మానవదేహం తాత్కాలికం, అశాశ్వతం కాబట్టి మోక్షం కావాలంటే ఆత్మహత్య చేసుకోవాలి. అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని, చేతులు వెనక్కు కట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలని! ఇలా ఆత్మహత్య చేసుకుంటే మోక్షం కలుగుతుందని. ఆ ఇంట్లో ఉన్నవారు విపరీతమైన మతనమ్మకాలతో ఉండేవారని కొందరు చెప్తుంటే... కాదు కాదు వాళ్ళు బాగా చదువుకున్నవారు కాబట్టి ఈ మరణాల వెనక ఏదో మిస్టరీ ఉందని కొందరు అంటున్నారు. దాంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అన్ని ఏంగిల్స్ లోను కొనసాగుతోంది.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే మొత్తం కుటుంబమంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న ఈ సంఘటన జరిగిన తరువాత, ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఉదంతం మళ్ళీ తెరమీదికోచ్చిండి. ప్రపంచ చరిత్రలోనే భారీ అతి పెద్ద విషాదాంగా మిగిలిపోయిన సంఘటన అది. ధిల్లీ సంఘటనలో ఒకే కుటుంబంలో 11 మంది చనిపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తే, ఈ సంఘటన ఎవ్వరూ జీర్ణించుకోలేని అతి పెద్ద విషాదం. అదే జోన్స్ టౌన్ నరమేధం. గుయానాలోని జోన్స్ టౌన్ లో 1978 నవంబర్ 19900 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రపంచ చరిత్రలోనే ఓ దుర్ఘటన. అంధవిశ్వాలకు, మూర్ఖమైన, మూఢమైన మతనమ్మకాలకు పరాకాష్టగా నిలిచిపోయింది. మత నమ్మకాలు మనుషుల ప్రాణాలు ఎంత సులువుగా తీస్తాయనేదానికి ఈ ఘటన ఉదాహరణ. అమెరికా మతగురువు, పీపుల్స్ టెంపుల్ వ్యవస్థాపకుడు జిమ్ జోన్స్ కి వేల సంఖ్యలో అనుచరులుండేవారట. ముందువెనుకలు ఆలోచించకుండా  గుడ్డిగా అతడేం చెపితే అది చేయడానికి వేలాదిమంది అనుచరులు సిద్ధంగా ఉండేవారట. అయితే అదే సమయంలో జోన్స్ టౌన్ లో పరిస్థితులు బాగా లేవని, పూర్తిగా అక్రమాలు సాగుతున్నాయన్న వార్తతో అమెరికా రంగంలోకి దిగింది. లియో ర్యాన్ ను తన ప్రతినిధిగా అమెరికా జోన్స్ టౌన్ కు పంపింది. పీపుల్స్ టెంపుల్ ముసుగులో జరుగుతున్నా అరాచకాలు బట్టబయలు కావడంతో జోన్స్ టౌన్ పై ప్రభుత్వం వైమానిక దాడులకు సిద్దమయింది. పీపుల్స్ టెంపుల్ సభ్యులను కొందరిని అమెరికా సైన్యం అప్పటికే కాల్చిచంపింది. దీంతో జిమ్ జోన్స్ తమ అనుచరులందర్నీ ఒక్కదగ్గర చేరవలసిందిగా పిలుపునిచ్చాడు. ఆయన ఆదేశం కోసం ఎదురుచూస్తున్న శిష్యులందరూ తమ పిల్లలు, కుటుంబాలతో సహా ఒక దగ్గర చేరారు. వచ్చిన వాళ్ళందరికీ విషం తాగి ఆత్మహత్యలు చేసుకోవలసిందిగా ఆదేశించాడు జోన్స్.  ఆ మతగురువు మాటే వేదంగా నరనరాన జీర్ణించుకున్న వాళ్ళందరూ జోన్స్ ఆదేశం మేరకు విషపు పానీయాన్నితాగి సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.
అన్నిటికంటే దారుణమేంటంటే చనిపోయినవారిలో ఐదొంతులుమంది చిన్నపిల్లలేనట. వారికి స్వయంగా తల్లిదండ్రులే తమచేతులతో విషం ఎక్కించి చంపేశారు. దాదాపు తొమ్మిదివందల మందిని సామూహికంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన తరువాత జిమ్ జోన్స్ కూడా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే కుటుంబంలో 11 మంది అలాంటి నమ్మకాల కారణంగానే చనిపోవడం చూస్తే అత్యంత ఆధునిక కాలంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా మనం ఎటు వేలుతున్నామో అర్ధం కావడంలేదు. మతం అనేది మనల్ని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన జీవితం వైపు నడిపించాలి కాని ఇలా ప్రాణాల్ని కూడా హరించేంత మూర్ఖత్వం వైపు నడిపించడం తీవ్రంగా అలోచించాల్సిన విషయమే.

1 comment:

  1. మతం అనేది మనల్ని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన జీవితం వైపు నడిపించాలి కాని ఇలా ప్రాణాల్ని కూడా హరించేంత మూర్ఖత్వం వైపు నడిపించడం తీవ్రంగా అలోచించాల్సిన విషయమే.

    ReplyDelete