Thursday, July 12, 2018

జై జగన్నాథ - 10 | puri temple history

గిరిజన దేవుడు నీలమాధవుడు


puri temple history
ఈ పూరీ క్షేత్రానికి సంబంధించి మరికొన్ని స్థల పురాణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జగన్నాథుడు నీలమాధవుడు అన్న పేరుతొ ఆ ప్రాంతంలో గిరిజనులు ముఖ్యంగా శబర, సోరా అని పిలువబడే సవరల చేత పూజించబడుతూ ఉండేవాడు.వారు తమ దేవుడు నీలమాధవుడని బయటి ప్రపంచానికి తెలియకుండా పూజించుకుంటూ ఉండేవారు. ఆనాటి రాజు ఇంద్రద్యుమ్నుడు శ్రీమన్నారాయణునికి పరమభక్తుడు. నిరంతరం ఆ స్వామి ఆరాధనతోనే రాచకార్యాలు నిర్వహిస్తూ ఉండే వాడు.
రాజుకు నీలమాధవుని ఉదంతం తెలిసి, ఆ నీలమధావుదిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టింపచేయాలని అనుకున్నాడు. కాని గిరిజన నాయకుడు విశ్వావసు నీలమాధవుదిని చూపించదానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నించినా మహారాజుకు కనీసం నీలమాధవుడిని దర్శించడానికి కూడా సాధ్యం కాలేదు.అయినా పట్టు విడవలేదు రాజు. విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుడిని కార్యం సానుకూలపరచుకొని రమ్మని పంపాడు. అలా వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు గిరిజన నాయకుడి దగ్గర చేరి,అతనితో స్నేహ సం బంధాలు నెలకొల్పుకున్నాడు. నీలమాధవుని ఆచూకీ తెలుసుకోవడం మాత్రం సాధ్యం కాలేదా యువకునికి. చివరికి ఆ ప్రయత్నంలో భాగంగానే గిరిజన నాయకుడు విశ్వావసు కుమార్తె లలితను వివాహం చేసుకున్నాడు బ్రాహ్మణ యువకుడు విద్యాపతి. అలా తనకు అల్లుడిగా మారిన విద్యాపతి నీలమాధవుడ్ని చూపించమని పదేపదే కోరడంతో కాదనలేకపోయాడు విశ్వావసు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో అల్లుడిని తీసుకొని బయలుదేరాడు తమ కులదైవాన్ని చూపించడానికి. అయితే అలా తీసుకువెళ్తున్నప్పుడు అతడు మళ్లీ ఆ మార్గం గుర్తుపట్టకుండా ఉండడానికి అతడి కళ్ళకు గంతలు కట్టి మరీ తీసుకువెళ్ళాడు. అయితే అతడి కంటే తెలివైన విద్యావతి తాను వెళుతున్న దారిపొడుగునా ఆవాల్ని  జారవిడుస్తూ వెళ్ళాడు. కొన్నాళ్ళకు ఆ ఆవాల్నుంచి మొక్కలు లేచి మార్గం స్పష్టంగా తెలిసేలా తయారయింది. సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న విద్యాపతి నీలనూధవుడి దర్శించడానికి మార్గం దొరికిందని వెంటనే బయలుదేరి రమ్మని రాజుకు కబురుపంపాడు. కబురందుకొని వచ్చిన రాజును వెంటబెట్టుకొని వెళ్ళాడు విద్యాపతి. వీరు స్వామిని దర్శించేలోగానే భూమిలోనికి అంతర్హితుడయిపోయాడు నీలమాధవుడు. జరిగిన సంఘటనకు ఎంతో బాధపడిన రాజు దుఃఖంలో మనిగిపోయాడు ఇతడి ఆర్తికి కరిగిపోయిన జగన్నాథుడు కలలో కనబడి సముద్రంలో కొయ్యదుంగలు కొట్టుకువస్తాయని వాటితో తమ విగ్రహాలు తయారు చేయించి ఆలయంలో ప్రతిష్టించమని  చెప్పాడట. ఆ విధంగా చేసాడు ఇంద్రద్యుమ్నుడు.

No comments:

Post a Comment