Wednesday, July 11, 2018

సుఖాంతమైన థాయ్ రాకాసి గుహ కథ


సుఖాంతమైన థాయ్ రాకాసి గుహ కథ

tham luang cave thailand
హమ్మయ్య ఎట్టకేలకు థాయ్ లాండ్ రాకాసి గుహ కథ సుఖాంతమయిండి. గత కొన్ని రోజులుగా యావత్ ప్రపంచందృష్టి ఆ థాయ్ లాండ్ రాకాసి గుహ మీదే. ఏమైతేనేం చివరకు ప్రపంచమంతా, ముఖ్యంగా థాయ్ లాండ్ లోని 13 కుటుంబాల వారు ఈ రోజే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నేటికి సరిగ్గా 18 రోజుల క్రితం థాయ్ లాండ్ లోని థామ్ లువాంగ్ గుహలోకి వెళ్ళిన 12 మంది పిల్లల సహా ఓ కోచ్  ఆ గుహలోనే చిక్కుకుపోయారు.
వాళ్ళను బయటకు తీసుకురావడానికి థాయ్ నేవీ సీల్స్‌కు చెందిన సిబ్బంది, సైనికులు అహర్నిశలు కష్టపడి విజయం సాధించారు. క్షణమొక యుగంగా గడిచిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

ఇంతకీ ఆ బాలలు గుహలోకి ఎందుకు వెళ్లినట్టు!


ఓ ఫుట్‌బాల్ టీమ్ కోచ్ తన 12 మంది స్టూడెంట్స తో  కలిసి జూన్ 23న సైక్లింగ్ చేసుకుంటూ ఈ గుహలున్న ప్రాంతానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో భారీగా వర్షం కురుస్తుండంతో తల దాచుకునేందుకు గుహలోపలికి వెళ్లారు. అంతే భారీవర్షం, ఆ రాకసిగుహ కలిసి వాళ్లకిక బయటకొచ్చే అవకాశం లేకుండా చేసేసాయి. వర్షం నుంచి తలదాచుకునేందుకు గుహలోకి వెళ్ళిన ఆ 13 మంది వర్షం ఇంకా పెద్దడవడం, గుహముందు భాగం అంటా నీతితో నిండిపోవడంతో ఇంకాస్త లోపలి వెళ్ళారు. అలా అలా ఆ వరద నీటి నుంచి తప్పించుకునేందుకు వీళ్ళింకా లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారు. అలా కొన్ని కిలోమీటర్ల లోపలి వెళ్ళిపోయారు. ముందంతా నీరు నిండిపోవడంతో ఇక వెనక్కి రాలేని పరిస్థితిలో తొమ్మిది రోజులపాటు ఎలాంటి ఆహరం లేకుండా గాలి కూడా అందని ఆ గుహలోనే ఉండిపోయారు.
ఈ పిల్లలు, కోచ్ ఏమయిపోయారో అన్న అందోళనలో పడిపోయిన వారి కుటుంబాల సమాచారంతో థాయ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాగైతేనేం చివరకు థాయ్‌లాండ్‌లోని డోయ్ నంగ్ పర్వతంలో ఉన్న ఈ గుహల దగ్గర సైకిళ్ళు కనబడడంతో ఈ ప్రాంతంలో సైకిళ్ళు ఎలా ఉన్నాయని ఆరా తీయడంతో వారి ఉనికి బయటపడింది.

ప్రపంచదేశాలన్నీ కలగలిసిన వేళ

tham luang cave thailand
దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ గుహలు అత్యంత ప్రమాదకరమైనవిగా చెప్తారు. లోపలి వెళ్ళడానికి ఒకే ఒక్క దారున్న ఈ గుహ లోపల మాత్రం ఇంకా చాలా గుహలే ఉన్నాయట. అందుకే ఆ గుహల్లో లోపలి వెళ్ళిన తరువాత ఎక్కడున్నామో, ఎటు వచ్చామో కూడా తెలియదట. వెనక్కు వచ్చే దారి కనిపెట్టడం కూడా కష్టమెనట. అందుకే ఈ పిల్లల్లి రక్షించే ప్రయత్నంలో చాల దేశాలు పాలు పంచుకున్నాయి. థాయ్ నేవీ సీల్స్‌ తో పాటు బ్రిటన్, ఐరోపా, ఆస్ట్రేలియాల అధికారులు, డైవర్లు ఇందులో పాలుపంచుకున్నారు.

యుద్ధాన్ని తలపించే రెస్క్యూ ఆపరేషన్

18 రోజులుగా గుహలో బయటకు వచ్చే దారిలేక వరదలో, తిండిలేకుండా సరిగ్గా ఆక్సిజన్ కూడా అందని స్థితిలో చిక్కుకుపోయిన వాళ్ళను రక్షించడం అంతా ఈజీ కాదు. బయటకోస్తున్న వార్తల బట్టి చూస్తె రెస్క్యూ టీం దాదాపు యుద్దం చేసినంత పనయిందని తెలుస్తోంది. లోపల అంచెలంచెలుగా ఉన్న గుహలలో వీళ్ళేక్కడ ఉన్నారో కనిపెట్టాడానికే చాల సమయం పట్టిందట. ఏమైతేనేం చివరకు కనిపెట్టారు. గుహలపైనుంచి రంధ్రాలు చేసి పిల్లల్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇంకోవైపు ఆగని వర్షం, వరద. ఇలాంటి పరిస్థితిలో చివరకు యంత్రాల ద్వారా లోపలున్న వరద నీటిని ఓ వైపు తోడుతూనే, మరో వైపు భారీ వర్షంతో లోపలకోస్తున్న వరదను ఎదుర్కొంటూ, డైవర్లు ఒక్కొక్కరు రెండేసి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర సామాగ్రి తీసుకొని లోపలకు వెళ్లి ఒక్కొక్క బాలుణ్ణి అంచెలంచెలుగా బయటకు తీసుకువచ్చారు. అది కూడా అంత ఈజీ కాదు. ఒక్క మనిషి డైవ్ చేసుకొని వెళ్ళాలన్నా కూడా సాధ్యంకాని రీతిలో ఉన్న ఆ సన్నని దారిలో, వరదలో ఓ వైపు పాతిక కేజీలున్న ఆక్సిజన్ సిలిండర్లతో ఒక్కొక్క బాలుణ్ణి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీళ్ళందరూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. రాకాసి థాయ్ గుహ కథ సుఖాంతం అయింది. విచారించాల్సిన విషయమేంటంటే ఈ ఆపరేషన్ లో ఓ అధికారి మాత్రం ప్రాణాలు కోల్పోయారట.

అభినందనల వరదలో థాయ్ నేవీ సీల్స్

చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చిన నేవీ సీల్స్‌పై యావత్ ప్రపంచం అభినందనల వరదలో ముంచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఇంత చాకచక్యంగా పిల్లల్ని రక్షించిన థాయ్ నేవీసీల్స్ కు ప్రపంచంలోని ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు సోషల్ మీడియా ద్వారా నీరాజనాలు పలుకుతున్నారు.

No comments:

Post a Comment