Friday, July 13, 2018

puri jagannatha temple history | జై జగన్నాథ - 11


జగన్నాథ ఆలయ నిర్మాణం

puri jagannatha temple history
puri jagannatha temple history
జగన్నాథ క్షేత్రానికి సంబంధించిన మరో కథనం ప్రకారం ద్వాపరయుగాంతం లో శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్రలు తనువు చాలించిన తరువాత.. వారి శరీరాలకు సంస్కారాలు చేస్తున్న సమయంలో సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచెత్తిందని, అప్పుడు ఓద్రదేశంలో సముద్రపు ఒడ్డున ఉన్న గిరిజనులకు దొరికిందని, వారు ఆ శరీరాన్ని దారువులో అంటే చెక్కలో నిక్షిప్తం చేసి తమ కులదైవంగా పూజలు చేస్తుండేవారని.. ఇలా విభిన్న కథనాలు వినబడతాయి జగన్నాథుడి అవతరణ విషయంలో. శ్రీకృష్ణ పరమాత్మ సోదరీ, సోదరులతో కలసి వెలసిన అపురూప క్షేత్రంగా దీనిని వర్ణిస్తారు. ఇక్కడ వెలసిన బలభద్రుడు ఆదిశేషుని అంశ అనీ, సుభద్రాదేవి సాక్షాత్తు లక్ష్మీ దేవి అంశ అనీ, లక్ష్మీ దేవి అంశ ద్వాపరయుగంలో రోహిణీదేవి గర్భాన సుభద్రగా జన్మించిందనీ చెప్తారు.
ఆలయ నిర్మాణం, దేవతామూర్తుల ప్రతిష్ఠ
puri jagannath temple history
puri jagannatha temple history
ఆలయం మొదట నారదమహర్షి సలహా, సూచనల ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు చేత నిర్మించబడింది. ప్రపంచబ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. వైశాఖమాస శుక్లపక్షంలో అష్టమినాడు పుష్యయోగంలో బలభద్రుని ద్వాదశాక్షరీ మంత్రంతోను, జగన్నాధుని, సుభద్రమ్మను దేవీసూక్త మంత్రాలతోనూ ప్రతిష్టించాడు బ్రహ్మదేవుడు. ఆ కారణంగానే ఎప్పుడైనా వైశాఖమాసంలో శుక్లపక్షంలో అష్టమీ తిధి, గురువారం, పుష్యయోగం కలిసి వస్తాయో ఆనాడు సుభద్రా, బలభద్ర సమేత జగన్నాధుని దర్శనం చేసుకున్నవారికి అద్భుతమైన పుణ్యఫలితాలందుతా యని, అలా దర్శించుకున్న వారికి కోటి జన్మలలో  చేసిన పాపాలు కూడ నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడు ఆలయం కట్టించి జగన్నాథుడిని ప్రతిష్టించాడు. ఆ తరువాత అంటే దాదాపు ఎనభై ఏళ్ల తరువాత జగన్నాథుని పట్ల ఆకర్షితుడైన మహాపద్మనందుడనే రాజు జగన్నాధుని విగ్రహాన్ని మగధకు తీసుకువెళ్లి పోయాడని, ఆ తరువాత క్రీ||పూ|| రెండవ శతాబ్దంలో కళింగరాజు ఖారవేలుడు మగధపై దండయాత్ర చేసి మళ్లీ స్వామి విగ్రహాన్ని తిరిగి ఇక్కడికి తెచ్చినట్టు కొన్ని చరిత్ర కథనాలు చెప్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఉన్న ఆలయం మాత్రం
12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన కళింగ ప్రభువు అనంతవర్మ చోడగంగ ఆరంభించగా ఆయన మనుమడు రాజా అనంగభీమ్ దేవ్ పాలనలో నిర్మాణం పూర్తయినట్లు శాసనాలు, రాజవంశానికి చెందిన రాగి, ఫలకాలు తెలియజేస్తున్నాయి. మరో కథనం ప్రకారం క్రీ|||| 1174లో కళింగ ప్రాంతానికి రాజయిన అనంగభీమదేవుడు ఒక బ్రాహ్మణుని వధించడం జరిగిందని, ఆ హత్యాపాతకానికి పరిహారంగా ఈ ఆలయ నిర్మాణం చేసాడని తెలుస్తోంది. ఈ నిర్మాణం పూర్తి కావడానికి పధ్నాలుగు సంవత్సరాలు పట్టిందట. ప్రాణప్రతిష్ట 1198వ సంవత్సరంలో జరిగినట్టు తెలుస్తోంది. ఆలయం సుమారు నాలుగు లక్షల చదరపు అదుగుల వైశాల్యం, ఎత్తైన ప్రాకారంతో 214 అడుగులు  ఎత్తైన శిఖరంతో సమున్నతంగా నిలిచి ఉంటుంది ఆలయం. ఈ శిఖరంపై సుదర్శన చక్రంగా పరిగణించే నీలచక్రం అత్యంత ఠీవిగా ఉంటుంది. ఈ శిఖరం మీద ఉండే ధ్వజాన్ని ప్రతిరోజు మారుస్తుంటారు. లోపల దాయితలుగా చెప్పబడే పూజారులు సమావేశాలు నిర్వహించుకునే మందిరాలు ఆలయనిర్వహణకు సంబందించిన కార్యాలయాలు, విశ్రాంతి మందిరాలు వంటి వివిధ రకాలయిన భవనాలు 120 వరకు ఆలయాలతో ఉంటుంది. ఉత్కళ సంప్రదాయ శిల్పకళారీతులకు దర్పణం ఈ ఆలయంలోని శిల్పకళ. అత్యంత పురాతమైన ఈ ఆలయం నలువైపులా నాలుగు ద్వారాలతో అలరారుతోంది. భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించేది మాత్రం తూర్పు ద్వారమే. ఇదే ప్రధాన ద్వారం. ఇదే సింహద్వారం. ప్రధానద్వారానికి ఇరువైపులా నిలువెతు సింహపు ప్రతిమలు ఠీవిగా మనకు స్వాగతం చెప్తాయి. వాటితో పాటు వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ద్వారపాలకులుగా ఉండే జయవిజయులు కూడా సింహద్వారానికిరువైపులా నిలచి ఉంటారు. ఈ ద్వారాన్నే సింగద్వారం అని కూడా పిలుస్తారు. ఈ ద్వారం బడదందా లేదా పెద్ద రోడ్డుగా చెప్పబడే మార్గం వైపు ఉంటుంది. మిగిలిన ద్వారాలు హాథీద్వారా, వ్రాఘ్రద్వార్, అశ్వద్వార్.
సువిశాలమైన ప్రదేశంలో అలరారే జగన్నాథ దేవాలయం చుట్టూ ఇతర దేవతల ఉపాలయాలు, వంటశాల.. ఆనందబజార్ గా పిలువబడే ప్రసాదాలను విక్రయించే మందిరం, మండపాలు, పూజారుల విశ్రాంతి మందిరాలు, నాట్యమండపం, నృత్యగానాదులు నిర్వహించే నాట్యమందిరం,
ప్రార్థనలు నిర్వహించే జగమోహనమండపం ఇలా ఎన్నో మండపాలున్నాయి. ఇక్కడ ఉన్న విమలాదేవి మందిరం అత్యంత ప్రఖ్యాతమైనది. ఈమెను భైరవిగాను, జగన్నాధుని భైరవునిగాను పూజిస్తారు. పూరీ క్షేత్రంలో అన్నప్రసాదాన్ని ముందు భైరవునికి సమర్పించి తరువాత భైరవి అంటే విమలాదేవికి సమర్పిస్తారు. ఆలయం లోపల చిన్న చిన్న ఉపాలయాలు అనేకం కనబడతాయి. భువనేశ్వరి, వేదకాళి, వైకుంఠేశ్వరుడు, ఈశానేశ్వరుడు, హనుమంతుడు, గౌరాంగుడు నృసింహుడు, చక్రనారాయణుడు, గణేశుడు, అన్నపూర్ణాదేవి నవగ్రహాలు, సూర్యభగవానుడు, రాధావల్లభుడు మొదలైన మందిరాలనేకం ఉన్నాయి.

