Friday, July 13, 2018

యామినీ కృష్ణమూర్తి జీవితంతో బయోపిక్

 వెండితెరకు మరో బయోపిక్ యామిని కృష్ణమూర్తి 

       ప్రస్తుతం బయోపిక్ ల కాలం జోరుగా నడుస్తోంది. వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి జీవితంతో వచ్చిన మహానటి చిత్రం అఖండ విజయాన్ని సాధించి, ఊహల్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోయినా విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్, ఇంకా చాలామంది క్రీడాకారుల జీవితాలతో మరిన్ని చిత్రాలు  రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు ఎక్కబోతోందట. యామినీ కృష్ణమూర్తి...వారిగురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  నాట్యానికి మారుపేరు.  కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కళాకారిణి. పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి ఎన్నో అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఇప్పుడామె జీవితం తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు చలనచిత్రం గా రాబోతోంది.
 ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్‌ గోపాల్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వార్తలోస్తునాయి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి స్వయంగా యామిని కృష్ణమూర్తి గారే కోరియోగ్రఫీ అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ బయోపిక్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సో.... బయోపిక్ ల కాలం ఇలా ముందుకు వెళుతోంది. 

No comments:

Post a Comment