రత్నవేదిక

ఆలయాంతర్భాగంలో మూలమూర్తులు కొలువైన ఎత్తైన వేదికను రత్నవేదికగా పిలుస్తారు. దీనినే రత్నవేదిక, శ్రీపీఠం అని కూడా వ్యవహరిస్తారు. ఈ వేదిక మీద మూలమూర్తులు కాక మరో చిన్న మూర్తులు మూడు దర్శనమిస్తాయి. అవి శ్రీదేవి, భూదేవి, జగన్నాధుని ప్రతిరూపమయిన నీలమాధవమూర్తి. శ్రీదేవి విగ్రహం బంగారంతోను, భూదేవి విగ్రహం వెండితోను నిర్మించబడినవి. మిగిలినవి వేపకర్రతో చేసినవి. జగన్నాథుడు ప్రతిష్ట కాకముందు నీలమాధవుడు ఒక్కడే రత్నవేదిక మీద ఉండేవాడని భక్తుల నమ్మకం.

అసంపూర్ణ విగ్రహాల వెనుక కథ

పూరి క్షేత్రంలో దేవతామూర్తులు అసంపూర్ణమైన అవయవాలతో మనకు దర్శనమిస్తారు. ఇలా ఎందుకంటే దానికొక పురాణకథనాన్ని చెప్తారు.....

No comments:

Post a Comment